త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sabitha Indra Reddy | చేవెళ్ల‌లో ఉద్రిక్త‌త‌.. స‌బితా ఇంద్రారెడ్డి, స‌త్య‌వ‌తి రాథోడ్ అరెస్ట్

Sabitha Indra Reddy | రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో పోక్సో కేసు నిందితుడు ఆరుగురిని అత్యంత దారుణంగా హ‌త్య చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో బాధిత కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, స‌త్య‌వ‌తి రాథోడ్‌, మాజీ ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డిని చేవెళ్ల - మ‌ల్కాపూర్ గేటు వ‌ద్ద పోలీసులు అడ్డుకున్నారు.

S

Telangana | Published On Jul 11, 2026, 1.38 pm IST

Sabitha Indra Reddy | చేవెళ్ల‌లో ఉద్రిక్త‌త‌.. స‌బితా ఇంద్రారెడ్డి, స‌త్య‌వ‌తి రాథోడ్ అరెస్ట్
Advertisement

Sabitha Indra Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో పోక్సో కేసు నిందితుడు ఆరుగురిని అత్యంత దారుణంగా హ‌త్య చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో బాధిత కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, స‌త్య‌వ‌తి రాథోడ్‌, మాజీ ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డిని చేవెళ్ల - మ‌ల్కాపూర్ గేటు వ‌ద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. వారిని షాబాద్ వైపు వెళ్ల‌నివ్వ‌కుండా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. త‌ద‌నంత‌రం మాజీ మంత్రుల‌ను వేరే ప్రాంతానికి త‌ర‌లించారు.

ఆరుగురి దారుణ హ‌త్య నేప‌థ్యంలో షాబాద్‌లో పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. శాంతి భ‌ద్ర‌త‌ల‌ను పోలీసు ఉన్న‌తాధికారులు ప‌ర్య‌వేక్షించారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

రెండు గంటల్లో ఆరుగురి ప్రాణాలు తీసిన కిరాతకుడు

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో రాజ్‌కుమార్ అనే వ్యక్తి రాత్రి 11 నుంచి ఒంటి గంట మధ్య దారుణ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు మొదట బాలిక ఇంటికి వెళ్లి ఆమె తల్లి, అమ్మమ్మలను హతమార్చాడు. అనంతరం బాలికను 3 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి చంపేశాడు. ఆ తర్వాత సొంతింటికి వచ్చి భార్య సరిత, ఇద్దరు చిన్నారులను కడతేర్చాడు.

రాజ్‌కుమార్‌ ఘాతుకాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. దైవాలగూడలో రాత్రి 11 గంటలకు బాలికను అతడు బలవంతంగా కారులో లాక్కెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి. బాలిక తల్లి, అమ్మమ్మలను చంపాక, ఆమెను చెరువు వద్దకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి గొంతు కోశాడు.

Advertisement
Advertisement