త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavvampalli Satyanarayana | రెండో అంత‌స్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ ప‌డిన లిఫ్ట్‌.. ఎమ్మెల్యే క‌వ్వంప‌ల్లికి త‌ప్పిన ముప్పు

Kavvampalli Satyanarayana | మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు (Kavvampalli Satyanarayana) పెను ప్రమాదం తప్పింది. రెండో అంత‌స్తు నుంచి లిఫ్టు ఒక్క‌సారిగా కింద ప‌డిపోయింది.

G

Telangana | Published On Jun 6, 2026, 12.30 pm IST

Kavvampalli Satyanarayana | రెండో అంత‌స్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ ప‌డిన లిఫ్ట్‌.. ఎమ్మెల్యే క‌వ్వంప‌ల్లికి త‌ప్పిన ముప్పు
Advertisement

Kavvampalli Satyanarayana | త్రినేత్ర‌.న్యూస్‌: మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు (Kavvampalli Satyanarayana) పెను ప్రమాదం తప్పింది. రెండో అంత‌స్తు నుంచి లిఫ్టు ఒక్క‌సారిగా కింద ప‌డిపోయింది. అయితే అందులో ఉన్న ఎమ్మెల్యే క‌వ్వంప‌ల్లి క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు. అనుకోకుండా జ‌రిగిన ఘ‌ట‌న‌తో అంతా భయాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు.

మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే క‌వ్వంప‌ల్లి స‌త్య‌నారాయ‌ణ‌ కరీంనగర్‌కు వెళ్లారు. కెమిస్ట్ భవనం లిప్టులో ప్ర‌యాణిస్తుండ‌గా.. సాంకేతిక కారణాలతో అతి ఒక్క‌సారిగా రెండో అంత‌స్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కు పడిపోయింది. ప్రమాద సమయంలో లిఫ్టులో ఎమ్మెల్యే కవ్వంపల్లితో పాటు మరో ఆరుగురు ఉన్నారు. ఏం జరుగుతుందో అర్థం కాక వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సిబ్బంది వెంటనే స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడటంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

 

Advertisement
Advertisement