POCSO Case | బాలుడిపై లైంగిక దాడి.. పోక్సో కేసులో టీచర్‌కు యావజ్జీవ శిక్ష
POCSO Case | ఓ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడైన ఉపాధ్యాయుడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
POCSO Case | త్రినేత్ర న్యూస్: ఓ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడైన ఉపాధ్యాయుడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈమేరకు ఎల్.బి.నగర్‌లోని రంగారెడ్డి జిల్లా రేప్, పోక్సో కేసుల విచారణ ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి మంగళవారం తీర్పు వెలువరించారు. రూ.25,500 జరిమానాతో పాటు బాధితుడికి 2,00,000 పరిహారం అందించాలని ఆదేశించారు.
పహాడీషరీఫ్ సీఐ సీహెచ్. జితేందర్ ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఫిర్యాదుదారు పెద్ద కుమారుడు (13) మామిడిపల్లిలోని ఇస్లామియా కాషిఫుల్ ఉలూమ్ మదర్సాలో చదువుకుంటున్నాడు. ఆ బాలుడు అనారోగ్యంతో బాధపడుతుండటంతో 2024, డిసెంబర్ 26న ఇంటికి తీసుకువచ్చారు. అదే నెల 27న క్లినిక్‌లో వైద్య పరీక్షలు నిర్వహించగా.. బాధితుడి రహస్య అవయవాల వద్ద తీవ్ర ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత బాధితుడు తన తల్లికి అసలు విషయం చెప్పాడు.
బీహార్ రాష్ట్రం పూర్ణియా జిల్లా దరియాపూర్ గ్రామానికి చెందిన హఫీజ్ మునావర్ హుస్సేన్ (32) మదర్సాలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఇక్కడే చదువు చెబుతూ మామిడిపల్లిలోనే ఉంటున్నాడు. 2024, డిసెంబర్ 25న సాయంత్రం సమయంలో బాలుడిని వాహనంపై పహాడీషరీఫ్, రాజీవ్ గాంధీ నగర్‌లోని మసీద్-ఎ-రహమత్ ఉన్నీసా సమీపంలోని ఒక గదికి తీసుకెళ్లాడు. అనంతరం లైంగిక దాడికి పాల్పడటంతో పాటు బెదిరింపులకు గురిచేసినట్లు తెలిపాడు. ఈ విషయాన్ని బాధితుడి తల్లి తన భర్తకు తెలపగా, ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి కోర్టులో ప్రవేశపెట్టగా అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కృష్ణ ప్రసన్న వాదనలు వినిపించారు. దీంతో నేరం రుజువు కావడంతో కోర్టు శిక్ష విధించింది అని పోలీసులు తెలిపారు.
ఈ కేసులో ముఖ్య పాత్ర పోషించిన మల్కాజిగిరి సీఐ పీ. గురువారెడ్డి, ఎస్‌హెచ్‌వో బీ లక్ష్మీ నారాయణ రెడ్డి, సీడీవో ఇ.వెంకటేష్, లైజన్ ఆఫీసర్లు, రమేష్, వివేక్ రెడ్డిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Nifty 50 | ఆందోళనలో ఇన్వెస్టర్లు.. నిఫ్టీ50 ఆరు నెలల కనిష్టానికి..
- ●Mallikarjun Kharge | ప్రధాని మోదీ చేతిలో సీఈసీ కీలుబొమ్మగా మారారు.. సర్‌పై కాంగ్రెస్ వీధి పోరాటం : ఖర్గే
- ●Kavitha | ఏమున్నా నేన్ ఆధారాలతోనే మాట్లాడ్తా.. నాతో పెట్టుకోకు: కేటీఆర్‌కు కవిత వార్నింగ్
- ●Stocks | భారత్‌లోనే కాదు, విదేశీ స్టాక్స్‌లోనూ పెట్టుబడి పెట్టాలి.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
- ●Hyderabad | ద్విచక్ర వాహనాల చోరీ.. ఇద్దరు టీనేజర్లు అరెస్ట్.. 8 స్కూటర్లు స్వాధీనం
- ●Ai Plus | పండుగ సీజన్‌కు ఏఐ ప్లస్ కొత్త గ్యాడ్జెట్లు.. రూ.9,999 నుంచి ధరలు..

Nifty 50 | ఆందోళనలో ఇన్వెస్టర్లు.. నిఫ్టీ50 ఆరు నెలల కనిష్టానికి..

Mallikarjun Kharge | ప్రధాని మోదీ చేతిలో సీఈసీ కీలుబొమ్మగా మారారు.. సర్‌పై కాంగ్రెస్ వీధి పోరాటం : ఖర్గే

Kavitha | ఏమున్నా నేన్ ఆధారాలతోనే మాట్లాడ్తా.. నాతో పెట్టుకోకు: కేటీఆర్‌కు కవిత వార్నింగ్

Stocks | భారత్‌లోనే కాదు, విదేశీ స్టాక్స్‌లోనూ పెట్టుబడి పెట్టాలి.. ఎందుకో చెబుతున్న నిపుణులు..





