త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

King Cobra | మ‌ధురాన‌గ‌ర్ పోలీసు స్టేష‌న్‌లో నాగుపాము పిల్ల‌లు.. షాకైన ఖాకీలు

King Cobra | హైద‌రాబాద్ మ‌ధురాన‌గ‌ర్ పోలీసు స్టేష‌న్‌( Madhuranagar Police Station )లో అత్యంత విష‌పూరిత‌మైన నాగుపాము పిల్ల‌లు( King Cobra ) క‌ల‌క‌లం సృష్టించాయి.

S

Hyderabad | Published On Jul 11, 2026, 1.54 pm IST

King Cobra | మ‌ధురాన‌గ‌ర్ పోలీసు స్టేష‌న్‌లో నాగుపాము పిల్ల‌లు.. షాకైన ఖాకీలు
Advertisement

King Cobra | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ మ‌ధురాన‌గ‌ర్ పోలీసు స్టేష‌న్‌( Madhuranagar Police Station )లో అత్యంత విష‌పూరిత‌మైన నాగుపాము పిల్ల‌లు( King Cobra ) క‌ల‌క‌లం సృష్టించాయి. మ‌ధురాన‌గ‌ర్ పీఎస్ ఆవ‌ర‌ణ‌లో ఒకేసారి మూడు నాగుపాము పిల్ల‌లు ప్ర‌త్య‌క్షం కావ‌డంతో.. పోలీసులు( Police ), ఇత‌ర సిబ్బంది తీవ్ర ఆందోళ‌న‌కు గురై ప‌రుగులు తీశారు. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ స‌భ్యుల‌కు స‌మాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సొసైటీ సభ్యులు మూడు నాగుపాము పిల్లలను సురక్షితంగా పట్టుకున్నారు. అనంత‌రం వాటిని అట‌వీశాఖ అధికారుల‌కు అప్ప‌గించారు.

Advertisement
Advertisement