త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

S Jaishankar | భారత్-అమెరికా సంబంధాల్లో ఉగ్ర‌వాదం కీల‌క అంశం : జైశంకర్

S Jaishankar | భారత్-అమెరికా సంబంధాల్లో (India-US Ties) వాణిజ్య, టారిఫ్ వివాదాలతో పాటు ఉగ్రవాద (terrorism) అంశం అత్యంత కీలకమని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (S Jaishankar) స్పష్టం చేశారు.

D

National | Published On Sep 29, 2026, 3.20 pm IST

S Jaishankar | భారత్-అమెరికా సంబంధాల్లో ఉగ్ర‌వాదం కీల‌క అంశం : జైశంకర్
Advertisement

S Jaishankar | త్రినేత్ర న్యూస్ : భారత్-అమెరికా సంబంధాల్లో (India-US Ties) వాణిజ్య, టారిఫ్ వివాదాలతో పాటు ఉగ్రవాద (terrorism) అంశం అత్యంత కీలకమని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (S Jaishankar) స్పష్టం చేశారు. స‌రిహ‌ద్దు ఉగ్ర‌వాదంపై త‌మ ఆందోళ‌న‌ను భాగ‌స్వామ్య దేశం అర్థం చేసుకోక‌పోతే అది ఇరు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక సంబంధాల‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. న్యూయార్క్‌లో ఆసియా సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

"భారత్‌కు భద్రత అనేది చాలా ముఖ్యమైన విషయం. పొరుగు దేశం ఉద్దేశపూర్వకంగా, దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానం వల్ల భారత్ ఎదుర్కొన్నంత ఉగ్రవాదాన్ని ప్రపంచంలో మరే దేశం కూడా ఎదుర్కొని ఉండ‌దు. భారత్‌ను తీవ్రంగా కలచివేస్తున్న ఉగ్రవాద సమస్యపై భాగస్వామ్య దేశమైన అమెరికా తగిన స్పందనను, సానుభూతిని చూపకపోతే అది ఇరు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక సంబంధాలపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది" అని అని పాకిస్థాన్ (Pakistan) పేరును ప్రస్తావించకుండానే ఆయన వ్యాఖ్యానించారు.

వాస్త‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకుంటూ ముందుకు సాగితేనే ఇరు దేశాల మ‌ధ్య సంబంధాలు మ‌రింత మెరుగుప‌డ‌తాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. అదే స‌మ‌యంలో ఉగ్రవాదం విషయంలో భారత్ ఒక 'రెడ్ లైన్' గీసుకుందని చెప్పారు. ఈ విషయంలో ఎటువంటి రాజీ ఉండబోదని తేల్చి చెప్పారు. ప్రస్తుత అమెరికా ప్రభుత్వం పాకిస్థాన్‌ పట్ల సానుకూల ధోరణితో వ్యవహరిస్తున్న తరుణంలో జైశంకర్ చేసిన ఈ వ్యాఖ్యల‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read..

ఒత్తిడి తెస్తేనే ప్ర‌భుత్వాలు స్పందిస్తాయ్‌.. రండి వీధుల్లోకి వ‌చ్చి మీ గ‌ళాన్ని వినిపించండి.. యువ‌త‌కు రాహుల్ పిలుపు

ప్ర‌ధాని మోదీ చేతిలో సీఈసీ కీలుబొమ్మ‌గా మారారు.. స‌ర్‌పై కాంగ్రెస్ వీధి పోరాటం : ఖ‌ర్గే

బాలుడిపై లైంగిక దాడి.. పోక్సో కేసులో టీచ‌ర్‌కు యావ‌జ్జీవ శిక్ష‌

Advertisement
Advertisement