త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | కొడంగ‌ల్‌లో రేవంత్ రెడ్డిని మ‌ళ్లీ ఓడ‌గొడుతాం.. తేల్చిచెప్పిన హ‌రీశ్‌రావు

Harish Rao | 2028 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో సీఎం రేవంత్ రెడ్డిని మ‌ళ్లీ ఓడగొడుతామ‌ని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు తేల్చిచెప్పారు. పాల‌మూరు జిల్లాలో మ‌ళ్లీ ఎగిరేది గులాబీ జెండానే అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Jun 6, 2026, 1.54 pm IST

Harish Rao | కొడంగ‌ల్‌లో రేవంత్ రెడ్డిని మ‌ళ్లీ ఓడ‌గొడుతాం.. తేల్చిచెప్పిన హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : 2028 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో సీఎం రేవంత్ రెడ్డిని మ‌ళ్లీ ఓడగొడుతామ‌ని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు తేల్చిచెప్పారు. పాల‌మూరు జిల్లాలో మ‌ళ్లీ ఎగిరేది గులాబీ జెండానే అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. హ‌రీశ్‌రావు శ‌నివారం ఓ తెలుగు మీడియా చానెల్‌తో మాట్లాడుతూ.. నిన్న పాల‌మూరు జిల్లాలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్య‌ల‌పై నిప్పులు చెరిగారు.

రేవంత్ రెడ్డి రాసి పెట్టుకో.. నీకు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో ఓటేసే ప‌రిస్థితి లేదు. పాల‌మూరు జిల్లాలో మ‌ళ్లీ ఎగిరేది గులాబీ జెండానే. రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. ఎన్ని డైలాగ్స్ కొట్టినా నిన్ను ప్రజలు నమ్మరు.. న‌మ్మే స్థితిలో లేరు. పాలమూరులో 14కు 14 స్థానాలు గెలిచేది ఖాయం.. బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుంది.. కొడంగల్ కూడా మ‌ళ్లీ రేవంత్ రెడ్డిని ఓడగొడతాం అని హ‌రీశ్‌రావు తేల్చిచెప్పారు.

ఇవాళ మీరు దేశంలో ఒక ట్రెండ్ చూస్తున్న‌రు. ఢిల్లీలో అర‌వింద్ కేజ్రీవాల్‌ను, బెంగాల్‌లో ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీని, త‌మిళ‌నాడులో స్టాలిన్‌ను ఓడ‌గొట్టారు. రేపు తెలంగాణ‌లో రేవంత్ రెడ్డిని ఓడ‌గొడుతారు. అదే త‌ర‌హాలో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఓడగొడుతారు అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

అబ‌ద్ధాల‌కు అంగి లాగు తొడిగితే అది రేవంత్ రెడ్డినే..

బ‌జారు భాష, వీధి రౌడీలా మాట్లాడిండు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ జెండా గ‌ద్దెలు కూల్చాల‌ట‌. రాసిపెట్టుకో రేవంత్ రెడ్డి. కొడంగ‌ల్‌లో ఓడితే రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటా అని చిల్ల‌ర మాట‌లు మాట్లాడితే నేనే ద‌గ్గ‌రుండి చిత్తుచిత్తుగా ఓడగొట్టినం. నువ్వు రాజ‌కీయ స‌న్యాసం తీసుకున్న‌వా..? చిల్ల‌ర మాట‌లు మాట్లాడి తెల్లారొచ్చి మ‌ల్కాజ్‌గిరిలో పోటీ చేసిన‌వ్. అబ‌ద్ధాల‌కు అంగి లాగు తొడిగితే అది రేవంత్ రెడ్డినే. చిల్ల‌ర డైలాగులు కొట్టుడు, మాట త‌ప్పుడు మ‌డ‌మ తిప్పుడు నీకు అల‌వాటు అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

కుంభ‌క‌ర్ణుడిలా నిద్ర‌లేచి బ‌య‌ల్దేరిండు..

రేవంత్ రెడ్డివి మ‌తిలేని మాట‌లు.. రెండున్న‌రేండ్ల‌లో పాల‌మూరుకు చేసిందేమీ లేక‌, బీఆర్ఎస్ పార్టీ పాద‌యాత్ర చేస్తాం, ఎండ‌గ‌డుతాం అన‌గానే అప్పుడు కుంభ‌క‌ర్ణుడిలా నిద్ర‌లేచి బ‌య‌ల్దేరిండు. సీఎం మాట‌ల్లో ఫ్ర‌స్టేష‌న్ క‌న‌బ‌డుతుంది. ప్ర‌భుత్వ డ‌బ్బుల‌తో ప‌బ్లిక్ మీటింగ్ పెట్టి పాడిందే పాడిండు. అవే చిల్ల‌ర మాట‌లు త‌ప్ప ప్ర‌జ‌ల‌కు ప‌నికివ‌చ్చే మాట‌లు మాట్లాడ‌లేదు. మా హ‌యాంలో 10 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీళ్లు ఇచ్చాం. ఈ రెండున్న‌రేండ్ల‌లో కొత్త‌గా ఒక్క ఎక‌రాకైనా నీళ్లు ఇచ్చావా..? పాల‌మూరు ఎత్తిపోత‌ల రూ. 32 వేల కోట్ల‌తో సాంక్ష‌న్ అయింది. రూ. 27 వేల కోట్లు ఖ‌ర్చు పెట్టినం. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ 3లో ఒక చిన్న వ‌ర్క్.. కాల్వ‌లో బండ‌ను తొల‌గిస్తే నాలుగు రిజ‌ర్వాయ‌ర్లు నింపే అవ‌కాశం ఉండే. నెల రోజుల్లో పూర్త‌య్యే ప‌ని అది. అయినా చేయ‌లేదు అని సీఎంపై హ‌రీశ్ నిప్పులు చెరిగారు.

కేసీఆర్ స్థాయి కాదు నీది.. మేం స‌రిపోతం నీకు..

ఛాలెంజ్ వేస్తున్నా.. నీకు చేత‌నైతే అసెంబ్లీలో చ‌ర్చ‌పెట్టు.. కానీ పారిపోతున్న‌వ్.. కేసీఆర్ స్థాయి కాదు నీది. మేం స‌రిపోతం నీకు. నిజాలేందో ప్ర‌జ‌ల‌కు చెబుతాం. రైతుల‌కు ద్రోహం చేసింది కూడా నువ్వే. చంద్ర‌బాబుతో కుమ్మ‌క్కై న‌దీ జ‌లాల్లో చేస్తున్న ద్రోహం కూడా చెబుతాం. ఏపీ 75 శాతం వాడుకుంటే, తెలంగాణ కేవ‌లం 25 శాతం మాత్ర‌మే న‌దీజ‌లాల‌ను వాడుకుంద‌ని హ‌రీశ్‌రావు తెలిపారు.

Advertisement
Advertisement