త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Latha Rajinikanth | ప్ర‌జా ఉద్య‌మాన్ని ప్రారంభించిన ల‌తా ర‌జినీకాంత్‌.. త్వ‌ర‌లో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి..?

Latha Rajinikanth | స్టార్ న‌టుడు ర‌జినీకాంత్ (Rajinikanth) భార్య ల‌తా ర‌జినీకాంత్ (Latha Rajinikanth) ప్ర‌జా ఉద్య‌మాన్ని ప్రారంభించారు. మ‌క్క‌ల్ మేడై (Makkal Medai) పేరుతో సామాజిక సంస్థ‌ను ప్ర‌క‌టించారు.

D

National | Published On Jun 6, 2026, 12.39 pm IST

Latha Rajinikanth | ప్ర‌జా ఉద్య‌మాన్ని ప్రారంభించిన ల‌తా ర‌జినీకాంత్‌.. త్వ‌ర‌లో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి..?
Advertisement

Latha Rajinikanth | త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో మ‌రో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ స్టార్ న‌టుడు ర‌జినీకాంత్ (Rajinikanth) భార్య ల‌తా ర‌జినీకాంత్ (Latha Rajinikanth) ప్ర‌జా ఉద్య‌మాన్ని ప్రారంభించారు. మ‌క్క‌ల్ మేడై (Makkal Medai) పేరుతో సామాజిక సంస్థ‌ను ప్ర‌క‌టించారు. త‌మిళనాడు రాష్ట్ర ప్రగతి కోసం, ప్రజా సంక్షేమం కోసం నిస్వార్థంగా పనిచేయాలనుకునే వారు ఎవరైనా ఇందులో భాగస్వాములు కావచ్చునని లతా రజినీకాంత్ పిలుపునిచ్చారు. ఈ ఉద్యమంలో చేరాల‌నుకునేవారు 7550080515 నంబ‌ర్ లేదా makkalmedaitain12@gmail.com ఇమెయిల్ ద్వారా సంప్ర‌దించాల‌ని సూచించారు.

అయితే, ల‌తా ర‌జినీకాంత్ ఈ సంస్థ ద్వారా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టే అవ‌కాశం ఉందంటూ ప్ర‌చారం జోరందుకుంది. సామాజిక సేవా సంస్థలు ప్రారంభించి.. వాటినే రాజకీయ పార్టీలుగా మార్చడం తమిళనాట కొత్తేమీ కాదు. జాతీయవాద భావజాలంతో తొలుత ఒక ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించి.. దాన్ని భ‌విష్య‌త్తులో రాజ‌కీయ పార్టీగా మార్చ‌డం సర్వ‌సాధార‌ణం. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి విజ‌య్ కూడా గ‌తంలో అభిమాన సంఘం ప్రారంభించి.. దాన్ని టీవీకే పార్టీగా అనుసంధానం చేశారు. అభిమాన సంఘం ద్వారా కొన్ని సంవ‌త్స‌రాలు విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు. ఆ త‌ర్వాత టీవీకే పార్టీని స్థాపించి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచి భారీ విజ‌యం సాధించారు. తొలి ఎన్నిక‌ల్లోనే తిరుగులేని విజ‌యంతో సీఎం ప‌ద‌విని చేప‌ట్టారు. ఇప్పుడు ల‌తా ర‌జినీకాంత్ కూడా ఈ ప్ర‌జా ఉద్య‌మం ద్వారా రాజ‌కీయాల్లోకి వ‌చ్చే అవ‌కాశం ఉందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక బీజేపీకి రాజీనామా చేసిన ఆ మాజీ అధ్య‌క్షుడు అన్నామ‌లై (Annamalai) సైతం కొత్త రాజ‌కీయ ఉద్య‌మానికి తెర‌లేపిన విష‌యం తెలిసిందే. కొత్త రాజ‌కీయ ఉద్య‌మాన్ని ప్రారంభించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన వెంటనే త‌మిళ స్టార్‌ ర‌జినీకాంత్ త‌న‌తో చేతులు క‌ల‌పాల‌ని కోరార‌ని అన్నామ‌లై తెలిపిన విష‌యం తెలిసిందే.

Also Read..

మేము గొర్రెలం కాదు.. బానిస బ్రతుకు బ్రతకడానికి.. నాగ‌బాబు ట్వీట్‌కు ప్ర‌కాశ్‌రాజ్ కౌంట‌ర్‌

రెండో అంత‌స్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ ప‌డిన లిఫ్ట్‌.. ఎమ్మెల్యే క‌వ్వంప‌ల్లికి త‌ప్పిన ముప్పు

కాక్రోచ్ పార్టీ నిరసనకు ఢిల్లీ పోలీసుల అనుమతి.. బుక్‌, జాతీయ జెండాతో రావాల‌ని అభిజీత్ పిలుపు

Advertisement
Advertisement