Samantha | అందుకే రిస్క్ తీసుకున్నా – ప్రొడ్యూసర్‌గా మారడంపై సమంత కామెంట్స్
మా ఇంటి బంగారం సినిమాలో హీరోయిన్‌గా నటిస్తూనే ఈ సినిమాను సమంత స్వయంగా నిర్మిస్తోంది. క్రైమ్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతగా మారడానికి గల కారణాలను ఈ సినిమా ప్రమోషన్స్‌లో సమంత రివీల్ చేసింది.
Entertainment | Published On May 19, 2026, 4.56 pm IST
Samantha | గ్లామర్ క్వీన్ సమంత హీరోయిన్‌గా నటించిన మా ఇంటి బంగారం మూవీ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రైమ్ కామెడీ మూవీతో దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత హీరోయిన్‌గా తెలుగులోకి రీఎంట్రీ ఇస్తోంది సమంత. మా ఇంటి బంగారం సినిమాను భర్త రాజ్ నిడిమోరుతో కలిసి సమంత స్వయంగా నిర్మిస్తోంది. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
సెకండ్ మూవీ...
నిర్మాతగా సమంతకు ఇది సెకండ్ మూవీ. ట్రాలాలా మోషన్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించిన సమంత తొలి ప్రయత్నంగా శుభం సినిమాను నిర్మించింది. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. మా ఇంటి బంగారం సినిమాను భారీ బడ్జెట్‌తో సమంత తెరకెక్కిస్తోంది. నిర్మాతగా మారడటానికి గల కారణాలను ఈ సినిమా ప్రమోషన్స్‌లో సమంత రివీల్ చేసింది.
ట్రెండ్‌కు భిన్నంగా...
"ఇదివరకు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ అంటే ఓవర్ సెంటిమెంట్‌తో సీరియస్‌గా సాగేవి. సామాజిక సమస్యలను చర్చిస్తూ డైరెక్టర్లు ఈ సినిమాలను తెరకెక్కించేవారు. ఈ ట్రెండ్‌కు భిన్నంగా మా ఇంటి బంగారం ఉంటుంది. కామెడీ కథలతో ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేయచ్చని నిరూపించాలని అనుకుంటున్నాం" అని సమంత అన్నది. యాక్షన్ కామెడీ అంశాల కలబోతగా తన పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుందని సమంత చెప్పింది.
నిర్మాతగా మారా....
"సినిమాల్లో హీరోయిన్లను చూపించే తీరు మారాలని, ఫిమేల్ సెంట్రిక్ కథలతో దర్శకనిర్మాతలు మరిన్ని సినిమాలు చేయాలని చాలా మంది కథానాయికలు కంప్లైంట్స్ ఇవ్వడం, విమర్శలు చేయడం చూశా. మార్పు కావాలని కోరుకునే ఆ హీరోయిన్లు మాత్రం రొటీన్ క్యారెక్టర్స్‌లోనే కనిపిస్తుంటారు. కొన్ని మారాలంటే రిస్క్‌లు తీసుకోవాల్సిందే. ఆ ఉద్దేశంతోనే నేనే నిర్మాతగా మారా. ఈ ప్రయత్నంలో నేను గెలిచినా, ఓడినా కూడా సినిమా నిర్మాణం మాత్రం ఆపను. భవిష్యత్తులో మరిన్ని మహిళా ప్రధాన సినిమాలు చేస్తా" అని సమంత తెలిపింది. మా ఇంటి బంగారం మూవీలో బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్యతో పాటు దిగంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 15న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ ఐపీఎల్ ఎఫెక్ట్ కారణంగా జూన్ 19కి వాయిదాపడింది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



