Whatsapp SIM Binding | సిమ్ లేకుండా ఇక వాట్సాప్ పనిచేయదా..? ఏమేం నియమాలను విధించారు..?
Whatsapp SIM Binding | గతేడాది నవంబర్ లో జారీ చేసిన సిమ్-బైండింగ్ ఆదేశాలను డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ) ఫిబ్రవరి 28 నుంచి అమలు చేస్తుందని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సిందియా ధ్రువీకరించారు.
Technology | Published On Feb 27, 2026, 1.06 pm IST
Whatsapp SIM Binding | గతేడాది నవంబర్ లో జారీ చేసిన సిమ్-బైండింగ్ ఆదేశాలను డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ) ఫిబ్రవరి 28 నుంచి అమలు చేస్తుందని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సిందియా ధ్రువీకరించారు. మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లు ముఖ్యంగా వాట్సప్ ఈ గడువులోగా పూర్తిస్థాయిలో సిమ్ బైండింగ్ రూల్‌ను పాటించాల్సి ఉంటుంది. ఈ గడువు పొడిగింపుపై ప్రస్తుతం ఎలాంటి ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
నియమాలు ఇవే..
కొత్త టెలికాం భద్రతా నియమాల ప్రకారం.. ఒకే ఖాతాను పలు పరికరాల్లో ఉపయోగిస్తున్నప్పుడు, వాట్సాప్ వెబ్ వంటి వెబ్ ఆధారిత సేవల నుంచి వినియోగదారులు ప్రతి ఆరు గంటలకు ఒకసారి ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ కావాలి. ఖాతాతో అనుసంధానమైన సిమ్ కార్డు వినియోగదారుడి ప్రాథమిక మొబైల్ డివైస్‌లోనే యాక్టివ్‌గా ఉండాలి. నమోదు చేసిన సిమ్ డివైస్‌లో లేనిపక్షంలో సంబంధిత సేవలు నిలిపివేయాలి. డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలను అరికట్టడం, జాతీయ భద్రతను బలోపేతం చేయడం ఈ నిబంధనల ప్రధాన ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
ఫీచర్ ను టెస్ట్ చేస్తున్న వాట్సాప్..
కాగా వాట్సాప్ మాతృ సంస్థ మెటా భారతీయ నియమాల ప్రకారం వినియోగదారుల సిమ్ మొబైల్ డివైస్‌లో ఉందా లేదా అనే విషయాన్ని ధ్రువీకరించేలా ఓ ఫీచర్‌ను బీటా వెర్షన్లలో పరీక్షిస్తున్నట్లు సమాచారం. అయితే వెబ్ సెషన్లకు సంబంధించి ఆరు గంటల ఆటోమేటిక్ లాగ్ అవుట్ నిబంధనను అమలు చేస్తుందా లేదా అన్న విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. కాగా ఇంటర్‌నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) ఇప్పటికే ఈ నిబంధనలపై ఆందోళన వ్యక్తం చేసింది. తరచూ బలవంతపు లాగ్ అవుట్‌లు వాట్సాప్ వెబ్‌పై ఆధారపడే ఉద్యోగుల పనితీరుకు అంతరాయం కలిగించవచ్చని, ఒకే ఖాతాను పలు పరికరాల్లో వినియోగించే వారికి ఇబ్బందులు తలెత్తవచ్చని పేర్కొంది.
అయితే డీవోటీ అభిప్రాయం ప్రకారం, జాతీయ భద్రత అంశాలు ఇతర అంశాల కంటే ముఖ్యమని, సిమ్-బైండింగ్, మల్టిపుల్ డివైస్‌ల వినియోగ నియంత్రణ అమలులో వెనుకడుగు ఉండదని స్పష్టం చేసింది.
సంబంధిత వార్తలు

WhatsApp | వాట్సాప్‌లో ట్యాబ్లెట్ యూజర్లకు భారీ అప్డేట్.. ఇక ఐప్యాడ్, ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లలో కొత్త సౌకర్యాలు..
జులై 4, 2026

Telegram | పైరసీ కంటెంట్.. టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు
జులై 4, 2026

Preity Zinta | డీప్‌ఫేక్ కంటెంట్‌పై హైకోర్టును ఆశ్రయించిన ప్రీతి జింతా.. వెబ్సైట్లకు మార్గదర్శకాలపై కోర్టు ఆదేశాలు
జులై 3, 2026
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే



