Dera Baba | డేరా బాబాకు మరోసారి పెరోల్.. తొమ్మిదేళ్లలో 16వసారి
Dera Baba | ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడ్డాడన్న కేసులో దోషిగా తేలిన ‘డేరా సచ్చా సౌదా’ (Dera Sacha Sauda) చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మరోసారి 30 రోజుల పెరోల్ లభించింది. శిక్ష పడిన నాటి నుంచి అంటే 2017 నుంచి ఆయనకు పెరోల్ లభించడం ఇది 16వ సారి.
Dera Baba | ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడ్డాడన్న కేసులో దోషిగా తేలిన ‘డేరా సచ్చా సౌదా’ (Dera Sacha Sauda) చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (Gurmeet Ram Rahim Singh) అలియాస్ డేరా బాబా (Dera Baba)కు మరోసారి పెరోల్ (parole) లభించింది. రామ్ రహీమ్‌కు 30 రోజుల పెరోల్ మంజూరైనట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ఇక ఈ 30 రోజులూ ఆయన సిర్సాలోని తన డేరా ప్రధాన కార్యాలయంలో ఉంటారని న్యాయవాది జితేందర్ ఖురానా తెలిపారు.
కాగా, 2017లో ఇద్దరు శిష్యులపై అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిగా నిర్ధారణ అయిన తరువాత కోర్టు అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ రెండు అత్యాచారాలకు సంబంధించిన కేసులో దోషిగా శిక్ష అనుభవించడంతో పాటు పలు హత్య కేసుల్లో కూడా ఆయన జీవిత ఖైదు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం అతడు హర్యానాలోని రోహ్‌తక్ (Rohtak) జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, ఆయన వివిధ కారణాలతో పలుమార్లు పెరోల్‌పై బయటకు వస్తున్న విషయం తెలిసిందే. 2017 నుంచి ఆయనకు పెరోల్ లభించడం (తొమ్మిదేళ్లలో) ఇది 16వసారి కావడం గమనార్హం.
Also Read..
వివాదంలో పెద్ది సాంగ్.. డాన్స్ మూమెంట్స్‌పై సోషల్ మీడియాలో విమర్శలు..!
పీకల్లోతు ప్రేమలో దురంధర్ బ్యూటీ.. దుబాయి బిలియనీర్‌తో డేటింగ్..!
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Telangana Urban Development | తెలంగాణ పట్టణ సంస్కరణలపై నేపాల్ ప్రతినిధుల అధ్యయనం
- ●SIR | ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి
- ●CS Sanjay Jaju | పథకాల అమలులో వేగం పెంచాలి.. అధికారులకు సీఎస్ సంజయ్ జాజు దిశానిర్దేశం
- ●Tamil OTT | ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ మూవీ - ప్రీతి ముకుందన్, కయదు లోహర్ హీరోయిన్లు - తెలుగులో స్ట్రీమింగ్
- ●Suriya | జ్యోతికతో సూర్య ఫొటోషూట్ - పెళ్లై ఇరవై ఏళ్లయ్యిందంటే నమ్మలేకపోతున్నామంటూ ఫ్యాన్స్ కామెంట్స్
- ●Uttam Kumar Reddy | సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులే లక్ష్యం : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి

Telangana Urban Development | తెలంగాణ పట్టణ సంస్కరణలపై నేపాల్ ప్రతినిధుల అధ్యయనం

SIR | ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి

CS Sanjay Jaju | పథకాల అమలులో వేగం పెంచాలి.. అధికారులకు సీఎస్ సంజయ్ జాజు దిశానిర్దేశం

Tamil OTT | ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ మూవీ - ప్రీతి ముకుందన్, కయదు లోహర్ హీరోయిన్లు - తెలుగులో స్ట్రీమింగ్






