త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Woman Lawyer | దారుణం.. క‌దులుతున్న కారులో మ‌హిళా లాయ‌ర్‌పై అఘాయిత్యం

Woman Lawyer | మహారాష్ట్రలోని పుణె నగరంలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగు చూసింది. బాంబే హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ఓ మహిళా లాయర్‌పై దుండగులు కదులుతున్న కారులో సామూహిక లైంగిక దాడికి ఒడిగట్టారు.

D

National | Published On May 19, 2026, 4.40 pm IST

Woman Lawyer | దారుణం.. క‌దులుతున్న కారులో మ‌హిళా లాయ‌ర్‌పై అఘాయిత్యం
Advertisement

Woman Lawyer | మ‌హారాష్ట్ర పూణెలో దారుణ ఘ‌ట‌న వెలుగు చూసింది. ఓ మ‌హిళా లాయ‌ర్ (Woman Lawyer)పై కొంద‌రు అఘాయిత్యానికి ఒడిగట్టారు. క‌దులుతున్న కారులోనే ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు.. ముగ్గురు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేశారు.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. పాట్నాకు చెందిన మ‌హిళ పూణెలో న్యాయ విద్య‌ను పూర్తి చేశారు. ప్ర‌స్తుతం ముంబై హైకోర్టులో (Mumbai High Court) ప్రాక్టీస్ మొద‌లు పెట్టారు. అయితే, స‌ద‌రు మ‌హిళా లాయ‌ర్ ప‌ని నిమిత్తం పూణెకు వెళ్లారు. కోరేగావ్ పార్క్ (Koregaon Park) ప‌రిధిలోని ఓ ఫైవ్‌స్టార్ హోట‌ల్‌లో స్టే చేశారు. ఆ స‌మ‌యంలో ఆమెకు మ్యాట్రీమోనీ యాప్‌లో ప‌రిచ‌యం ఏర్ప‌డిన త‌న ఫ్రెండ్‌ను అక్క‌డికి ఇన్వైట్ చేశారు. సదరు వ్యక్తి తనతో పాటు మరో ఇద్దరు మహిళలను తీసుకుని రాగా, అంతా కలిసి కాసేపే స‌ర‌దాగా మాట్లాడుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.

ఆదివారం సాయంత్రం హోటల్‌లోని పబ్‌లో మ‌ద్యం తాగుతుండ‌గా.. పక్కనే ఉన్న ఇద్దరు వ్యక్తులతో ఆమెకు ప‌రిచయం ఏర్ప‌డింది. ఆ తర్వాత ముగ్గురూ క‌లిసి మరో పబ్‌కు (Pub Party) వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అర్ధ‌రాత్రి 1 గంట దాటిన త‌ర్వాత కారులో వెళ్తుండ‌గా.. ఓ వ్య‌క్తి మ‌హిళ ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగని ఆ మృగాళ్లు మరో ఇద్దరు స్నేహితులకు కూడా ఫోన్ చేసి అక్కడికి పిలిపించారు. వాళ్లు కూడా ఆమెను లైంగికంగా వేధించారు.

ఈ ఘ‌ట‌న త‌ర్వాత స‌ద‌రు మ‌హిళా లాయ‌ర్ కోరేగావ్ పార్క్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. త‌న‌పై లైంగిక దాడి జ‌రిగింద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ స‌మ‌యంలో నిందితులు త‌న ప‌ర్స్‌ను కూడా రోడ్డుపై విసిరేసిన‌ట్లు ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు.. ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కారు నంబ‌ర్ ఆధారంగా ముగ్గురు వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకున్నారు. మ‌రొక‌రి కోసం గాలిస్తున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. అదుపులోకి తీసుకున్న నిందితులను అభిషేక్ నవనాథ్ ముక్తే, ధనంజయ్ సోర్టే, ఆదేశ్ షిండేలుగా గుర్తించారు. సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మహిళా లాయర్‌పైనే ఇలా దారుణానికి పాల్ప‌డ‌టం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ ఘ‌ట‌న‌తో స‌మాజంలో మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌పై అనేక ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.

Also Read..

త్వ‌ర‌లోనే ఆర్థిక తుఫాను.. ముందెన్న‌డూ చూడ‌ని విధంగా ఉంటుంది.. రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కోర్టు ధిక్క‌ర‌ణ కేసు.. ఆప్ నేత‌ల‌కు ఢిల్లీ హైకోర్టు తాఖీదులు..

జ‌ల‌మండలిలో ఎలాంటి నియామ‌కాల్లేవు.. అది అస‌త్య ప్ర‌చార‌మే..

Advertisement
Advertisement