Harmanpreet Kaur | భారత జెర్సీ ధరించడం నా జీవితంలో గొప్ప గౌరవం.. పద్మశ్రీ అందుకోవడంపై హర్మన్‌ప్రీత్ భావోద్వేగ పోస్ట్..!
Harmanpreet Kaur | భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం రాష్టప్రతి భవన్‌లో జరిగిన తొలి సివిల్ ఇన్వెస్టిట్యూర్ వేడుకలో ఆమెకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
Harmanpreet Kaur | భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం రాష్టప్రతి భవన్‌లో జరిగిన తొలి సివిల్ ఇన్వెస్టిట్యూర్ వేడుకలో ఆమెకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె భావోద్వేగంగా స్పందించారు. ఈసారి పద్మ అవార్డుల జాబితాలో క్రీడా రంగం నుంచి ఎంపికైన అతి కొద్దిమంది ప్రముఖుల్లో హర్మన్‌ప్రీత్ కౌర్, రోహిత్ శర్మ చోటు దక్కించుకున్నారు. భారత మహిళల క్రికెట్‌కు నాయకత్వం వహిస్తూ చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్‌కు పద్మ అవార్డు మరింత ప్రత్యేకతను తీసుకువచ్చింది. అవార్డు అందుకున్న అనంతరం హర్మన్‌ప్రీత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ పెట్టింది.
చిన్నప్పటి కలలతో క్రికెట్ ప్రారంభించి.. ఇప్పుడు దేశాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ పద్మశ్రీ అందుకోవడం తనకు గర్వకారణమని తెలిపింది. ‘ఈ గౌరవం నా ఒక్కదానిది కాదు. నా తల్లిదండ్రులు, కుటుంబం, కోచ్‌లు, సహచర ఆటగాళ్లు, స్నేహితులు అందరి త్యాగాలు, ప్రేమ వల్లే ఇది సాధ్యమైంది’ అని ఆమె పేర్కొంది. తన ప్రయాణంలో ప్రతి ఒక్కరి ప్రోత్సాహం ఎంతో ముఖ్యమని గుర్తు చేసుకుంది. భారత ప్రభుత్వం, రాష్ట్రపతి, క్రీడా సంస్థలు మహిళల క్రికెట్‌కు అందిస్తున్న మద్దతుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. బీసీసీఐతో పాటు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, మీడియా, అభిమానులు అందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఇక 2025లో భారత్ మహిళల జట్టు సాధించిన చారిత్రక విజయాన్ని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. తన నాయకత్వంలో భారత జట్టు దక్షిణాఫ్రికాను ఓడించి తొలి మహిళల వన్డే వరల్డ్ కప్ టైటిల్ గెలవడం తన కెరీర్‌లో మరిచిపోలేని ఘట్టమని పేర్కొన్నారు. ‘భారత్ జెర్సీ ధరించడం నా జీవితంలో గొప్ప గౌరవం. దేశం కోసం ఎప్పుడూ నా వంతు కృషి చేస్తూనే ఉంటాను’ అంటూ హర్మన్‌ప్రీత్ తెలిపింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
ఆగస్టు 4, 2026

Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం
ఆగస్టు 4, 2026

Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం
ఆగస్టు 4, 2026
తాజావార్తలు
- ●Weight Loss Journey | జిమ్ వద్దు, ఖర్చు వద్దు.. ఇంట్లోనే 8 నెలల్లో 20 కిలోలు తగ్గిన ముగ్గురు పిల్లల తల్లి
- ●Waking up at 3 am | రోజూ ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? మీ బాడీ ఇస్తున్న వార్నింగ్ ఇదే!
- ●Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు
- ●CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
- ●Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం
- ●Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం

Weight Loss Journey | జిమ్ వద్దు, ఖర్చు వద్దు.. ఇంట్లోనే 8 నెలల్లో 20 కిలోలు తగ్గిన ముగ్గురు పిల్లల తల్లి

Waking up at 3 am | రోజూ ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? మీ బాడీ ఇస్తున్న వార్నింగ్ ఇదే!

Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు

CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు



