Jagga Reddy | సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. వేరే దగ్గర చేయనని చెప్పలే
Jagga Reddy | తాను సంగారెడ్డిలో పోటీ చేయనని చెప్పానని.. కానీ వేరే చోట పోటీ చేయనని చెప్పలేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేటలో హరీష్‌రావుపై పోటీ చేయడానికీ వెనుకాడనని స్పష్టం చేశారు.
- ఇక్కడ లేడీ ఉన్నా, జనరల్ ఉన్నా నిర్మలనే క్యాండేట్
- సిట్టింగ్ ఎమ్మెల్యే తోపు కాదు సీఎం, పీసీసీ చీఫ్, ఇంచార్జీలే తోపులు
- హరీశ్‌రావుపై పోటీ చేయడానికి రెడీ
- మీడియా చిట్ చాట్‌లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యలు
Jagga Reddy | త్రినేత్ర.న్యూస్: తాను సంగారెడ్డిలో పోటీ చేయనని చెప్పానని.. కానీ వేరే చోట పోటీ చేయనని చెప్పలేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయిస్తే అక్కడి నుంచే బరిలో దిగుతానని చెప్పారు. సిద్దిపేటలో హరీష్‌రావుపై పోటీ చేయడానికీ వెనుకాడనని స్పష్టం చేశారు. శనివారం మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంగారెడ్డి నియోజకవర్గంలో లేడీ ఉన్నా, జనరల్ ఉన్నా తన భార్య నిర్మలనే క్యాండేట్ అని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి ఆట మొదలు పెట్టాడు. 117 సీట్లు గెలిపించుకునే ప్లాన్ రేవంత్ రెడీ చేశాడు. రేవంత్ వ్యూహాలు, నిర్ణయాలకు మా మద్దతు ఉంటుంది. రేవంత్ ఆలోచనలతో మాకు ఏకాభిప్రాయం ఉంటుంది. సీట్లు ఎవరికి ఇవ్వాలనే అంశం సీఎం, పీసీసీ చీఫ్, ఇంచార్జీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఇంతకు ముందు ఎన్నికల గురించి ఆలోచించడం సరైన ఆలోచనే. రెండోసారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు నిర్ణయాలు తీసుకునే హక్కు రేవంత్‌కు ఉంది అని ఆయన చెప్పారు.
సర్వేలను చూసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు..
ఎవరి సర్వేలు వారికి అనుకూలంగా చేస్తారు. సర్వేలను చూసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేల పనితీరును దృష్టిలో పెట్టుకునే సీఎం పలువురికి సూచనలు ఇస్తున్నారు. సీఎం సూచనలతో ఎమ్మెల్యేలు అలర్ట్ అవుతున్నారు. సీఎం చెప్పడంతో పలువురు ఎమ్మెల్యేలు తమ పనితీరును మార్చుకుంటున్నారు. సీఎం చెప్పిన తర్వాత కూడా తీరు మారకపోతే సీటు ఇవ్వాలో లేదో సీఎం, పీసీసీ చీఫ్, ఇంచార్జీ నిర్ణయం తీసుకుంటారు అని జగ్గారెడ్డి తెలిపారు.
రాజకీయ నీతి అదే..
అపోజిషన్ ఎప్పుడూ రూలింగ్ పార్టీని ఎటాక్ చేస్తుంది. రాజకీయ నీతి కూడా అదే. కేసీఆర్ మొదటిసారి సీఎం అయినప్పుడు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని సర్వేలు చెప్పాయి. యాక్టివ్ లేని వాళ్లని సీఎం రేవంత్ అలర్ట్ చేస్తున్నారు. అయినా తీరు మారకపోతే వేటు తప్పదు. మేం తోపులు అంటే నడవదు. పెద్ద పెద్ద తోపులను కూడా పక్కన పెట్టిన సందర్భాలు ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే తోపు కాదు.. సీఎం, పీసీసీ చీఫ్, ఇంచార్జీ మాత్రమే తోపులు. రాజకీయాల్లో పర్మినెంట్‌గా ఎవరూ తోపులు ఉండరు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎంత పెద్దపులి అయినా వేటగాడి వ్యూహంలో పడాల్సిందే. ఓట్ల రాజకీయం కూడా అంతే. అందుకే నేను కూడా రెండు సార్లు ఓడిపోయా. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా సర్వేల ఆధారంగానే జరుగుతుంది. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) తర్వాత అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో బలం లేని బీజేపీ సర్వే చేయించినా ఆ పార్టీకే అనుకూలంగా సర్వేలు వస్తాయి అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.
సంబంధిత వార్తలు

Clash between beef vendors | జోగిపేటలో బీఫ్ దుకాణాదారుల లొల్లి.. కత్తులతో పరస్పర దాడులు
జులై 11, 2026

King Cobra | మధురానగర్ పోలీసు స్టేషన్లో నాగుపాము పిల్లలు.. షాకైన ఖాకీలు
జులై 11, 2026

Sabitha Indra Reddy | చేవెళ్లలో ఉద్రిక్తత.. సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ అరెస్ట్
జులై 11, 2026
తాజావార్తలు
- ●Keerthy Suresh | క్రికెట్ లీగ్ వేలంలో కీర్తి సురేష్ - కోట్లు కుమ్మరించి ఆటగాళ్లను కొన్న మహానటి - అసలు కథ ఏంటంటే?
- ●Semiconductor Hub Hyderabad | దేశంలోని ఇతర మెట్రో నగరాలను కాదని హైదరాబాద్‌లో సరికొత్త సెమీకండక్టర్ హబ్
- ●OpenAI | చాట్‌జీపీటీ వాయిస్‌లో భారీ అప్డేట్.. ఇక మనిషిలా మాట్లాడే కొత్త మోడళ్లు..
- ●Clash between beef vendors | జోగిపేటలో బీఫ్ దుకాణాదారుల లొల్లి.. కత్తులతో పరస్పర దాడులు
- ●TCS | టీసీఎస్ షేర్హోల్డర్లకు గుడ్ న్యూస్.. రూ.12 డివిడెండ్ ప్రకటించిన కంపెనీ..
- ●Bhagyashri Borse | లెనిన్ సక్సెస్ మీట్లో కన్నీళ్లు పెట్టుకున్న భాగ్యశ్రీ బోర్సే - హైదరాబాద్ నా కర్మభూమి అంటూ కామెంట్స్

Keerthy Suresh | క్రికెట్ లీగ్ వేలంలో కీర్తి సురేష్ - కోట్లు కుమ్మరించి ఆటగాళ్లను కొన్న మహానటి - అసలు కథ ఏంటంటే?

Semiconductor Hub Hyderabad | దేశంలోని ఇతర మెట్రో నగరాలను కాదని హైదరాబాద్‌లో సరికొత్త సెమీకండక్టర్ హబ్

OpenAI | చాట్‌జీపీటీ వాయిస్‌లో భారీ అప్డేట్.. ఇక మనిషిలా మాట్లాడే కొత్త మోడళ్లు..

Clash between beef vendors | జోగిపేటలో బీఫ్ దుకాణాదారుల లొల్లి.. కత్తులతో పరస్పర దాడులు



