త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UP | అత్యాచారం కేసులో బెయిల్‌.. రోడ్ షో నిర్వ‌హించిన నిందితుడు

UP | విద్యార్థినిపై (LLB student) అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఓ వ్య‌క్తి బెయిల్‌పై విడుద‌ల‌య్యాడు. జైలు నుంచి బ‌య‌ట‌కు రాగానే అత‌డికి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఈ వ్య‌వ‌హారం స్థానికంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

D

National | Published On May 19, 2026, 5.03 pm IST

UP | అత్యాచారం కేసులో బెయిల్‌.. రోడ్ షో నిర్వ‌హించిన నిందితుడు
Advertisement

UP | ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ (Uttar Pradesh)లోని ఘ‌జియాబాద్‌ (Ghaziabad)లో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఎల్ఎల్‌బీ విద్యార్థినిపై (LLB student) అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న హిందూ యువవాహిని మాజీ సభ్యుడు సుశీల్ ప్రజాపతి బెయిల్‌పై విడుద‌ల‌య్యాడు. అయితే, జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన అత‌డికి ఘ‌న స్వాగ‌తం ల‌భించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

సుశీల్ ప్ర‌జాప‌తి ఓ న్యాయ‌వాదిని ప‌రిచ‌యం చేస్తాన‌ని న‌మ్మించి ఎల్‌ఎల్‌బీ విద్యార్థినిని ఒక ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. అక్క‌డ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్లు అత‌డిపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో అత‌న్ని పోలీసులు అరెస్ట్ చేయ‌డంతో శిక్ష ప‌డింది. తొమ్మిది నెల‌లుగా అత‌డు జైల్లోనే ఉన్నాడు. తాజాగా అత‌డికి బెయిల్ ల‌భించ‌డంతో జైలు నుంచి విడుద‌ల‌య్యాడు.

ఘ‌జియాబాద్ జైలు నుంచి విడుద‌లైన సుశీల్‌కు అత‌డి అనుచ‌రులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అత‌డి మెల్లో దండ‌లు వేసి భుజాల‌పై ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒక‌టి వైర‌ల్‌గా మారింది. ఓ అత్యాచార కేసులో నిందితుడు రోడ్ షో నిర్వ‌హించ‌డంపై తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.

Also Read..

దారుణం.. క‌దులుతున్న కారులో మ‌హిళా లాయ‌ర్‌పై అఘాయిత్యం

మేం క‌దిల్తేనే కాంగ్రెసోళ్లు కండ్లు తెరిచిండ్రు: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

అందుకే రిస్క్ తీసుకున్నా - ప్రొడ్యూస‌ర్‌గా మార‌డంపై స‌మంత కామెంట్స్‌

Advertisement
Advertisement