Vande Bharat | వందేభారత్‌లో నాసిరకం భోజనం.. కస్టమర్ ఫిర్యాదుతో ఐఆర్‌సీటీసీకి రూ.10 లక్షల జరిమానా
Vande Bharat | వందే భారత్ రైల్లో నాసిరకం భోజనం అందించారంటూ ఓ ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు (Passenger Food Complaint). ఈ ఫిర్యాదును రైల్వే శాఖ చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు తన సొంత సంస్థ అయిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)కు భారీ జరిమానా విధించింది.
Vande Bharat | రైళ్లలో అందించే ఫుడ్ (Meals) క్వాలిటీపై ప్రయాణికుల నుంచి ఎప్పుడూ అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. భోజనం బాగోలేదనో, ఏవైనా పురుగులు పడటం వంటి ఫిర్యాదులు అందుతూనే ఉంటాయి. ఎన్ని ఫిర్యాదులు అందినా మార్పు మాత్రం రావడం లేదు. మళ్లీ మళ్లీ ఇలాంటి ఘటనలే తరచూ పునరావృతం అవుతూ వస్తున్నాయి. చివరికి కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లలోనూ ఇదే పరిస్థితి. తాజాగా వందే భారత్ రైల్లో నాసిరకం భోజనం అందించారంటూ ఓ ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు (Passenger Food Complaint). ఈ ఫిర్యాదును రైల్వే శాఖ చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు తన సొంత సంస్థ అయిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)కు భారీ జరిమానా విధించింది.
ఇంతకీం ఏం జరిగిందంటే..?
మార్చి 15వ తేదీన 21896 నంబర్ గల పాట్నా-టాటానగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ వ్యక్తి ప్రయాణించాడు. ఆ సమయంలో తనకు అందించిన ఆహార నాణ్యతపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఈ మేరకు రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన రైల్వే శాఖ.. ఐఆర్‌సీటీసీకి రూ. 10 లక్షల జరిమానా విధించింది. అంతేకాదు, సదరు సర్వీస్ ప్రొవైడర్‌పై రూ. 50 లక్షల జరిమానా విధిస్తూ.. వారి కాంట్రాక్టును రద్దు చేయాలని ఆదేశించింది. ప్రయాణికుల భద్రత, నాణ్యతే తమ ప్రథమ ప్రాధాన్యత అని రైల్వేశాఖ స్పష్టం చేసింది. నాణ్యత విషయంలో రాజీపడేది లేదని తెలిపింది.
మూడేళ్లలో రూ. 2.6 కోట్ల జరిమానాలు..
భారత రైల్వే ఏటా దాదాపు 58 కోట్ల భోజనాలను ప్రయాణికులకు అందిస్తోందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వీటిలో ఫిర్యాదుల శాతం కేవలం 0.0008 శాతం మాత్రమేనని పేర్కొంది. ఈ ఫిర్యాదులపై విచారణ జరిపి.. గత మూడేళ్లలో మొత్తం రూ. 2.6 కోట్ల జరిమానాలు విధించినట్లు తెలిపింది. 2025వ సంవత్సరంలో ప్యాంట్రీ కార్ సిబ్బంది రైల్వే ప్రయాణికులపై దాడి చేసిన సంఘటనలు మూడు నమోదైనట్లు పేర్కొంది. ఆ సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
Also Read..
ఎంజీ యూనివర్సిటీలో నీటి సంక్షోభం.. నెల రోజులుగా విద్యార్థుల ఇబ్బందులు
నన్ను ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఉండమన్నారు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రజాపాలనలో ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు 496 మందే : హరీశ్‌రావు
సంబంధిత వార్తలు

IRCTC | ఐఆర్సీటీసీ గుడ్‌న్యూస్.. రూ.17,600కే 7 జ్యోతిర్లింగాల దర్శనం.. సికింద్రాబాద్ నుంచి టూర్ స్టార్ట్
మే 21, 2026

Train Accidents | రైళ్లలో వరుస అగ్నిప్రమాదాల వెనుక అసాంఘిక శక్తుల ప్రమేయం : రైల్వే శాఖ
మే 20, 2026

Longest Non-Stop Train | దేశంలో ఒక్కచోట కూడా ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది?
మే 17, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



