ICICI Bank | ఐసీఐసీఐ బ్యాంకులో రూ.23 కోట్ల మోసం.. నకిలీ బంగారం పెట్టి రుణం పొందిన కస్టమర్లు
ICICI Bank | దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు అయిన ఐసీఐసీఐలో (ICICI Bank) భారీ గోల్డ్ స్కామ్ వెలుగు చూసింది. మహారాష్ట్ర నాగ్‌పూర్ (Nagpur)లోని ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన తొమ్మిది శాఖల్లో ఖాతాదారులు నకిలీ బంగారాన్ని (fake gold) తాకట్టు పెట్టినట్లు తేలింది.
ICICI Bank | దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు అయిన ఐసీఐసీఐలో (ICICI Bank) భారీ గోల్డ్ స్కామ్ వెలుగు చూసింది. మహారాష్ట్ర నాగ్‌పూర్ (Nagpur)లోని ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన తొమ్మిది శాఖల్లో ఖాతాదారులు నకిలీ బంగారాన్ని (fake gold) తాకట్టు పెట్టినట్లు తేలింది. ఈ స్కామ్ (gold loan scam) విలువ రూ.23 కోట్లుగా తేలింది. ఈ విషయం బ్యాంక్‌లో నిర్వహించిన ఆడిట్ ద్వారా బయటపడింది.
జనవరి 2023 నుంచి అక్టోబర్ 2025 మధ్య కాలంలో ఈ స్కామ్ జరిగింది. అయితే, రెండేళ్ల తర్వాత 'గోల్డ్ లోన్' పోర్ట్‌ఫోలియోపై నిర్వహించిన అంతర్గత తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. ఆడిట్ సమయంలో తొమ్మిది వేర్వేరు శాఖల్లో తాకట్టు పెట్టిన ఆభరణాలను పరిశీలించగా, అవి అసలు బంగారం కాదని, నకిలీ అని తేలింది. మొత్తం 195 మంది ఖాతాదారులు ఈ నకిలీ బంగారాన్ని చూపి రుణాలు పొందినట్లు అధికారులు గుర్తించారు. ICICI బ్యాంక్ జోనల్ కార్యాలయంలో ఉద్యోగి అయిన ధనంజయ్ రమేష్ థైటే ఇచ్చిన ఫిర్యాదు మేరకు ధంతోలి పోలీసులు (Dhantoli police) మోసం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సాధారణంగా బ్యాంకుల్లో బంగారం స్వచ్ఛతను ధృవీకరించేందుకు 'వాల్యూయర్స్' (Valuers) ఉంటారు. వారు మనం తాకట్టు పెట్టే బంగారాన్ని తనిఖీ చేసిన తర్వాతే మనకు రుణం మంజూరు చేస్తారు. వాల్యూయర్స్ అనుమతి, క్లియరెన్స్ లేకుండా ఇంత పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు కావడం అసాధ్యం. ఈ కుట్రలో బ్యాంక్ ఉద్యోగులు, అధికారుల ప్రమేయం కూడా ఉందా..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
Also Read..
గోల్డ్ లోన్ తీసుకున్నాక ధరలు పడిపోతే ఏం చేస్తారు..? LTV అంటే ఏమిటి..?
సీసీటీవీ కెమెరాల అమ్మకాలపై కఠిన నిబంధనలు తెచ్చిన ప్రభుత్వం.. చైనా కంపెనీలకు షాకే
చరిత్రలో తొలిసారి డబుల్ అయిన జెట్ ఫ్యూయల్ ధర.. భారీగా పెరగనున్న విమాన ఛార్జీలు!
సంబంధిత వార్తలు

CM Devendra Fadnavis | నాయకత్వాన్ని కాపాడుకోవడమే రాహుల్ గాంధీ లక్ష్యం: సీఎం దేవేంద్ర ఫడ్నవిస్
ఏప్రిల్ 12, 2026

Bank Lockers | బ్యాంకుల్లో లాకర్లను తీసుకుంటున్నారా..? చార్జిలు ఎలా ఉంటాయి, ఇతర రూల్స్ తెలుసుకోండి..!
మార్చి 29, 2026

FSL Fire Accident | రికవరీ కష్టమే.. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం కేసులో ట్విస్ట్
ఫిబ్రవరి 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



