త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dating App | డేటింగ్ యాప్ ప్రేమలో ట్విస్ట్.. ఆ విష‌యం తెలిసి పెండ్లికి నిరాక‌రించిన యువ‌కుడు!

Dating App | డేటింగ్ యాప్‌లో (Dating App) పరిచయమైన యువకుడిని పెండ్లి చేసుకునేందుకు వేల కిలోమీటర్లు ప్రయాణించి భార‌త్‌కు వచ్చిన ఓ కెనడా మహిళకు (Canada Woman) చేదు అనుభవం ఎదురైంది.

G

National | Published On Nov 15, 2026, 12.05 pm IST

Dating App | డేటింగ్ యాప్ ప్రేమలో ట్విస్ట్.. ఆ విష‌యం తెలిసి పెండ్లికి నిరాక‌రించిన యువ‌కుడు!
Advertisement

Dating App | త్రినేత్ర న్యూస్‌: డేటింగ్ యాప్‌లో (Dating App) పరిచయమైన యువకుడిని పెండ్లి చేసుకునేందుకు వేల కిలోమీటర్లు ప్రయాణించి భార‌త్‌కు వచ్చిన ఓ కెనడా మహిళకు (Canada Woman) చేదు అనుభవం ఎదురైంది. వివాహం చేసుకునేందుకు నిరాక‌రించంతో ఆమె కెన‌డా ఎంబ‌సీని ఆశ్ర‌యించాల్సి వ‌చ్చింది.

హ‌ర్యానాకు చెందిన నితిన్ ఓ ప్రైవేటు పాఠ‌శాల‌లో ఉపాధ్యాయుడిగా ప‌నిచేస్తున్నాడు. ఏడాది క్రితం కెనడాకు చెందిన మ‌హిళ‌తో డేటింగ్ యాప్‌లో ప‌రిచ‌య‌మైంది. అప్ప‌టి నుంచి ఇద్ద‌రూ మాట్లాడుకున్నారు. అదికాస్తా స్నేహంగా.. అనంత‌రం ప్రేమ‌గా మారింది. ఈ క్ర‌మంలో పెండ్లి (Marriage) చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీంతో న‌వంబ‌ర్ 11న‌ టూరిస్టు వీసాపై ఆమె ఢిల్లీకి చేరుకుంది. విమానాశ్ర‌యానికి వెళ్లిన నితిన్‌.. ఆమెను రిసీవ్ చేసుకున్నాడు. అక్క‌డి నుంచి రాజ‌స్థాన్‌లోని (Rajasthan) కోట్‌పుట్లీ-బెహ్రుర్ జిల్లా నీమ్రానాలోని (Neemrana) త‌న బంధువుల ఇంటికి ఆమెను తీసుకెళ్లాడు. రెండు రోజుల‌పాటు ఇద్ద‌రూ క‌లిసి ఉన్నారు. వివాహానికి సంబంధించి చ‌ర్చ‌లు జ‌రుగుతుండ‌గా.. అస‌లు విష‌యం తెలిసి అంతా షాక్ అయ్యారు.

మారిన సీన్‌..

ఆమె వ‌య‌స్సు 61 ఏండ్లు చెప్ప‌డంతో.. వివాహం చేసుకోవ‌డానికి నిరాక‌రించాడు. దీంతో ఇద్ద‌రిమ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. కోటి ఆశ‌ల‌తో దేశం కాని దేశం వ‌చ్చిన ఆమె మనస్తాపానికి గురైంది. నవంబర్ 13న కెనడా రాయబార కార్యాలయాన్ని (Canadian Embassy) సంప్రదించి జరిగిన విషయాన్ని అధికారులకు వివరించింది. దీంతో ఎంబసీ అధికారులు నీమ్రానా పోలీసుల‌కు స‌మాచారం అందించారు. నితిన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలికి కోట్‌పుట్లీలోని 'కోర్ సెంటర్' (Core Centre)లో ఆశ్రయం కల్పించారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, విచారణలో తేలిన అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

అందుకేనేమో.. ప్రేమకు హద్దులు ఉండకపోవచ్చు కానీ, ప్రతి సుదూర ప్రేమకథకు సుఖాంతం ఉండదని అంటారు..!

Advertisement
Advertisement