Peddi Movie | వివాదంలో పెద్ది సాంగ్.. డాన్స్ మూమెంట్స్‌పై సోషల్ మీడియాలో విమర్శలు..!
Peddi Movie | మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం పెద్ది. ఈ మూవీ నుంచి ఇటీవల స్పెషల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో రామ్‌చరణ్‌తో కలిసి శృతి హాసన్, జాన్వీ కపూర్ స్టెప్పులేశారు. అయితే, నెట్టింట ఈ సాంగ్‌పై తీవ్ర చర్చ సాగుతోంది. ఈ పాటలో డాన్స్ మూమెంట్స్‌పై నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Entertainment | Published On May 26, 2026, 9.13 am IST
Peddi Movie | మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం పెద్ది. ఈ మూవీ నుంచి ఇటీవల స్పెషల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో రామ్‌చరణ్‌తో కలిసి శృతి హాసన్, జాన్వీ కపూర్ స్టెప్పులేశారు. అయితే, నెట్టింట ఈ సాంగ్‌పై తీవ్ర చర్చ సాగుతోంది. ఈ పాటలో డాన్స్ మూమెంట్స్‌పై నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హావభావాలు, స్టెప్పులు అసభ్యకరంగా ఉన్నాయని పలువురు సోషల్ మీడియా యూజర్లు విమర్శిస్తున్నారు. ఇది డాన్స్ సాంగ్ కంటే ఓ ఐటమ్ నంబర్‌లా మారిందని పలువురు కామెంట్స్ చేశారు. 2026లో ఇలాంటి పాట అవసరమా? అంటూ కొందరు ప్రశ్నించగా.. మరికొందరు మహిళలని ఆబ్జెక్టిఫై చేసేలా స్టెప్పులు ఉన్నాయని మండిపడుతున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘తెలుగు సినిమాల్లో ఇలాంటి డాన్స్ నంబర్లపైఎందుకు ఇంకా ఆసక్తి చూపుతున్నారు? ఇది పూర్తిగా అసభ్యకరంగా ఉంది’ అంటూ రాసుకొచ్చాడు. అయితే, ఈ పాటకు మ్యూజిక్‌ను అందించడంతో పాటు స్వయంగా గాయని రక్షిత సురేశ్‌తో కలిసి పాడారు.
జాన్వీ పాత్రపై విమర్శలు..
ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్‌పై సైతం సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రెండ్ అయ్యింది. ఈసారి చర్చ ఎక్కువగా సినిమాపై కాకుండా హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రపైకి మళ్లినట్లు కనిపించింది. గ్రామీణ నేపథ్యం, భారీ విజువల్స్, ఎమోషనల్ టచ్‌తో సినిమా గ్రాండ్‌గా అనిపించినప్పటికీ, జాన్వీ కపూర్ పాత్ర ప్రెజెంటేషన్‌పై కొంతమంది నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో కనిపించే పాత ఫార్మాట్‌నే ‘పెద్ది’లోనూ కొనసాగించారా? అన్న ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ట్రైలర్‌లో ఆమె పాత్రను ఎక్కువగా గ్లామర్ షేడ్స్‌లో చూపించారని, కథలో ఉన్న ఎమోషనల్ డెప్త్‌తో ఆ పాత్ర పూర్తిగా కలిసిపోలేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. జాన్వీ కపూర్ పాత్రకు నిజమైన ప్రాధాన్యత ఏంటి? అంటూ పలువురు ప్రశ్నించారు. సినిమా ప్రమోషన్స్ నుంచి ట్రైలర్ వరకు ఆమెను గ్లామర్ కోణంలోనే ఎక్కువగా చూపించడంతో, కథలో ఆమె పాత్ర పరిమితంగానే ఉండొచ్చన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దేవర తరహా కమర్షియల్ ఫార్మాట్‌నే మళ్లీ రిపీట్ చేస్తున్నారా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న మూవీ జూన్ 4న విడుదల కానుంది.
Telugu industry and their obsession with cheap dance moves ☠️
I heard this song of #Peddi movie yesterday, The dance moves of the song seemed very vulgar and women objectifying.
Why did an actor who has been a part of an Oscar winning movie feel the need to have such an item… pic.twitter.com/UdkdYY4nH5
— Mr SP (@Lonely_prabh) May 24, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Minister Uttam Kumar Reddy | రైతుల ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం.. ప్రతీ గింజకూ లెక్క చెప్పాల్సిందే : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
ఆగస్టు 4, 2026

Harish Rao | డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కు పూర్తి స్థాయి అధికారిని నియమించాలి.. హరీశ్ రావు డిమాండ్
ఆగస్టు 4, 2026

Minister Ponnam Prabhakar | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అభిప్రాయ సేకరణ చేపట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్
ఆగస్టు 4, 2026
తాజావార్తలు
- ●Samsung Galaxy F70 Pro 5G | తక్కువ ధరకే శాంసంగ్ కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్.. భారీ బ్యాటరీ, 6 ఏళ్ల వరకు అప్డేట్స్..
- ●DK Shivakumar | రాజీనామా చేస్తే.. క్షణం ఆలోచించకుండా ఆమోదిస్తా.. అసమ్మతి ఎమ్మెల్యేలకు డీకే స్ట్రాంగ్ వార్నింగ్
- ●హలీమ్ నుండి ఇక్కత్ వరకు: ప్రపంచ మార్కెట్లను ఏలుతున్న 'జీఐ ట్యాగ్' ఉత్పత్తుల కథ!
- ●PhonePe | ఫోన్ పే రూ.10 పెట్టుబడి ఫీచర్‌కు విశేష రీతిలో స్పందన.. భారీగా పెరుగుతున్న కస్టమర్లు..
- ●Minister Uttam Kumar Reddy | రైతుల ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం.. ప్రతీ గింజకూ లెక్క చెప్పాల్సిందే : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
- ●Kaloji Health University | విద్యార్థులకు అలర్ట్.. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ

Samsung Galaxy F70 Pro 5G | తక్కువ ధరకే శాంసంగ్ కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్.. భారీ బ్యాటరీ, 6 ఏళ్ల వరకు అప్డేట్స్..

DK Shivakumar | రాజీనామా చేస్తే.. క్షణం ఆలోచించకుండా ఆమోదిస్తా.. అసమ్మతి ఎమ్మెల్యేలకు డీకే స్ట్రాంగ్ వార్నింగ్

హలీమ్ నుండి ఇక్కత్ వరకు: ప్రపంచ మార్కెట్లను ఏలుతున్న 'జీఐ ట్యాగ్' ఉత్పత్తుల కథ!

PhonePe | ఫోన్ పే రూ.10 పెట్టుబడి ఫీచర్‌కు విశేష రీతిలో స్పందన.. భారీగా పెరుగుతున్న కస్టమర్లు..



