త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | అమెరికా రోగి ప‌ట్ల నిర్ల‌క్ష్యం.. హైద‌రాబాద్ వైద్యుడికి రూ. 20 ల‌క్ష‌ల జ‌రిమానా

Hyderabad | అమెరికా రోగి ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హించిన హైద‌రాబాద్‌కు చెందిన ఓ వైద్యుడికి రూ. 20 ల‌క్ష‌ల జ‌రిమానా విధిస్తూ హైద‌రాబాద్ జిల్లా వినియోగ‌దారుల క‌మిష‌న్ తీర్పును ఇచ్చింది. 45 రోజుల్లోపు ప‌రిహారం చెల్లించ‌క‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది.

S

Hyderabad | Published On Sep 23, 2026, 5.25 pm IST

Hyderabad | అమెరికా రోగి ప‌ట్ల నిర్ల‌క్ష్యం.. హైద‌రాబాద్ వైద్యుడికి రూ. 20 ల‌క్ష‌ల జ‌రిమానా
Advertisement

Hyderabad | త్రినేత్ర న్యూస్ : అమెరికా రోగి ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హించిన హైద‌రాబాద్‌కు చెందిన ఓ వైద్యుడికి రూ. 20 ల‌క్ష‌ల జ‌రిమానా విధిస్తూ హైద‌రాబాద్ జిల్లా వినియోగ‌దారుల క‌మిష‌న్ తీర్పును ఇచ్చింది. 45 రోజుల్లోపు ప‌రిహారం చెల్లించ‌క‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. 2021 మార్చి నెల‌లో అమెరికాకు చెందిన ఓ ఎండోక్రైనాల‌జిస్ట్ హైద‌రాబాద్ న‌గ‌రానికి వ‌చ్చారు. అయితే వెన్నెముక చికిత్స నిమిత్తం న‌గ‌రంలోని వెంక‌టేశ్వ‌ర ఆర్థో హెల్త్ కేర్ ఆస్ప‌త్రిలో చేరారు. శ‌స్త్ర చికిత్స పూర్త‌యింది. ఇక శస్త్రచికిత్స సమయంలో వెన్నుపూస‌కు రక్ష‌ణ‌గా ఉండే ఒక పొర తెగిపోయింది. దానికి చికిత్స చేసినప్పటికీ, ఆ తర్వాత సర్జరీ జరిగిన భాగం నుండి నిరంతరాయంగా ద్రవం లీక్ అవ్వడం ప్రారంభమైంది. అయితే, సదరు రోగి మళ్లీ ఆస్ప‌త్రిలో చేరినప్పుడు కుట్లు వేయ‌డానికి బ‌దులుగా.. స‌ర్జిక‌ల్ జిగురును వినియోగించారు. మొత్తానికి స‌ద‌రు రోగి.. అమెరికాకు తిరిగి వెళ్లారు. నొప్పి తీవ్ర‌మ‌వ‌డంతో.. వైద్యుల‌ను సంప్ర‌దించారు. వెన్నుపూస వ‌ద్ద ద్ర‌వం పేరుకుపోయింద‌ని గ‌మ‌నించారు. దీంతో ఆయ‌న‌కు శ‌స్త్రచికిత్స నిర్వ‌హించ‌డంతో కోలుకున్నారు.

అయితే త‌న‌కు జ‌రిగిన న‌ష్టంపై అమెరికా రోగి.. హైద‌రాబాద్ వినియోగ‌దారుల క‌మిష‌న్‌లో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. శస్త్ర చికిత్స స‌మ‌యంలో ప్రామాణిక వైద్య విధానాల‌ను అనుస‌రించామ‌ని వెంక‌టేశ్వ‌ర ఆర్థో హెల్త్ కేర్ ఆస్ప‌త్రి త‌ర‌పున వాద‌న‌లు వినిపించారు. కానీ శ‌స్త్ర చికిత్స అనంత‌రం తీసుకోవాల్సిన చ‌ర్య‌ల్లో స్ప‌ష్ట‌మైన లోపం ఉంద‌ని వినియోగ‌దారుల క‌మిష‌న్ తేల్చింది. ఈ నేప‌థ్యంలో 45 రోజుల్లో స‌ద‌రు రోగికి రూ. 20 ల‌క్ష‌ల న‌ష్ట ప‌రిహారంతో పాటు కోర్టు ఖ‌ర్చుల నిమిత్తం రూ. 50 వేలు చెల్లించాల‌ని ఆస్ప‌త్రితో పాటు సంబంధిత వైద్యుడికి ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
Advertisement