త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi Hotel Fire | కుక్ నిర్ల‌క్ష్యం వ‌ల్లే ఢిల్లీ హోట‌ల్‌లో మంట‌లు.. వెలుగులోకి కీల‌క విష‌యాలు

Delhi Hotel Fire | ఢిల్లీలో ఓ హోట‌ల్‌లో జ‌రిగిన ఘోర అగ్నిప్ర‌మాదంపై ద‌ర్యాప్తులో కీల‌క విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. హోట‌ల్‌లో కుక్ (Hotel Cook)గా ప‌నిచేస్తున్న కేశ‌వ్ నేగి (Keshav Negi)ని నిర్ల‌క్ష్యం వ‌ల్లే మంట‌లు వేగంగా వ్యాపించాయ‌ని ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో తేలిన‌ట్లు పోలీసు వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అత‌డిని అరెస్ట్ చేసిన‌ట్లు చెప్పారు.

D

National | Published On Jun 6, 2026, 1.08 pm IST

Delhi Hotel Fire | కుక్ నిర్ల‌క్ష్యం వ‌ల్లే ఢిల్లీ హోట‌ల్‌లో మంట‌లు.. వెలుగులోకి కీల‌క విష‌యాలు
Advertisement

Delhi Hotel Fire | ఢిల్లీలోని మాల‌వీయ న‌గ‌ర్ (Malviya Nagar)లో బుధ‌వారం ఘోర అగ్నిప్ర‌మాదం సంభ‌వించిన (Delhi Hotel Fire) విష‌యం తెలిసిందే. ఈ దుర్ఘ‌ట‌న‌లో 21 మంది స‌జీవ ద‌హ‌న‌మయ్యారు. ఈ ఘ‌ట‌న‌పై అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో హోట‌ల్‌లో కుక్‌గా ప‌నిచేస్తున్న కేశ‌వ్ నేగి (Keshav Negi)ని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.

అత‌డి నిర్ల‌క్ష్యం వ‌ల్లే హోట‌ల్‌లో మంట‌లు వేగంగా వ్యాపించాయ‌ని ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో తేలిన‌ట్లు పోలీసు వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అగ్నిప్ర‌మాదం జ‌రిగిన త‌ర్వాత కేశ‌వ్ నేగి త‌న ప్రాణాల‌ను కాపాడుకునేందుకు హోట‌ల్ నుంచి పారిపోయాడు. ఈ ఘ‌ట‌న త‌ర్వాత అత‌ను ఓ మీడియాతో మాట్లాడుతూ.. తాను వంటగదిలో ఎలక్ట్రిక్ స్టవ్‌ను ఆన్ చేయగానే అది పేలిపోయి పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన‌ట్లు చెప్పాడు. ఆ త‌ర్వాత హోట‌ల్ మెయిన్ ప‌వ‌ర్ స్విచ్ఛ్ ఆఫ్ చేసి త‌న‌ను తాను కాపాడుకునేందుకు బ‌య‌ట‌కు ప‌రుగులు తీసిన‌ట్లు తెలిపాడు.

నేగి ప‌వ‌ర్ ప్లైని ఆఫ్ చేయ‌డం వ‌ల్ల హోట‌ల్‌లోని ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాలు ప‌నిచేయ‌లేద‌ని, డోర్స్ అన్నీ లాక్ అయిపోయిన‌ట్లు ద‌ర్యాప్తులో తేలింది. దీనివ‌ల్ల చాలా మంది లోప‌లే చిక్కుకుపోయార‌ని పోలీసులు తెలిపారు. హోట‌ల్ బాత్రూమ్ త‌లుపు కూడా తెరుచుకోక భార్యాభ‌ర్త‌లు లోప‌లే ఊపిరాడ‌క మ‌ర‌ణించిన‌ట్లు వివ‌రించారు. నేగి నిర్ల‌క్ష్యం వ‌ల్లే చాలా మంది మంట‌ల్లోనే చిక్కుకుని ఊపిరాడ‌క ప్రాణాలు కోల్పోయార‌ని త‌మ ద్యాప్తులో తేలిన‌ట్లు పోలీసు వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఇక ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు పూర్తి వివ‌రాలు సేక‌రిస్తున్నారు. ఇందులో భాగంగానే కుక్‌తోపాటూ మ‌రికొంత మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also Read..

ప్ర‌జా ఉద్య‌మాన్ని ప్రారంభించిన ల‌తా ర‌జినీకాంత్‌.. త్వ‌ర‌లో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి..?

మేము గొర్రెలం కాదు.. బానిస బ్రతుకు బ్రతకడానికి.. నాగ‌బాబు ట్వీట్‌కు ప్ర‌కాశ్‌రాజ్ కౌంట‌ర్‌

ఫేస్‌బుక్ క్రియేటర్లకు మెటా ఏఐ గిఫ్ట్.. కొత్త క్రియేటర్ అసిస్టెంట్ తో సక్సెస్ రహస్యాలు మీ చేతిలో..

Advertisement
Advertisement