ICICI Bank | ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై కొత్త ఛార్జీలు.. డిసెంబర్ నుంచి బెనిఫిట్స్ కట్..
ICICI Bank | ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుల నిబంధనల్లో డిసెంబర్ నుంచి కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. కార్డు రీప్లేస్‌మెంట్ ఛార్జీలను పెంచడంతోపాటు, అంతర్జాతీయ లావాదేవీలపై డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ ఛార్జీని 3.50 శాతానికి పెంచనుంది. మరోవైపు ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై ఉచిత బీమా, ఐనాక్స్ సినిమా ప్రయోజనాలను నిలిపివేయనుంది.
ICICI Bank | ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుల నిబంధనల్లో డిసెంబర్ నుంచి కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. కార్డు రీప్లేస్‌మెంట్ ఛార్జీలను పెంచడంతోపాటు, అంతర్జాతీయ లావాదేవీలపై డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ ఛార్జీని 3.50 శాతానికి పెంచనుంది. మరోవైపు ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై ఉచిత బీమా, ఐనాక్స్ సినిమా ప్రయోజనాలను నిలిపివేయనుంది.
కీలక మార్పులను ప్రకటించిన బ్యాంకు..
ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డులకు సంబంధించి పలు కీలక మార్పులను ప్రకటించింది. ఈ మార్పులు వచ్చే 2 నెలల్లో వేర్వేరు తేదీల నుంచి అమల్లోకి రానున్నాయి. సాధారణ క్రెడిట్ కార్డుల రీప్లేస్‌మెంట్ ఛార్జీని ప్రస్తుతం ఉన్న రూ.200 నుంచి రూ.300కి పెంచనుంది. ఈ కొత్త ఛార్జీలు డిసెంబర్ 11 నుంచి అమలులోకి వస్తాయి. అయితే ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్, 1838 రిజర్వ్, టైమ్స్ బ్లాక్ క్రెడిట్ కార్డులకు ఈ పెంపు వర్తించదు. అలాగే ప్రస్తుతం ఉచితంగా అందిస్తున్న ప్రైయారిటీ పాస్ కార్డు రీప్లేస్‌మెంట్‌కు కూడా డిసెంబర్ 11 నుంచి రూ.300తోపాటు జీఎస్టీ వసూలు చేయనుంది. ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్, ఎమరాల్డ్ ప్రైవేట్, ఎమరాల్డ్, సఫైరో, టైమ్స్ బ్లాక్ సహా ఎంపిక చేసిన కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులకు ఈ నిబంధన వర్తిస్తుంది.
ఉచిత బీమా, సినిమా ప్రయోజనాలకు స్వస్తి..
డిసెంబర్ 15 నుంచి ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై కొన్ని ఉచిత బీమా ప్రయోజనాలను బ్యాంక్ నిలిపివేయనుంది. ఎయిర్ యాక్సిడెంట్, సంబంధిత బీమా కవరేజీని ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్, టైమ్స్ బ్లాక్, ఎమరాల్డ్, ఎమరాల్డ్ ప్రైవేట్, డైమాంట్, సఫైరో, రూబిక్స్ కార్డులపై నిలిపివేయనుంది. క్యాన్సిలేషన్ ఫర్ ఎనీ రీజన్ (సీఎఫ్ఏఆర్) బీమా ప్రయోజనాన్ని ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్, టైమ్స్ బ్లాక్, ఎమరాల్డ్, ఎమరాల్డ్ ప్రైవేట్ కార్డులకు నిలిపివేయనుంది. పరాక్రమ్ సెలెక్ట్, పరాక్రమ్ క్రెడిట్ కార్డులపై వ్యక్తిగత ప్రమాద, విమాన ప్రమాద బీమా కవరేజీని కూడా రద్దు చేయనుంది. అదే విధంగా రూబిక్స్, కోరల్, ఎక్స్‌ప్రెషన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతోపాటు మరికొన్ని ఎంపిక చేసిన కార్డులపై ఉచిత ఐనాక్స్ సినిమా ప్రయోజనం కూడా డిసెంబర్ 15 నుంచి అందుబాటులో ఉండదు.
అంతర్జాతీయ లావాదేవీలపై ఛార్జీల పెంపు..
నవంబర్ 25 నుంచి ఎంపిక చేసిన బిజినెస్, కార్పొరేట్ క్రెడిట్ కార్డులపై డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ (డీసీసీ) ఛార్జీని భారీగా పెంచనుంది. విదేశాల్లో ఉన్నప్పుడు భారతీయ రూపాయల్లో అంతర్జాతీయ లావాదేవీలు జరిపినా, విదేశాల్లో నమోదైన వ్యాపార సంస్థలతో భారత్‌లో రూపాయల్లో లావాదేవీలు చేసినా ఈ ఛార్జీ వర్తిస్తుంది. ప్రస్తుతం లావాదేవీ మొత్తంలో 1 శాతంగా ఉన్న ఈ ఛార్జీని 3.50 శాతానికి పెంచనుంది. ఇది సంబంధిత కార్డులపై వర్తించే ఫారెక్స్ మార్కప్ ఛార్జీకి సమానంగా ఉంటుంది. బిజినెస్ బ్లాక్ అడ్వాంటేజ్, బిజినెస్ బ్లూ అడ్వాంటేజ్, ట్రావెల్ ఏజెంట్ కార్డు (బీసీసీఎల్-వీ), బిజినెస్ ప్లాటినం, ప్లాటినం కార్డు (బీసీసీఎల్-వీ), గోల్డ్ బిజినెస్ కార్డు (బీసీఐఎల్-వీ), గోల్డ్ బిజినెస్ కార్డు (బీసీసీఎల్-వీ) తదితర కార్డులపై ఈ మార్పులు ప్రభావం చూపనున్నాయి. కాబట్టి ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులు తమ కార్డులకు వర్తించే కొత్త ఛార్జీలు, నిలిపివేయనున్న ప్రయోజనాలను ముందుగానే పరిశీలించడం మంచిది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

ICICI Bank | ఐసీఐసీఐ బ్యాంక్ గుడ్‌న్యూస్.. ఎఫ్డీలపై వడ్డీ రేట్లు పెంపు..
నవంబర్ 2, 2026

ICICI Bank | ఖాతాదారులకు ఐసీఐసీఐ బ్యాంక్ షాక్.. డిసెంబర్ 1 నుంచి డిపాజిట్, ఉపసంహరణ చార్జీల పెంపు
అక్టోబర్ 23, 2026

Job Mela | ఐసీఐసీఐలో 250 రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు.. రేపు సంగారెడ్డిలో జాబ్‌మేళా..
ఆగస్టు 13, 2026
తాజావార్తలు
- ●Special Parliament Session | త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు : ప్రభుత్వ వర్గాలు
- ●Rashmika Mandanna | రష్మిక మందన్న మైసా పోస్ట్‌పోన్? - కొత్త రిలీజ్ డేట్ ఇదేనా!
- ●India Cleanest City 2026 | ఇండోర్ 8 ఏళ్ల రికార్డుకు తెర: దేశంలోనే నం.1 క్లీన్ సిటీగా 'నవీ ముంబై'.. సత్తా చాటిన విజయవాడ, విశాఖ!
- ●Engagement Ceremony | దేశపతి దంపతుల కుమార్తె నిశ్చితార్థం.. కాబోయే వధూవరులకు బీఆర్ఎస్ నేతల ఆశీర్వాదం
- ●Manne Krishank | రాజీవ్ గాంధీ కూడా ఐస్ క్రీమ్ అమ్మారు..
- ●Mumbai Local Train Incident | 'బ్యాడ్ టచ్'ను ఎదిరించినందుకు రైలు నుంచి యువతిని తోసేశాడు

Special Parliament Session | త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు : ప్రభుత్వ వర్గాలు

Rashmika Mandanna | రష్మిక మందన్న మైసా పోస్ట్‌పోన్? - కొత్త రిలీజ్ డేట్ ఇదేనా!

India Cleanest City 2026 | ఇండోర్ 8 ఏళ్ల రికార్డుకు తెర: దేశంలోనే నం.1 క్లీన్ సిటీగా 'నవీ ముంబై'.. సత్తా చాటిన విజయవాడ, విశాఖ!

Engagement Ceremony | దేశపతి దంపతుల కుమార్తె నిశ్చితార్థం.. కాబోయే వధూవరులకు బీఆర్ఎస్ నేతల ఆశీర్వాదం



