త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Donald Trump | న‌న్ను ఇరాన్ సుప్రీం లీడ‌ర్‌గా ఉండ‌మ‌న్నారు.. ట్రంప్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Donald Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇరాన్ నాయ‌క‌త్వం త‌న‌ని ఆ దేశ‌పు త‌దుప‌రి సుప్రీం లీడ‌ర్‌గా (Iran Supreme Leader) ఉండాల్సిందిగా ప్ర‌తిపాదించిన‌ట్లు చెప్పారు.

D

International | Published On Mar 26, 2026, 11.49 am IST

Donald Trump | న‌న్ను ఇరాన్ సుప్రీం లీడ‌ర్‌గా ఉండ‌మ‌న్నారు.. ట్రంప్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
Advertisement

Donald Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇరాన్ నాయ‌క‌త్వం త‌న‌ని ఆ దేశ‌పు త‌దుప‌రి సుప్రీం లీడ‌ర్‌గా (Iran Supreme Leader) ఉండాల్సిందిగా ప్ర‌తిపాదించిన‌ట్లు చెప్పారు. కానీ తాను ఆ ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రించిన‌ట్లు పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీ ఏర్పాటు చేసిన‌ నిధుల సేకరణ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొని మాట్లాడారు. "ఇరాన్ నాయకత్వం న‌న్ను ఇస్లామిక్ రిపబ్లిక్ తదుపరి సుప్రీం లీడర్‌గా చేయాలనే ఆలోచనను అనధికారికంగా ప్రతిపాదించింది. కానీ నేను దానిని తిరస్కరించాను. వద్దు, ధన్యవాదాలు. నేను ఆ ప‌ద‌విని కోరుకోలేదు అని చెప్పాను" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. దాదాపు నెల రోజులుగా కొన‌సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు తాను ఇరాన్‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాన‌ని ట్రంప్ మ‌రోసారి ఉద్ఘాటించారు. అయితే, త‌మ మ‌ధ్య ఎలాంటి చ‌ర్చ‌లు జ‌ర‌గ‌డం లేద‌ని టెహ్రాన్ స్ప‌ష్టం చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.

ఒప్పందం కోసం ఇరాన్ త‌పిస్తోంది..

మ‌రోవైపు ఈ యుద్ధంలో తాము విజ‌యం సాధించామంటూ ట్రంప్ మ‌రోసారి ప్ర‌క‌టించుకున్నారు. యుద్ధం ముగింపు విష‌యంలో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు చెప్పారు. ఆ ఒప్పందం కోసం ఇరాన్ ఎంత‌గానో త‌పిస్తోంద‌న్నారు. కానీ ఆ విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్ప‌డానికి ఇరాన్ నేత‌లు భ‌య‌ప‌డుతున్నార‌ని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఎందుకంటే అలా చెబితే సొంత ప్ర‌జ‌లే త‌మ‌ను చంపేస్తార‌ని వారు భావిస్తున్నార‌ని పేర్కొన్నారు. అంతేకాదు, అమెరికా చేతిలో కూడా చ‌స్తామ‌న్న భ‌యం కూడా వారిలో ఉంది అంటూ ట్రంప్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

Also Read..

దావోస్‌లో 44 కంపెనీల‌తో ఎంవోయూలు.. 6 కంపెనీల‌కు భూ కేటాయింపులు

రామ్ చ‌ర‌ణ్ కంటికి స‌ర్జ‌రీ.. చిరంజీవి పోస్ట్ వైర‌ల్‌

హ‌ర్మూజ్‌లో భార‌త నౌక‌ల‌పై ఎలాంటి ఆంక్ష‌ల్లేవ్‌.. ఇరాన్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

Advertisement

తాజావార్తలు

Advertisement