త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nayanthara | లేడి సూప‌ర్ స్టార్ అభిమానుల‌కు పండ‌గే..! ఒకే రోజు ఓటీటీలో న‌య‌న్ రెండు సినిమాలు..?

Nayanthara | లేడి సూప‌ర్ స్టార్‌ హీరోయిన్‌ నయనతార న‌టించిన రెండు సినిమాలు ఒకే రోజు ఓటీటీలో సందడి చేయనున్నాయా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తుంది. ప్ర‌స్తుతం సినీ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. ఇటీవల నయనతార నటించిన ‘టాక్సిక్‌’, ‘హాయ్‌’ సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి.

P

Entertainment | Published On Sep 23, 2026, 5.16 pm IST

Nayanthara | లేడి సూప‌ర్ స్టార్ అభిమానుల‌కు పండ‌గే..! ఒకే రోజు ఓటీటీలో న‌య‌న్ రెండు సినిమాలు..?
Advertisement

Nayanthara | లేడి సూప‌ర్ స్టార్‌ హీరోయిన్‌ నయనతార న‌టించిన రెండు సినిమాలు ఒకే రోజు ఓటీటీలో సందడి చేయనున్నాయా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తుంది. ప్ర‌స్తుతం సినీ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. ఇటీవల నయనతార నటించిన ‘టాక్సిక్‌’, ‘హాయ్‌’ సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. ఇప్పుడు ఈ సినిమాల ఓటీటీ విడుదలపై ఆసక్తి నెలకొంది. విష్ణు ఎడవన్‌ దర్శకత్వం వహించిన రొమాంటిక్‌ కామెడీ చిత్రం ‘హాయ్‌’. ఈ సినిమాకు నయనతార నిర్మాతగానూ వ్యవహరించింది. జీ5 ఓటీటీ సంస్థ ఇప్పటికే సెప్టెంబర్‌ నెల స్ట్రీమింగ్‌ జాబితాలో ‘హాయ్‌’ను చేర్చింది. దీంతో సెప్టెంబర్‌ 25న ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ తేదీపై జీ5 అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు.

ఇదిలా ఉంటే.. గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో యశ్‌ హీరోగా తెరకెక్కిన యాక్షన్‌ డ్రామా ‘టాక్సిక్‌’ కూడా అదే రోజున ఓటీటీలోకి రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో నయనతార కీలక పాత్ర పోషించారు. యశ్‌ పోషించిన పాత్రకు సోదరిగా గంగ పాత్రలో ఆమె కనిపించారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం థియేటర్లలో మిశ్రమ స్పందనను అందుకుంది. ఈ నేపథ్యంలో ‘హాయ్‌’, ‘టాక్సిక్‌’ రెండు సినిమాలు కూడా సెప్టెంబర్‌ 25న ఓటీటీలోకి వస్తే.. ఒకే రోజున నయనతారకు చెందిన రెండు చిత్రాలను చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కుతుంది. పైగా రెండూ ఒకే ఓటీటీ వేదికపై అందుబాటులోకి వస్తాయనే ప్రచారం జరుగుతుండటంతో ఆసక్తి నెలకొంది. అయితే ‘టాక్సిక్‌’ డిజిటల్‌ ప్రీమియర్‌ తేదీతో పాటు రెండు సినిమాల స్ట్రీమింగ్‌పై జీ5 నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

యశ్‌ నటించిన ‘టాక్సిక్‌’పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ.. విడుదల తర్వాత కథనం, స్క్రీన్‌ప్లే విషయంలో మిశ్రమ స్పందన వచ్చింది. కథనం నెమ్మదిగా సాగడం, కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడంతో సినిమాకు ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. దీంతో బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం నిరాశపరిచింది. మూవీలో న‌య‌న‌త‌రా, కియారా అద్వానీ, రుక్మిణి వ‌సంత్‌, తారా సుతారియా కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. అయినా ఈ మూవీ ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. న‌య‌న‌తార సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం.. త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న‌ది. మూకుతి అమ్మ‌న్‌-2, డియ‌ర్ స్టూడెంట్‌, రక్కయీ, మ‌న్న‌న్ గ‌ట్టి సిన్స్ 1960, ఎస్‌వీసీ 63 మూవీల్లో న‌టిస్తోంది.

Advertisement
Advertisement