Watermelon | పుచ్చకాయ తిని తండ్రి మృతి.. కుమారుడి పరిస్థితి విషమం
Watermelon | వేసవికాలం కడుపుకు హాయినిచ్చే పుచ్చకాయ (Watermelon) తిని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పో యిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవలే ముంబైలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడంతో.. పుచ్చకాయ విషపూరితమైందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Watermelon | మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వేసవికాలం కడుపుకు హాయినిచ్చే పుచ్చకాయ (Watermelon) తిని తండ్రీకొడుకు తీవ్ర అనారోగ్యానికి గురవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనలో తండ్రి మృతిచెందగా.. కుమారుడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.
షాజాపూర్ జిల్లాకు (Shajapur district) చెందిన 43 ఏళ్ల ఇంద్ర కుమార్ పరిహార్ (43).. భార్య సంగీత, ముగ్గురు కుమారులు వినోద్ (21), రాజా, దేవాతో కలిసి షియోపూర్‌లో (Sheopur) అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అతడు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, గురువారం రాత్రి ఇంద్ర కుమార్ ఆయన 21 ఏళ్ల కుమారుడు వినోద్ కాస్త అనారోగ్యానికి గురయ్యారు. శుక్రవారం ఉదయం ఇద్దరూ ఇంట్లో పుచ్చకాయ కోసుకుని తిన్నారు. అంతే కాసేపటికే వారి ఆరోగ్యం మరింత క్షీణించింది.
దీంతో కుటుంబ సభ్యులు తండ్రీకొడుకులను వెంటనే షియోపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వీరిద్దరినీ పరీక్షించిన వైద్యులు ఇంద్ర కుమార్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. మెరుగైన వైద్యం కోసం కోటా (Kota) ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ఇంద్రను కోటాకు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే అతను ప్రాణాలు కోల్పోయాడు. అతడి కుమారుడు వినోద్ మాత్రం ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, అతడి పరిస్థితి కూడా ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.
నివేదిక వచ్చిన తర్వాతే..
కాగా, శుక్రవారం ఉదయం తీవ్ర అనారోగ్యంతో వీరిద్దరూ ఆసుపత్రిలో చేరినట్లు జిల్లా ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ ఆర్‌బి గోయల్ తెలిపారు. పుచ్చకాయ తినడం వల్లే ఈ మరణం సంభవించిందని తాము ఇంకా ధృవీకరించలేదని చెప్పారు. బాధితులు తీవ్రమైన స్టమక్ ఇన్‌ఫెక్షన్ (Stomach infection) బారిన పడి ఉండొచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వైద్య పరీక్షలు జరుగుతున్నాయని.. నివేదికలు వచ్చిన తర్వాతే ఇంద్ర మృతికి ఖచ్చితమైన కారణం తెలుస్తుందన్నారు.
విషంగా మారిన పుచ్చకాయ..?
మరోవైపు మహారాష్ట్ర ముంబైలో కూడా ఇటీవలే ఇలాంటి ఘటనే చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ముంబైలో ఓ కుటుంబం బిర్యానీ తిన్న తర్వాత కాసేపటికే పుచ్చకాయ తిన్నది. ఆ తర్వాత ఫ్యామిలోని వారంతా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, వీళ్ల మరణానికి పుచ్చకాయ కారణం కాదని పరీక్షల్లో నిర్ధరణ అయ్యింది. ఇప్పుడు పుచ్చకాయ తిన్న తర్వాత వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఈ పండ్లలో ఏవైనా హానికర పదార్థాలు లేదా రసాయనాలు కలుపుతున్నారేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తాజా ఘటనపై ఆరోగ్య శాఖ అధికారులు విచారణ చేపడుతున్నాయి.
Also Read..
విదేశీ ఇన్వెస్టర్లకు సెబీ గుడ్‌న్యూస్.. పాన్ అప్లికేషన్ నిబంధనలు సడలింపు..
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. సామాన్యుల పాలిట పిడుగుపాటు: సీఎం రేవంత్
పెట్రోల్ షాక్.. ఫుడ్ డెలివరీలు, రెస్టారెంట్ బిల్లులు భారీగా పెంపు..
తాజావార్తలు
- ●Vedma Bojju| పిల్ల కాకి కొండా సుష్మిత మాట్లాడిన మాటలు కావవి.. కొండా సురేఖ మాటలే
- ●Starlink | గ్రామీణ భారతానికి స్టార్‌లింక్‌తో ఇంటర్నెట్.. ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు
- ●Taapsee | థియేటర్లలో కాదు...నేరుగా ఓటీటీలోకి తాప్సీ కొత్త మూవీ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- ●Vemula Veeresham | నీకు సంబంధం లేకుంటే.. నీ బిడ్డ మాటలను ఎందుకు ఖండించలే?
- ●‘22ఏ’ పంచాయితీ: సెక్రటేరియట్ వర్సెస్ తెలంగాణ భవన్.. భూపోరులో గెలుపెవరిది?
- ●Amazon India | అమెజాన్ ఆసక్తికర సర్వే.. ఫోన్లలో ఏఐ ఫీచర్లను కోరుకుంటున్న యూజర్లు..

Vedma Bojju| పిల్ల కాకి కొండా సుష్మిత మాట్లాడిన మాటలు కావవి.. కొండా సురేఖ మాటలే

Starlink | గ్రామీణ భారతానికి స్టార్‌లింక్‌తో ఇంటర్నెట్.. ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు

Taapsee | థియేటర్లలో కాదు...నేరుగా ఓటీటీలోకి తాప్సీ కొత్త మూవీ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Vemula Veeresham | నీకు సంబంధం లేకుంటే.. నీ బిడ్డ మాటలను ఎందుకు ఖండించలే?






