Rahul Gandhi | ఒత్తిడి తెస్తేనే ప్రభుత్వాలు స్పందిస్తాయ్.. రండి వీధుల్లోకి వచ్చి మీ గళాన్ని వినిపించండి.. యువతకు రాహుల్ పిలుపు
Rahul Gandhi | మహిళలపై దాడులు లేదా నేరాలు జరిగినప్పుడు దానికి పరిష్కారంగా వారిని ఇళ్లకే పరిమితం చేయడం సరికాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పష్టం చేశారు. మహిళల రక్షణ కోసం దేశవ్యాప్తంగా ఉన్న యువతులు, ముఖ్యంగా జెన్-జీ (Gen Z) యువత పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి తమ గళాన్ని వినిపించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Rahul Gandhi | త్రినేత్ర న్యూస్ : దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఇటీవలే కాలంలో మహిళలు, యువతులపై జరుగుతున్న వరుస అత్యాచార ఘటనలపై (women harassment) కాంగ్రెస్ అగ్రనేత్ర, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఆస్థా కుంజ్ పార్కులో 17 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన నేపథ్యంలో మహిళల భద్రతను కోరుతూ విద్యార్థులు చేస్తున్న నిరసనలకు తన పూర్తి మద్దతు తెలిపారు. మహిళలపై జరిగిన నేరాల కారణంగా వారిపైనే ఆంక్షలు విధించకూడదని పేర్కొన్నారు.
ఈ మేరకు రాహుల్ ఎక్స్ వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశారు. సురక్షితమైన బహిరంగ ప్రదేశాలు ఉండాలని, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. మహిళలపై దాడులు లేదా నేరాలు జరిగినప్పుడు దానికి పరిష్కారంగా వారిని ఇళ్లకే పరిమితం చేయడం సరికాదని స్పష్టం చేశారు. వరుస ఘటనలతో వీధుల్లో నడవాలన్నా మహిళలు భయపడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితురాలిని నిందించి, నేరస్థుడిని కాపాడే వ్యవస్థను సమూలంగా మార్చాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
దాడికి పాల్పడిన వారికి ఎలాంటి మినహాయింపులు లేకుండా తక్షణమే శిక్షించడం సమస్యకు అసలైన పరిష్కారమని రాహుల్ స్పష్టం చేశారు. శాంతియుతంగా నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కని పేర్కొన్నారు. ఒత్తిడి తెస్తేనే ప్రభుత్వాలు స్పందిస్తాయని వ్యాఖ్యానించారు. మహిళల రక్షణ కోసం దేశవ్యాప్తంగా ఉన్న యువతులు, ముఖ్యంగా జెన్-జీ (Gen Z) యువత పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి తమ గళాన్ని వినిపించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Also Read..
ప్రధాని మోదీ చేతిలో సీఈసీ కీలుబొమ్మగా మారారు.. సర్‌పై కాంగ్రెస్ వీధి పోరాటం : ఖర్గే
రేపు సిరిసిల్లలో కేటీఆర్‌కు సినిమా చూపించబోతున్నం
మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంలో ప్యారడైజ్ చిత్రబృందం ప్రత్యేక పూజలు
సంబంధిత వార్తలు

Supreme Court | స్కూళ్లలో ర్యాగింగ్‌పై పిల్.. విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
సెప్టెంబర్ 29, 2026

CEC Gyanesh Kumar | వందకు కోటి పర్సెంట్ జ్ఞానేశ్వర్ కుమార్ పదవీచ్యుతుడవుతాడు.. బల్ల గుద్ది చెప్పిన వేణు స్వామి..!
సెప్టెంబర్ 28, 2026

SIR | సైమన్ గో బ్యాక్‌లా.. సర్ గో బ్యాక్ అనేందుకు సమయం ఆసన్నమైంది: రేవంత్‌రెడ్డి
సెప్టెంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Yogi Babu | టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ - టాప్ కమెడియన్లుగా హీరోలుగా తెలుగు మూవీ - జానర్‌పై ట్విస్ట్?
- ●Asian Games | 36 ఏళ్ల నిరీక్షణకు తెర.. షూటింగ్లో నీరూ ధండాకు గోల్డ్
- ●Asaduddin Owaisi | నెహ్రూ నుంచి మోదీ వరకూ.. అన్ని ప్రభుత్వాలూ ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూశాయి : ఒవైసీ
- ●Raipur Black Money Scam | నల్లటి కాగితాలను కెమికల్లో ముంచితే 500 నోట్లు వస్తాయంటూ ఇద్దరు యువతుల ఘరానా మోసం
- ●Mahesh Kumar Goud | సిరిసిల్లకు తరలిరండి.. సీఎం సభను సక్సెస్ చేయండి
- ●Stock Markets | ముడి చమురు ధరల సెగ.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Yogi Babu | టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ - టాప్ కమెడియన్లుగా హీరోలుగా తెలుగు మూవీ - జానర్‌పై ట్విస్ట్?

Asian Games | 36 ఏళ్ల నిరీక్షణకు తెర.. షూటింగ్లో నీరూ ధండాకు గోల్డ్

Asaduddin Owaisi | నెహ్రూ నుంచి మోదీ వరకూ.. అన్ని ప్రభుత్వాలూ ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూశాయి : ఒవైసీ

Raipur Black Money Scam | నల్లటి కాగితాలను కెమికల్లో ముంచితే 500 నోట్లు వస్తాయంటూ ఇద్దరు యువతుల ఘరానా మోసం



