Krystle D’Souza | పీకల్లోతు ప్రేమలో దురంధర్ బ్యూటీ.. దుబాయి బిలియనీర్‌తో డేటింగ్..!
Entertainment | Published On May 26, 2026, 8.43 am IST
Krystle D’Souza | బాలీవుడ్ బ్యూటీ క్రిస్టల్ డిసౌజా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ‘ధురంధర్’ సినిమాలోని ‘శరారత్’ పాటతో తిరిగి లైమ్‌లైట్‌లోకి వచ్చిన ఈ అమ్మడు.. తాజాగా వ్యక్తిగత జీవితం కారణంగా వార్తలకెక్కింది. దుబాయికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లుగా నెట్టింట జోరుగా టాక్ నడుస్తోంది. ఇటీవల జరిగిన ఓ ప్రైవేట్ పార్టీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో రూమర్స్ మరింత పెరిగాయి. ఆ వీడియోలో క్రిస్టల్ డిసౌజా తన స్నేహితులతో కలిసి కనిపించగా.. పక్కనే ఉన్న దుబాయి బిజినెస్‌మన్ ‘ఏపీ’ ఆమె బుగ్గలపై ముద్దులు పెట్టడం వీడియోలో కనిపించింది. ఈ వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి క్రిస్టల్–ఏపీ జంటపై డేటింగ్ రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు క్రిస్టల్ డిసౌజా గానీ, ఆ వ్యాపారవేత్త గానీ స్పందించలేదు.
క్రిస్టల్ వ్యక్తిగత జీవితంపై మళ్లీ చర్చ మొదలైంది. గతంలో ఆమె ఓ సంపన్న వ్యాపారవేత్తతో రిలేషన్‌లో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరు విడిపోయినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత క్రిస్టీకి ఏపీతో పరిచయం ఏర్పడినట్లుగా తెలుస్తోంది. క్రిస్టల్, ఏపీ మధ్య సోషల్ మీడియాలో పోస్టులకు లైక్స్ కొట్టడం, కామెంట్స్ చేయడంతో ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారనే చర్చ సాగుతోంది. క్రిస్టల్ ఇటీవల దుబాయిలో లగ్జరీ కార్లతో చేసిన వీడియోలు కూడా వైరల్ కావడంతో, అవి ఏపీకి చెందినవేనన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఏపీ దుబాయి కేంద్రంగా లగ్జరీ కార్ల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఖరీదైన కార్ల విక్రయం, రెంటల్ సర్వీసులు మెయిన్ బెజినెస్. నెట్‌ఫ్లిక్స్ రియాలిటీ సిరీస్ ‘డెసీ బ్లింగ్’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.
క్రిస్టిల్ డిసౌజా కెరీర్ విషయానికి వస్తే.. తొలుత బుల్లితెరపై తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ ప్రారంభంలోనే సీరియల్స్ చేసింది. 2007లో టెలివిజన్ రంగంలో అడుగుపెట్టింది క్రిస్టిల్. తొలుత చిన్న చిన్న పాత్రల్లోనే కనిపించింది. అయితే, స్టార్ ప్లస్‌లో ప్రసారమైన ఏక్ హజారో మే మేరీ బహనా హై సీనియల్‌తో మంచి గుర్తింపు వచ్చింది. ఈ సీరియల్‌లో ఆమె పోషించిన పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఆ తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత సినిమాల వైపు అడుగులు వేసింది. 2021లో విడుదలైన ‘చెహ్రే’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని వెబ్ ప్రాజెక్ట్స్, మ్యూజిక్ వీడియోల్లో కూడా కనిపించింది. ఇటీవల దురంధర్ మూవీలో ‘షెరారత్’ సాంగ్‌లో మెరిసి అందరినీ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ కంటెంట్‌తో యువతను ఆకర్షిస్తోంది. అలాగే పలు మ్యూజిక్ వీడియోలు, స్పెషల్ అపియరెన్సెస్‌తో అభిమానులను అలరిస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harmanpreet Kaur | భారత జెర్సీ ధరించడం నా జీవితంలో గొప్ప గౌరవం.. పద్మశ్రీ అందుకోవడంపై హర్మన్‌ప్రీత్ భావోద్వేగ పోస్ట్..!
మే 26, 2026

Peddi Movie | వివాదంలో పెద్ది సాంగ్.. డాన్స్ మూమెంట్స్‌పై సోషల్ మీడియాలో విమర్శలు..!
మే 26, 2026

IPL 2026 | నేటి నుంచి ఐపీఎల్ ప్లేఆఫ్ షురూ.. ఆర్సీబీ Vs గుజరాత్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్..!
మే 26, 2026
తాజావార్తలు
- ●Stock Markets | యుద్ధ భయంతో మార్కెట్లు డల్.. క్రూడ్ మళ్ళీ పెరిగింది..
- ●Dera Baba | డేరా బాబాకు మరోసారి పెరోల్.. తొమ్మిదేళ్లలో 16వసారి
- ●Harmanpreet Kaur | భారత జెర్సీ ధరించడం నా జీవితంలో గొప్ప గౌరవం.. పద్మశ్రీ అందుకోవడంపై హర్మన్‌ప్రీత్ భావోద్వేగ పోస్ట్..!
- ●Peddi Movie | వివాదంలో పెద్ది సాంగ్.. డాన్స్ మూమెంట్స్‌పై సోషల్ మీడియాలో విమర్శలు..!
- ●IPL 2026 | నేటి నుంచి ఐపీఎల్ ప్లేఆఫ్ షురూ.. ఆర్సీబీ Vs గుజరాత్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్..!
- ●CNG Prices | మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు.. 11 రోజుల్లో మూడోసారి పెంపు..!

Stock Markets | యుద్ధ భయంతో మార్కెట్లు డల్.. క్రూడ్ మళ్ళీ పెరిగింది..

Dera Baba | డేరా బాబాకు మరోసారి పెరోల్.. తొమ్మిదేళ్లలో 16వసారి

Harmanpreet Kaur | భారత జెర్సీ ధరించడం నా జీవితంలో గొప్ప గౌరవం.. పద్మశ్రీ అందుకోవడంపై హర్మన్‌ప్రీత్ భావోద్వేగ పోస్ట్..!

Peddi Movie | వివాదంలో పెద్ది సాంగ్.. డాన్స్ మూమెంట్స్‌పై సోషల్ మీడియాలో విమర్శలు..!



