Ram Lalla | వేసవితాపం నుంచి సంరక్షణ.. అయోధ్య బాలరాముడికి నైవేద్యంగా లస్సీ, జ్యూస్.. దీపాలకు బదులు పువ్వులతో హారతి
Ram Lalla | దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 గంటలకే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఈ ఎండ తీవ్రత అయోధ్య నగరిలో కొలువైఉన్న బాలరాముడిపై కూడా తీవ్రంగా ప్రభావం చూపుతోంది.
Ram Lalla | దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 గంటలకే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కపోతకు అల్లాడిపోతున్నారు. ఈ ఎండ తీవ్రత అయోధ్య నగరిలో కొలువైఉన్న బాలరాముడిపై కూడా తీవ్రంగా ప్రభావం చూపుతోంది. రామనగరి అయోధ్యలో ప్రస్తుతం 36 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వేసవితాపం దృష్ట్యా ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వేసవితాపం నుంచి రామ్‌లల్లాను (Ram Lalla) రక్షించేందుకు సేవా విధానంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. రాగ-భోగాల్లో (పూజ-నైవేద్యాలు) మార్పులు చేశారు. వేసవి కాలంలో స్వామివారికి చలవనిచ్చే ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించడంతోపాటూ పూజా విధానంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
నైవేద్యంగా చలవనిచ్చే ఆహార పదార్థాలు
బాల రాముడిగా కొలువైన రామ్‌లల్లాను ఆలయ అధికారులు రాజకుమారుడిగా ట్రీట్ చేస్తారు. ఇందులో భాగంగానే వేసవి దృష్ట్యా బాలరాముడికి సమర్పించే భోగాల్లో కీలక మార్పులు చేశారు. ఇప్పటి వరకూ బాలరాముడికి ఖీర్, పూరీ, రబ్డీ, పెడా వంటి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించారు. అయితే.. వేసవి దృష్ట్యా ఇప్పుడు వాటి స్థానంలో చలవనిచ్చే పదార్థాలను నైవేద్యంగా సమర్పించనున్నట్లు ఆలయ పరిపాలన విభాగం తెలిపింది. పెరుగు, సీజనల్ పండ్లు, జ్యూస్, లస్సీ వంటి చల్లదనం ఇచ్చే పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తున్నారు.
ఇకపై చల్లటి నీటితో అభిషేకం..
అంతేకాదు, ఇప్పటి వరకూ స్వామివారికి గోరువెచ్చని నీటితో స్నానం చేయించేవారు. ఇకపై చల్లటి నీటితో అభిషేకం నిర్వహించనున్నారు. అంతేకాదు, స్వామివారికి వేడి నుంచి ఉపశమనం కల్పించేందుకు కేవలం నూలు దుస్తులను మాత్రమే ధరింపజేయనున్నారు.
పూజా విధానంలోనూ మార్పులు..
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. పూజా విధానంలోనూ ఆలయ అధికారులు కీలక మార్పులు చేశారు. దీపాల నుంచి వచ్చే వేడి నుంచి ఉపశమనం కల్పించేలా.. పౌర్ణమి నుండి సాంప్రదాయ దీపాలకు బదులుగా కేవలం పువ్వులతో హారతి ఇస్తున్నారు. గర్భాలయంలో స్వామివారికి చల్లగా ఉండేందుకు కూలర్లను కూడా ఏర్పాటు చేశారు.
అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠానంతరం, రామ్‌లల్లాకు సాంప్రదాయబద్ధంగా జీవంతమైన సేవా విధానం (నిత్య పూజలు, భోగాలు, హారతులు) కొనసాగుతోంది. ఈ ప్రత్యేక సేవలను నిర్వహించడానికి శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ 24 మంది పూజారులను నియమించింది.
Also Read..
UIDAI ఇంటర్న్‌షిప్ 2026కు దరఖాస్తుల ఆహ్వానం.. బెంగళూరులో ఖాళీలు..
పీఎల్‌జీఏ డిప్యూటీ కమాండర్ సోది కేశాలు సహా.. పెద్ద సంఖ్యలో మావోయిస్టుల లొంగుబాటు!
చరిత్ర సృష్టించబోతున్న నాసా.. నేడు చంద్రుడి ఆవలి వైపుగా వ్యోమగాముల ప్రయాణం..!
సంబంధిత వార్తలు

Ram Mandir Construction | జులై 30 నాటికి రామ మందిరం నిర్మాణ పనులు పూర్తి : నృపేంద్ర మిశ్రా
జులై 11, 2026

DK Shivakumar | రాముడి పేరుతో బీజేపీ దోపిడీకి పాల్పడింది : డీకే శివకుమార్
జులై 2, 2026

Miyazaki mango | అయోధ్య బాలరాముడికి నైవేద్యంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.. ఒక్కో పండు ధర రూ.లక్ష..!
జూన్ 16, 2026
తాజావార్తలు
- ●KTR | దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లు.. నువ్ మళ్లీ గెలవడం కలే
- ●Malla Reddy | బీజేపీలోకి మల్లారెడ్డి..? ముహూర్తం ఫిక్స్
- ●Keerthy Suresh | క్రికెట్ లీగ్ వేలంలో కీర్తి సురేష్ - కోట్లు కుమ్మరించి ఆటగాళ్లను కొన్న మహానటి - అసలు కథ ఏంటంటే?
- ●Semiconductor Hub Hyderabad | దేశంలోని ఇతర మెట్రో నగరాలను కాదని హైదరాబాద్‌లో సరికొత్త సెమీకండక్టర్ హబ్
- ●OpenAI | చాట్‌జీపీటీ వాయిస్‌లో భారీ అప్డేట్.. ఇక మనిషిలా మాట్లాడే కొత్త మోడళ్లు..
- ●Clash between beef vendors | జోగిపేటలో బీఫ్ దుకాణాదారుల లొల్లి.. కత్తులతో పరస్పర దాడులు

KTR | దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లు.. నువ్ మళ్లీ గెలవడం కలే

Malla Reddy | బీజేపీలోకి మల్లారెడ్డి..? ముహూర్తం ఫిక్స్

Keerthy Suresh | క్రికెట్ లీగ్ వేలంలో కీర్తి సురేష్ - కోట్లు కుమ్మరించి ఆటగాళ్లను కొన్న మహానటి - అసలు కథ ఏంటంటే?

Semiconductor Hub Hyderabad | దేశంలోని ఇతర మెట్రో నగరాలను కాదని హైదరాబాద్‌లో సరికొత్త సెమీకండక్టర్ హబ్



