Niranjan Reddy | మేం కదిల్తేనే కాంగ్రెసోళ్లు కండ్లు తెరిచిండ్రు: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Niranjan Reddy | బీఆర్ఎస్ పోరుబాట పేరుతో పాదయాత్ర చేయాలన్న నిర్ణయంతో కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర లేచిందని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై రెండున్నరేళ్లకు కండ్లు తెరిచిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఈరోజు పాలమూరు ప్రాజెక్టుల మీద జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం సమీక్ష పెట్టారన్నారు.
- ఈరోజు పాలమూరు ప్రాజెక్టులపై సీఎం సమీక్ష పెట్టిండు
- అయినా క్షేత్రస్థాయిలో పనులు చేపట్టేదాకా ఊరుకోం
- కేసీఆర్ మీద కోపంతో ప్రజలకు అన్యాయం చేయొద్దు
- కల్వకుర్తి ఎత్తిపోతల మోటార్లకు మరమ్మతులు చేపట్టాలి
- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్
Niranjan Reddy | త్రినేత్ర.న్యూస్: బీఆర్ఎస్ పోరుబాట పేరుతో పాదయాత్ర చేయాలన్న నిర్ణయంతో కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర లేచిందని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై రెండున్నరేళ్లకు కండ్లు తెరిచిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఈరోజు పాలమూరు ప్రాజెక్టుల మీద జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం సమీక్ష పెట్టారన్నారు. ఈమేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటనలో స్పందించారు. 90 శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయకుండా విలువైన రెండున్నరేళ్ల సమయం వృథా చేశారని మండిపడ్డారు.
నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు పాదయాత్ర..
రెండున్నరేళ్లుగా ప్రాజెక్టు పనులను పడావు పెట్టడంపై త్వరలో నార్లాపూర్ నుండి ఉదండాపూర్ వరకు పాదయాత్ర చేయాలని ఈ నెల 15న బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. మహబూబ్ నగర్ లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో కార్యాచరణ ప్రకటించాం. పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి కేసీఆర్ ను తీసుకురావాలని ప్రతిపాదించాం అని సింగిరెడ్డి పేర్కొన్నారు.
రైతులు, ప్రజలను చైతన్యపరిచి ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించడంతో ప్రజల్లో ప్రతిఘటన తప్పదని కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టు వ్యయం పెరిగిపోతుంది. పాలమూరుపై రెండున్నరేళ్లకు కాంగ్రెస్ కండ్లు తెరిచింది. బీఆర్ఎస్ నిర్ణయంతోనే మొద్దు నిద్రలేంది. కాలువల టెండర్లను రద్దు చేయడం, రెండన్నరేళ్లుగా తట్టెడు మట్టి ఎత్తలేదు. దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నం. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఒక్కనాడు పాలమూరు ప్రాజెక్టుల మీద సమీక్ష చేయలేదు అని విమర్శించారు.
మొత్తం అయిదు మోటార్లు నడిచేలా చూడాలి..
కేసీఆర్ మీద కక్షతో రైతులను మోసం చేయద్దు. పాలమూరుకు అన్యాయం చేయొద్దు. ఇప్పటికే పనులు పూర్తి చేసి ఉంటే ఈ ఏడాది నార్లాపూర్ తో పాటు ఏదుల, వట్టెం, కరివెనలో దాదాపు 45 టీఎంసీల వరకు నీటిని నింపుకునే అవకాశం ఉండేది. క్షేత్రస్థాయిలో పనులు నిర్వహించాలి. కల్వకుర్తి ఎత్తిపోతలలో పాడైన రెండు మోటార్లకు వెంటనే మరమ్మతులు నిర్వహించాలి. మొత్తం అయిదు మోటార్లు నడిచేలా చర్యలు చేపట్టాలి. నార్లాపూర్ - ఏదుల - వట్టెం మధ్యలో ఆగిపోయిన పనులు పూర్తి చేసి ఈ ఏడాది నీటిని ఎత్తిపోసుకుని రిజర్వాయర్లు నింపేలా చర్యలు తీసుకోవాలి
బీఆర్ఎస్ పోరుబాటతోనే ప్రభుత్వంలో కదలిక వచ్చింది. అయినా పనులు చేపట్టే వరకు బీఆర్ఎస్ కార్యాచరణ ఆగదు. ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం అని నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



