High Court | రంగనాథ్‌ను తప్పించండి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు
High Court | హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు సోమవారం హైకోర్టులో భారీ షాక్ తగిలింది. హైడ్రా కమిషనర్ స్థానం నుంచి ఆయన్ని తప్పించాలని హైకోర్టు ఆదేశించింది.
High Court | త్రినేత్ర.న్యూస్: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు సోమవారం హైకోర్టులో భారీ షాక్ తగిలింది. హైడ్రా కమిషనర్ స్థానం నుంచి ఆయన్ని తప్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ఆయన స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని సూచించింది. ఓ ఉన్నతాధికారి కోర్టు ఉత్తర్వులను 63 సార్లు ధిక్కరించడం సరికాదని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
మల్కాజిగిరి పరిధిలోని లోతుకుంట భూములకు సంబంధించి గతంలో ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను హైడ్రా ఉల్లంఘించిందంటూ శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఫెన్సింగ్‌ను హైడ్రా సిబ్బంది తొలగించారని తన పిటిషన్‌లో పేర్కొంది. ఒకే పిటిషన్‌కు సంబంధించి కోర్టు ఉత్తర్వులను రంగనాథ్ పలుమార్లు ధిక్కరించడం నేరమని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కోర్టుకు ఆయన హాజరు కావాలని ఆదేశించింది.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) జోక్యం చేసుకుని దీనిపై పూర్తిస్థాయిలో అఫిడవిట్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు. ఆయన దాఖలు చేసిన అఫిడవిట్‌లో రంగనాథ్ క్షమాపణ కోరారు. కోర్టుల పట్ల పూర్తిస్థాయి నమ్మకముందని పేర్కొన్నారు. లోతుకుంట సర్వే నంబర్ 1, 2లో ఉన్న 40 ఎకరాల భూమిలోకి వెళ్లలేదని వివరించారు. అక్కడ ఎలాంటి కూల్చివేతలు ఇతర చర్యలు చేపట్టలేదని స్పష్టం చేశారు.
దీనిపై స్పందించిన హైకోర్టు.. రంగనాథ్‌పై 63 కోర్టు ధిక్కరణ (Contempt of Court) పిటిషన్లు ఉన్నాయని పేర్కొంది. దీనికి కారణమేంటని, ఇన్ని కోర్టు ధిక్కరణ పిటీషన్లు ఎందుకు దాఖలయ్యాయని ప్రభుత్వ న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. ఈ సందర్భంగా రంగనాథ్‌ను తొలగించాలని ఆదేశిస్తూ ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని సూచించింది.
తాజావార్తలు
- ●K Shobha Reddy | సీఎం గారూ అపాయింట్మెంట్ ఇవ్వండి ప్లీజ్.. ట్రోల్స్‌పై కే శోభారెడ్డి ఆవేదన
- ●Neem Tree | నల్లమలలో వేప చెట్లకు వింత తెగులు..
- ●Kadem Project | కళకళలాడుతున్న 'కడెం'.. నిండు కుండలా ప్రాజెక్టు
- ●Khairatabad ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 4 లక్షల మంది దర్శనం
- ●Horoscope | సెప్టెంబర్ 21 రాశిఫలాలు.. ఈ రాశి వారికి సహోద్యోగులతో సవాళ్లు..!
- ●UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?

K Shobha Reddy | సీఎం గారూ అపాయింట్మెంట్ ఇవ్వండి ప్లీజ్.. ట్రోల్స్‌పై కే శోభారెడ్డి ఆవేదన

Neem Tree | నల్లమలలో వేప చెట్లకు వింత తెగులు..

Kadem Project | కళకళలాడుతున్న 'కడెం'.. నిండు కుండలా ప్రాజెక్టు

Khairatabad ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 4 లక్షల మంది దర్శనం



