త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chief Minister | సొంత రాష్ట్రాన్ని ప‌ట్టించుకోని ముఖ్య‌మంత్రి.. హ‌ర్యానా సీఎంపై విమ‌ర్శ‌లు

Chief Minister | అనేక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న సొంత రాష్ట్రాన్ని పట్టించుకోకుండా పొరుగు రాష్ట్రంలో త‌ర‌చుగా ప‌ర్య‌టిస్తున్నారంటూ హ‌ర్యానా (Haryana) ముఖ్య‌మంత్రి నాయ‌బ్ సింగ్ సైనీపై (Nayab Singh Saini) విప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి.

G

National | Published On Nov 21, 2026, 7.40 am IST

Chief Minister | సొంత రాష్ట్రాన్ని ప‌ట్టించుకోని ముఖ్య‌మంత్రి.. హ‌ర్యానా సీఎంపై విమ‌ర్శ‌లు
Advertisement

Chief Minister | త్రినేత్ర న్యూస్‌: అనేక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న సొంత రాష్ట్రాన్ని పట్టించుకోకుండా పొరుగు రాష్ట్రంలో త‌ర‌చుగా ప‌ర్య‌టిస్తున్నారంటూ హ‌ర్యానా (Haryana) ముఖ్య‌మంత్రి నాయ‌బ్ సింగ్ సైనీపై (Nayab Singh Saini) విప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. పంజాబ్‌లో (Punjab) వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. దీంతో హ‌ర్యానా సీఎం (Chief Minister) అక్క‌డి ఎన్నిక‌లపై దృష్టిసారించారు. అక్క‌డ ఎలాగైనా ఈ అధికారం చేజిక్కించుకోవ‌డానికి విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. హ‌ర్యానా మోడ‌ల్‌ను ప్ర‌జ‌ల ముందుంచుతున్నారు. ఈ నేప‌థ్యంలో పొరుగు రాష్ట్రంలో సైనీ సాగిస్తున్న రాజకీయ కార్యకలాపాలపై హర్యానా మాజీ ఉప ముఖ్యమంత్రి, జ‌న‌నాయ‌క్ జ‌న‌తా పార్టీ (JJP) నేత‌ దుష్యంత్ చౌతాలా (Dushyant Singh Chautala) విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్నారు.

సీఎం సైనీ తన సొంత రాష్ట్ర సమస్యలపై దృష్టి పెట్టలేకపోతున్నార‌ని, ఇప్పటివరకు అధికారం దక్కించుకోలేకపోయిన పంజాబ్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కలలు కంటున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సొంత రాష్ట్రంలో అనేక ముఖ్యమైన సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్నప్పుడు, పొరుగు రాష్ట్రంపై ఎందుకు అంత సమయం వెచ్చిస్తున్నారని ప్రశ్నించారు. యువత‌ నిరుద్యోగంతో సతమతమవుతున్నారు, రైతులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఈ సమస్యలపై దృష్టి సారించడానికి బదులుగా, పంజాబ్‌లో బీజేపీ రాజకీయ ఆకాంక్షలను నెరవేర్చడంలో సైనీ నిమగ్నమయ్యారని ధ్వ‌జ‌మెత్తారు.

2027 అసెంబ్లీ ఎన్నికల (assembly elections) నేప‌థ్యంలో పంజాబ్‌లో సైనీ విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. స‌భ‌లు, స‌మావేశాల్లో పాల్గొంటూనే, స్థానిక నాయకులతో వ‌రుస‌గా భేటీ అవుతున్నారు. భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ (AAP) ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా హర్యానా పరిపాలనా నమూనాను ప్రజల ముందు ఉంచుతున్నారు.

Advertisement
Advertisement