Supreme Court | ఈసీ నియామకాల చట్టంపై సుప్రీంలో భిన్న తీర్పులు
Supreme Court | ఈసీ నియామకాల చట్టంపై సుప్రీంకోర్టు (Supreme Court)లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి (SC Delivers Split Verdict). ఈ కేసును ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను జస్టిస్ దీపాంకర్ దత్తా తోసిపుచ్చారు. అయితే, దత్తా అభిప్రాయాలతో జస్టిస్ సతీష్ చంద్ర శర్మ విభేదించారు. ఈ వ్యవహారంలో ఒక ప్రధానమైన చట్టపరమైన ప్రశ్న ఇమిడి ఉందని.. ఈ అంశాన్ని పెద్ద ధర్మాసనం పరిశీలించాలని అభిప్రాయపడ్డారు.
Supreme Court | త్రినేత్ర న్యూస్ : ఈసీ నియామకాల చట్టంపై సుప్రీంకోర్టు (Supreme Court)లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి (SC Delivers Split Verdict). ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్-2023 రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ దీపాంకర్ దత్తా (Justices Dipankar Datta), జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ (Satish Chandra Sharma) విచారించారు. దీనిపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలతో కూడిన తీర్పును వెలువరించింది.
2023లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం ప్రకారం.. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC), ఎన్నికల కమిషనర్ల (EC) ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, ఒక కేంద్ర కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. అంతకుముందు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ ప్యానెల్లో భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) ఉండాలి. కానీ, కొత్త చట్టంలో సీజేఐ స్థానంలో ప్రధాని నామినేట్ చేసిన కేబినెట్ మంత్రిని చేర్చారు. ఈ మార్పు వల్ల ఎన్నికల కమిషన్ స్వతంత్రత దెబ్బతింటుందని, ప్యానెల్లో ప్రభుత్వ పక్షానికే మెజారిటీ ఉంటుందని పేర్కొంటూ పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు.
అయితే, ఈ పిటిషన్లను విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి (Constitution Bench) పంపాలనే అంశంపై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏకీభవించలేకపోయింది. ఈ కేసును ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను జస్టిస్ దీపాంకర్ దత్తా తోసిపుచ్చారు. ఎన్నికల సంఘం స్వతంత్రత, తటస్థతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. "ప్రధాని నియమించిన ఒక కేబినెట్ మంత్రి ప్రభుత్వం లేదా తనను నియమించిన నేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది. దీని వల్ల ఈ ప్రక్రియ కేవలం అలంకారప్రాయంగా మిగిలిపోతుంది. ఒక తటస్థ వ్యక్తి (సీజేఐ వంటి వారు) ఉంటేనే వ్యవస్థకు స్వతంత్రత, సమతుల్యత లభిస్తుంది" అని దత్తా అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంఘం కేవలం స్వతంత్రంగా ఉండటమే కాదు, అది స్వతంత్రంగా పనిచేస్తున్నట్లు ప్రజలకు కనిపించాలని వ్యాఖ్యానించారు.
అయితే, దత్తా అభిప్రాయాలతో జస్టిస్ సతీష్ చంద్ర శర్మ విభేదించారు. ఈ వ్యవహారంలో ఒక ప్రధానమైన చట్టపరమైన ప్రశ్న ఇమిడి ఉందని.. ఈ అంశాన్ని పెద్ద ధర్మాసనం పరిశీలించాలని అభిప్రాయపడ్డారు. ఈ అంశంలో ఇద్దరు న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తడంతో ఈ విషయాన్ని సీజేఐ ఎదుట ఉంచాలని నిర్ణయించారు. రాజ్యాంగపరమైన సమస్యలను పరిష్కరించేందుకు శాశ్వతంగా ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని ద్విసభ్య ధర్మాసనం సీజేఐని కోరింది.
ఈ సందర్భంగా జస్టిస్ దత్తా మాట్లాడుతూ.. ఐదు రోజులుగా ఈ పిటిషన్లపై తాము వాదనలు విన్నట్లు చెప్పారు. సంస్థాగత ఐక్యత దృష్ట్యా ఈ అంశంపై ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదిరి ఉంటే బాగుండేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు భిన్నాభిభిప్రాయాలు వ్యక్తమైనట్లు చెప్పారు. పాలకులు చట్టానికి లోబడి ఉండాలే కానీ.. చట్టానికి అతీతులు కాదన్నది మన రాజ్యాంగ వ్యవస్థలో అత్యంత కీలకమైన ప్రాథమిక సూత్రం అని పేర్కొన్నారు.
Also Read..
అమెరికా రోగి పట్ల నిర్లక్ష్యం.. హైదరాబాద్ వైద్యుడికి రూ. 20 లక్షల జరిమానా
జీఎల్పీ-1 మందులతో కంటి చూపును కోల్పోతారా.. వైద్య నిపుణుల స్పష్టత..
లేడి సూపర్ స్టార్ అభిమానులకు పండగే..! ఒకే రోజు ఓటీటీలో నయన్ రెండు సినిమాలు..?
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tata Sons | టాటా గ్రూప్ వివాదం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన టాటా సన్స్
నవంబర్ 28, 2026

Karthigai Deepam lamp | తిరుప్పరంకుండ్రం కొండపై 100 ఏళ్ల తర్వాత వెలిగిన కార్తీక దీపం.. భక్తులు భావోద్వేగం
నవంబర్ 28, 2026

Tirupparankundram | తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం వివాదం.. 164 ఏళ్ల చరిత్రలో కీలక మలుపు..!
నవంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



