త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nitin Nabin | కాంగ్రెస్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది

Nitin Nabin | ప్రజాస్వామ్యం పేరుతో దేశంలో అశాంతి సృష్టించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ విమర్శించారు. 1984 సిక్కుల ఊచకోతకు క్షమాపణ చెప్పాల్సిన కాంగ్రెస్‌.. ఇప్పుడు నిరసనలకు దిగడం ఏమిటని ప్రశ్నించారు. సిక్కులపై జరిగిన మారణకాండకు రాహుల్‌ గాంధీ పశ్చాత్తాపం వ్యక్తం చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

P

National | Published On Nov 1, 2026, 4.49 pm IST

Nitin Nabin | కాంగ్రెస్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది
Advertisement
  • సిక్కుల ఊచకోతపై క్షమాపణ చెప్పాల్సింది పోయి నిరసనలా?
  • రాహుల్‌పై బీజేపీ చీఫ్‌ నితిన్‌ నబీన్‌ ఫైర్‌

Nitin Nabin | ప్రజాస్వామ్యం పేరుతో దేశంలో అశాంతి సృష్టించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ విమర్శించారు. 1984 సిక్కుల ఊచకోతకు క్షమాపణ చెప్పాల్సిన కాంగ్రెస్‌.. ఇప్పుడు నిరసనలకు దిగడం ఏమిటని ప్రశ్నించారు. సిక్కులపై జరిగిన మారణకాండకు రాహుల్‌ గాంధీ పశ్చాత్తాపం వ్యక్తం చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి ర్యాలీకి వ్యతిరేకంగా ఆదివారం హర్యానాలోని రోహ్‌తక్‌లో బీజేపీ నిర్వహించిన ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. వేలాది మంది సిక్కులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై కాంగ్రెస్‌ క్షమాపణ చెప్పాల్సిందిపోయి ఇప్పుడు ప్రజాస్వామ్యం పేరుతో రోడ్లపైకి రావడం విడ్డూరమన్నారు.

అధికారం క‌ట్ట‌బెట్ట‌క‌పోవ‌డంతోనే..

ఎన్నికల్లో ప్రజలు అధికారం కట్టబెట్టకపోవడంతోనే కాంగ్రెస్‌ రాజ్యాంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటోందని విమర్శించారు. కాంగ్రెస్‌లో ముందుగా కుటుంబ పాలనకు చరమగీతం పాడి, అంతర్గత ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని రాహుల్‌ గాంధీకి సూచించారు. రాహుల్‌, ఆయన కుటుంబం చెప్పిందే నిజమన్నట్లుగా కాంగ్రెస్‌ నేతలు వ్యవహరిస్తున్నారని, రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకుని తిరిగే ఆ పార్టీనే రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తోందని ఆరోపించారు. ఎన్నికల సంఘంపై విమర్శలు చేసే కాంగ్రెస్‌ తన చరిత్రను గుర్తుచేసుకోవాలని అన్నారు. ఇందిరాగాంధీ ఎన్నికలో ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారంటూ అలహాబాద్‌ హైకోర్టు ఆమె ఎన్నికను రద్దు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.

చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మే..

ఓట్ల తొలగింపుపై చర్చకు తాము సిద్ధమని, వీధుల్లోనైనా, పార్లమెంట్‌లోనైనా సమాధానం చెబుతామని అన్నారు. చొరబాటుదారులను దేశం నుంచి పంపించేందుకు బీజేపీ, ఎన్డీయే కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేశారు. విదేశీ శక్తుల ప్రోద్బలంతో రాహుల్‌ గాంధీ దేశంలో అశాంతి, అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని నితిన్‌ నబీన్‌ ఆరోపించారు. విదేశాల్లోనూ దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజల తీర్పుతో ఏర్పడిన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలను సహించబోమని, ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, దాన్ని ఎవరూ కదిలించలేరని స్పష్టం చేశారు.

ట్యాగ్స్:

1984 Anti Sikh RiotsBjp PartyBJP ProtestCongress PartyHaryanaINDIA Alliance RallyNitin NabinRahul GandhiRohtakSikh MassacreTelugu News
Advertisement
Advertisement