MG University | మొహం కడుక్కోడానికీ నీళ్లు లేవ్.. ఎంజీ యూనివర్సిటీలో నెల రోజులుగా విద్యార్థుల అవస్థలు
Water problem | నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ (MG University) లో నీటి సంక్షోభం (Water problem) ఏర్పడింది. దీంతో విద్యార్థులు (Students) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నెల రోజులుగా హాస్టళ్లలో నీటి సరఫరా నిలిచిపోవడంతో అవస్థలు తప్పడం లేదు. కనీసం మొహం కడుక్కోవడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి దాపురించిందని వాపోతున్నారు.
త్రినేత్ర.న్యూస్: నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ (MG University) లో నీటి సంక్షోభం (Water problem) ఏర్పడింది. దీంతో విద్యార్థులు (Students) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నెల రోజులుగా హాస్టళ్లలో నీటి సరఫరా నిలిచిపోవడంతో అవస్థలు తప్పడం లేదు. పలుమార్లు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు (Complaint) చేసినప్పటికీ తమ సమస్యను పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టళ్లలో నీళ్లు లేకపోవడంతో నెల రోజులుగా సరిగా స్నానాలు కూడా చేయడం లేదని ఆవేదన చెందుతున్నారు. కనీసం మొహం కడుక్కోవడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి దాపురించిందని వాపోతున్నారు.
ట్యాంకర్లే గతి..
హాస్టల్ గదుల్లో నీళ్లు లేక బయటే స్నానాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని విద్యార్థులు వాపోతున్నారు. ఇక ఓపిక నశించి గురువారం తెల్లవారు జామున హాస్టల్ వద్ద ఆందోళనకు దిగారు. తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.
సమస్య తీవ్రమవడంతో స్పందించిన అధికారులు ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేయించి చేతులు దులుపుకొన్నారు.
కొత్త భవనానికి మళ్లింపు..
యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న కొత్త భవన నిర్మాణాలకు నీటిని మళ్లించడం వల్లే ఈ సమస్య తలెత్తిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తమ అవసరాలను పక్కన పెట్టి నిర్మాణ పనులకు ప్రాధాన్యం ఇవ్వడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే శాశ్వత పరిష్కారం చూపించాలని.. లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
------------------------------------------------------------------------------------------------------------------------------------
తాజావార్తలు
- ●Donald Trump | రష్యా నుంచి డీజిల్.. పుతిన్‌తో ట్రంప్ ఒప్పందం.. జెలెన్స్కీ ఆగ్రహం
- ●TGSRTC Elections | ఎన్నికల్లో ఘన విజయం.. ఆర్టీసీ గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్ యూనియన్
- ●High Speed Rail | హైస్పీడ్ రైలు.. భూసేకరణపై కిషన్ రెడ్డి క్లారిటీ
- ●Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు
- ●POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు
- ●Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!

Donald Trump | రష్యా నుంచి డీజిల్.. పుతిన్‌తో ట్రంప్ ఒప్పందం.. జెలెన్స్కీ ఆగ్రహం

TGSRTC Elections | ఎన్నికల్లో ఘన విజయం.. ఆర్టీసీ గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్ యూనియన్

High Speed Rail | హైస్పీడ్ రైలు.. భూసేకరణపై కిషన్ రెడ్డి క్లారిటీ

Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు






