Mamata Banerjee | పార్టీని వీడాలనుకునేవారు స్వేచ్ఛగా వెళ్లిపోవచ్చు : మమతా బెనర్జీ
Mamata Banerjee | పార్టీని వీడాలనుకునేవారు స్వేచ్ఛగా వెళ్లిపోవచ్చని టీఎంసీ అధినేత్రి (TMC chief) మమతా బెనర్జీ (Mamata Banerjee) అభ్యర్థులకు సూచించారు. అంతేకాదు, పార్టీని మళ్లీ మొదటి నుంచి బలోపేతం చేస్తామని అన్నారు.
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ (Weat Bengal)లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీని వీడాలనుకునేవారు స్వేచ్ఛగా వెళ్లిపోవచ్చని టీఎంసీ అధినేత్రి (TMC chief) మమతా బెనర్జీ (Mamata Banerjee) అభ్యర్థులకు సూచించారు. అంతేకాదు, పార్టీని మళ్లీ మొదటి నుంచి బలోపేతం చేస్తామని అన్నారు. కాలిఘాట్‌లోని తన నివాసంలో జరిగిన పార్టీ అభ్యర్థుల సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనప్పటికీ పార్టీ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని మమత ధీమా వ్యక్తం చేశారు.
సమావేశంలో దీదీ మాట్లాడుతూ.. "పార్టీ ఓటమి తర్వాత చాలా మంది అభ్యర్థులు ఇతర పార్టీల్లోకి వెళ్తారని నాకు తెలుసు. వారికి కొన్ని సొంత ఇబ్బందులు ఉండొచ్చు. మరికొందరు రాజకీయ ఒత్తిడికి తలొగ్గి వెళ్లాలని అనుకుంటున్నారు. దాని గురించి నేను ఏమీ అనదలుచుకోలేదు. పార్టీని వీడాలనుకునే వారు ఎవరైనా సరే స్వేచ్ఛగా వెళ్లిపోవచ్చు. వారిని నేను ఆపను. పార్టీలో నిజాయితీగా కొనసాగే వారితోనే నేను ముందుకు సాగుతాను. వెళ్లాలనుకునేవారిని ఆపే ప్రసక్తే లేదే. పార్టీలోనే కొనసాగాలనుకున్న వారికి నేను చెప్పేది ఒక్కటే.. దెబ్బతిన్న పార్టీ కార్యాలయాలను మళ్లీ పునర్నిర్మించండి. వాటికి రంగులు వేసి తిరిగి ప్రారంభించండి. అవసరమైతే నేనే స్వయంగా రంగులు వేస్తాను. తృణమూల్ కాంగ్రెస్ ఎప్పటికీ తలవంచదు. ప్రజల తీర్పును లూటీ చేశారు" అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.
కాగా, ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను తృణమూల్ కేవలం 80 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. భవానీపూర్ స్థానంలో మమతా బెనర్జీ సైతం ఓడిపోయారు. పలువురు సీనియర్ నాయకులు, మంత్రులతో సహా 211 మంది టీఎంసీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 200కిపైగా స్థానాల్లో స్పష్టమైన మెజారిటీతో గెలిచి రాష్ట్రంలో అధికారం చేపట్టింది.
Also Read..
పుచ్చకాయ తిని తండ్రి మృతి.. కుమారుడి పరిస్థితి విషమం
రోగిని తీసుకెళ్లాలని చెప్పారు.. అంబులెన్సుతో ఉడాయించారు..
పెట్రోల్ షాక్.. ఫుడ్ డెలివరీలు, రెస్టారెంట్ బిల్లులు భారీగా పెంపు..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Vedma Bojju| పిల్ల కాకి కొండా సుష్మిత మాట్లాడిన మాటలు కావవి.. కొండా సురేఖ మాటలే
- ●Starlink | గ్రామీణ భారతానికి స్టార్‌లింక్‌తో ఇంటర్నెట్.. ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు
- ●Taapsee | థియేటర్లలో కాదు...నేరుగా ఓటీటీలోకి తాప్సీ కొత్త మూవీ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- ●Vemula Veeresham | నీకు సంబంధం లేకుంటే.. నీ బిడ్డ మాటలను ఎందుకు ఖండించలే?
- ●‘22ఏ’ పంచాయితీ: సెక్రటేరియట్ వర్సెస్ తెలంగాణ భవన్.. భూపోరులో గెలుపెవరిది?
- ●Amazon India | అమెజాన్ ఆసక్తికర సర్వే.. ఫోన్లలో ఏఐ ఫీచర్లను కోరుకుంటున్న యూజర్లు..

Vedma Bojju| పిల్ల కాకి కొండా సుష్మిత మాట్లాడిన మాటలు కావవి.. కొండా సురేఖ మాటలే

Starlink | గ్రామీణ భారతానికి స్టార్‌లింక్‌తో ఇంటర్నెట్.. ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు

Taapsee | థియేటర్లలో కాదు...నేరుగా ఓటీటీలోకి తాప్సీ కొత్త మూవీ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Vemula Veeresham | నీకు సంబంధం లేకుంటే.. నీ బిడ్డ మాటలను ఎందుకు ఖండించలే?






