CCTV Security Rules | సీసీటీవీ కెమెరాల అమ్మకాలపై కఠిన నిబంధనలు తెచ్చిన ప్రభుత్వం.. చైనా కంపెనీలకు షాకే
CCTV Security Rules | దేశ భద్రత సీసీటీవీ (CCTV) కెమెరాల అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిఘా పరికరాల కోసం కఠినమైన నిబంధనలను నేటి నుంచి అమల్లోకి తెచ్చింది.
CCTV Security Rules | సీసీటీవీ (CCTV) కెమెరాలు నేరాలను అరికట్టడంలో, భద్రతను పెంపొందించడంలో, సాక్ష్యాలను సేకరించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుత మార్కెట్లో వివిధ బ్రాండ్లకు చెందిన సీసీటీవీ కెమెరాలు లభిస్తున్నాయి. అయితే, వాటి భద్రతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ భద్రత దృష్ట్యా సీసీటీవీ కెమెరాల అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిఘా పరికరాల కోసం కఠినమైన నిబంధనలను నేటి నుంచి అమల్లోకి తెచ్చింది.
ఈ కొత్త నిబంధనల ప్రకారం.. మన దేశంలో విక్రయించే ఏ సీసీటీవీ ఉత్పత్తులైనా తప్పనిసరిగా అవసరమైన అనుమతులు పొందాల్సి ఉంటుంది. అవి కూడా STQC (Standardisation Testing and Quality Certification) నాణ్యత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినవై ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దేశీయ మార్కెట్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న హిక్‌విజన్, టీపీ-లింక్ వంటి చైనీస్ కంపెనీల కార్యకలాపాలపై (Chinese Brands) తీవ్ర ప్రభావం పడనుంది.
స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ లేని సీసీటీవీ యూనిట్ల అమ్మకాలను 2025 ఏప్రిల్ 9 నుంచి కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ నిషేధించిన విషయం తెలిసిందే. అయితే, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న సీసీటీవీ కెమెరాలను అమ్ముకోవడానికి వ్యాపారులకు 2026 మార్చి 31 వరకు అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం విధించిన గడువు నిన్నటితో ముగిసిపోయింది. ఇక నేటి నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ అనుమతులు పొందిన సీసీటీవీ కెమెరాలనే భారత వ్యాపారులు అమ్మాల్సి ఉంటుంది.
చైనా కంపెనీలకు షాక్..
ప్రభుత్వ నిర్ణయంతో STQC ఆమోదం పొందని కంపెనీలు నేటి నుంచి తమ ఉత్పత్తులను దేశంలో విక్రయించడానికి అనుమతి లేదు. ఇంటర్నెట్‌తో అనుసంధానమయ్యే పరికరాల ద్వారా డేటా చోరీ జరగకుండా ఉండటమే ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు ఉద్దేశం. చైనా చిప్‌సెట్లను వాడటం వల్ల మన సమాచారం విదేశీ సర్వర్లకు చేరుతుందన్న ఆందోళన ప్రభుత్వంలో ఉంది. అందుకే చైనా చిప్‌సెట్లపై ఆధారపడటం తగ్గించాలని కేంద్రం గట్టి పట్టుదలతో ఉంది. ఈ నిర్ణయంతో చైనా కంపెనీలకు గట్టి షాకనే చెప్పాలి. ఇకపై చైనా సంస్థలు మన దేశంలో సీసీటీవీ కెమెరాలను విక్రయించడం అసాధ్యం. ఎందుకంటే.. ఏ చైనా కంపెనీ తమ ఉత్పత్తులకు స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ ధ్రువీకరణ ఇవ్వదు. అందుకే చైనాలో తయారైన చిప్‌సెట్‌లను ఉపయోగించే డివైజ్‌లకు అధికారులు ధృవీకరణ పత్రం ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్లు సమాచారం.
ప్రభుత్వ సంస్థలో 10 లక్షల చైనా పరికరాలు..
నిఘా మౌలిక సదుపాయాలకు సంబంధించిన భద్రతా ఆందోళనలు కొత్తవేమీ కావు. ప్రభుత్వ సంస్థల్లో ఏర్పాటు చేసిన సుమారు పది లక్షల కెమెరాలు చైనా కంపెనీలవేనని 2021లో ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. ఈ వ్యవస్థలు హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉందని లేదా సున్నితమైన వీడియో డేటాను భారతదేశం వెలుపల ఉన్న సర్వర్‌లకు బదిలీ చేసే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా వీటి అమ్మకాలపై కఠిన నిబంధనలు తీసుకొచ్చారు.
ఇవి మస్ట్..
ఈ కొత్త నిబంధనల ప్రకారం సీసీటీవీ తయారీదారులు ప్రతి చిన్న విషయాన్ని ప్రభుత్వానికి వెల్లడించాలి. ముఖ్యంగా కెమెరాలో వాడే సిస్టమ్-ఆన్-చిప్ (SoC) ఏ దేశంలో తయారైంది? హార్డ్‌వేర్ మూలాలు ఏంటి? అనే వివరాలను కంపెనీలు వెల్లడించాలి. పరికరాల్లో భద్రతా లోపాలు ఉన్నాయా లేదా అనే అంశంపై కఠిన పరీక్షలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ నిఘా పరికరాల్లో హార్డ్‌కోడెడ్ క్రెడెన్షియల్స్ (ముందుగానే సెట్ చేసిన పాస్‌వర్డ్‌లు) లేదా రహస్య బ్యాక్‌డోర్‌లు ఉండకూడదు. అవి తప్పనిసరిగా సురక్షితమైన ఫర్మ్‌వేర్, అప్‌డేట్ యంత్రాంగాలను కలిగి ఉండాలి.
బలమైన ఎన్‌క్రిప్షన్‌ను ఉపయోగించి కమ్యూనికేషన్‌లను రక్షించాలి. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ భాగాలను ఎవరూ ట్యాంపరింగ్ చేయకుండా తయారీదారులు జాగ్రత్త వహించాలి. ఎవరైనా బయటి వ్యక్తులు రిమోట్ ద్వారా కెమెరాలను హ్యాక్ చేసే అవకాశం ఉంటే అటువంటి వాటికి అనుమతి నిరాకరిస్తారు.భారత్‌లో అసెంబుల్ చేసిన పరికరాలు కూడా ఈ పరీక్షలను ఎదుర్కోవాల్సిందే. ఇప్పటివరకు సుమారు 500 సీసీటీవీ మోడళ్లు ఈ కొత్త నిబంధనల ప్రకారం సర్టిఫికేషన్ పొందాయి.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



