Kashi Vishwanath temple | కాశీ విశ్వనాథ్ ఆలయం వద్ద కాల్పుల కలకలం.. ముగ్గురికి గాయాలు
Kashi Vishwanath temple | వారణాసి (Varanasi)లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీ విశ్వనాథ్ ఆలయం (Kashi Vishwanath temple) వద్ద కాల్పులు చోటు చేసుకున్నాయి. గేట్ నంబర్-4 వద్ద విధుల్లో ఉన్న పీఏసీ కానిస్టేబుల్ చేతిలోని తుపాకీ కిందపడటంతో బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.
Kashi Vishwanath temple | ఉత్తరప్రదేశ్ వారణాసిలోని (Varanasi) ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాశీ విశ్వనాథ్ ఆలయం (Kashi Vishwanath temple) వద్ద కాల్పుల ఘటన (firing) కలకలం రేపింది. ఆలయానికి చెందిన గేట్ నంబర్ 4 వద్ద శనివారం ఉదయం తుపాకీ మిస్‌ఫైర్ అయ్యింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వీఐపీలు ప్రవేశించే గేట్-4కు ఆనుకుని ఉన్న హై-సెక్యూరిటీ గేట్ 4B 'నాను ఫెరియా గేట్' (Nanu Feria Gate) వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ విధుల్లో ఉన్న పీఏసీ కానిస్టేబుల్ చేతిలోని కార్బైన్ తుపాకీ ప్రమాదవశాత్తూ కిందపడిపోవడంతో బుల్లెట్లు దూసుకెళ్లాయి. అవి రోడ్డును బలంగా తాకడంతో కాంక్రీట్ ముక్కలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో క్యూలైన్లో పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నారు. ఈ ఘటనతో వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ క్రమంలో తొక్కిసలాట, గందరగోళ వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఈ ప్రమాదంలో సమీపంలోని నిక్కీ గుప్తా, రామ్ బాబు, వికాస్ యాదవ్ అనే ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారు ఆలయం వద్ద పూల వ్యాపారం చేసుకునేవారని ఏసీపీ అతుల్ అంజన్ త్రిపాఠి తెలిపారు. గాయపడిన ముగ్గురిని ఎస్‌ఎస్‌పీజీ (SSPG) డివిజనల్ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించిన తర్వాత డిశ్చార్జ్ చేసినట్లు చెప్పారు. తొలుత వారికి బుల్లెట్ గాయాలైనట్లు భావించగా.. వారికి తగిలింది కేవలం కాంక్రీట్ ముక్కలని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏసీపీ త్రిపాఠి వెల్లడించారు.
గతంలోనూ..
కాగా ఈ ఆలయం వెలుపల తుపాకీ మిస్‌ఫైర్ కావడం ఇది తొలిసారి కాదు. గతేడాది మార్చిలోనూ గొదౌలియా, గేట్-4 మధ్య ఉన్న బాన్స్‌ఫాతక్ ప్రాంతంలో అచ్చం ఇలాంటి ప్రమాదమే జరిగింది. అప్పట్లో విధుల్లో ఉన్న ఓ పీఏసీ కానిస్టేబుల్ చేతిలో నుంచి కార్బైన్ తుపాకీ కిందపడి మిస్ ఫైర్ అయ్యింది. ఆ ప్రమాదంలో సదరు కానిస్టేబుల్‌తోపాటూ ఓ షాపు యజమానికి తీవ్ర గాయాలయ్యాయి.
సంబంధిత వార్తలు

Asaduddin Owaisi | రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ ఇక ముస్లింలకు వర్తించదా..? మసీదు కూల్చివేతపై ఒవైసీ ఆగ్రహం
సెప్టెంబర్ 5, 2026

Mahesh Babu | సందీప్ వంగా కాదు.. వారణాసి తర్వాత మహేష్‌బాబు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?
ఆగస్టు 25, 2026

Varanasi Movie | యాభై భాషల్లో మహేష్‌బాబు వారణాసి రిలీజ్ – రాజమౌళి ప్లానింగ్ వేరే లెవెల్
ఆగస్టు 23, 2026
తాజావార్తలు
- ●K Shobha Reddy | సీఎం గారూ అపాయింట్మెంట్ ఇవ్వండి ప్లీజ్.. ట్రోల్స్‌పై కే శోభారెడ్డి ఆవేదన
- ●Neem Tree | నల్లమలలో వేప చెట్లకు వింత తెగులు..
- ●Kadem Project | కళకళలాడుతున్న 'కడెం'.. నిండు కుండలా ప్రాజెక్టు
- ●Khairatabad ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 4 లక్షల మంది దర్శనం
- ●Horoscope | సెప్టెంబర్ 21 రాశిఫలాలు.. ఈ రాశి వారికి సహోద్యోగులతో సవాళ్లు..!
- ●UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?

K Shobha Reddy | సీఎం గారూ అపాయింట్మెంట్ ఇవ్వండి ప్లీజ్.. ట్రోల్స్‌పై కే శోభారెడ్డి ఆవేదన

Neem Tree | నల్లమలలో వేప చెట్లకు వింత తెగులు..

Kadem Project | కళకళలాడుతున్న 'కడెం'.. నిండు కుండలా ప్రాజెక్టు

Khairatabad ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 4 లక్షల మంది దర్శనం



