Harish Rao | ప్రజాపాలనలో ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు 496 మందే : హరీశ్‌రావు
Harish Rao | ఈ రెండున్నరేండ్ల ప్రజాపాలనలో ఆరోగ్యశ్రీ పథకం కింద 496 మందే లబ్ధి పొందినట్లు బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తెలిపారు. ఈ పథకం కింద రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు పెంచినా కూడా ఎందుకు ఎక్కువ మంది లబ్ధి పొందలేకపోతున్నారని హరీశ్‌రావు ప్రశ్నించారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : ఈ రెండున్నరేండ్ల ప్రజాపాలనలో ఆరోగ్యశ్రీ పథకం కింద 496 మందే లబ్ధి పొందినట్లు బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తెలిపారు. ఈ పథకం కింద రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు పెంచినా కూడా ఎందుకు ఎక్కువ మంది లబ్ధి పొందలేకపోతున్నారని హరీశ్‌రావు ప్రశ్నించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆరోగ్య శ్రీపై హరీశ్‌రావు మాట్లాడారు.
ఆరోగ్య శ్రీ పథకాన్ని వైఎస్సార్ ప్రారంభించారు. మా ప్రభుత్వంలో కూడా రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచి కొనసాగించాం. బీఆర్ఎస్ హయాంలో రూ. 8 వేల కోట్లు ఖర్చు పెట్టి 18 లక్షల మందికి ఈ పథకం కింద సేవలందించాం. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతామని చెప్పారు. మంత్రి సమాధానం ద్వారా స్పష్టంగా అర్థమైంది ఏంటంటే.. రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచడం వల్ల కేవలం 496 మంది మాత్రమే లబ్ధి పొందారు.. ఈ రెండున్నరేండ్లలో అని హరీశ్‌రావు తెలిపారు.
కార్పొరేట్ ఆస్పత్రుల్లో మేజర్ సర్జరీలకు ఆరోగ్య శ్రీ కింద ట్రీట్మెంట్ చేయడం లేదు. ప్రజలు ఎందుకు అవకాశం పొందలేకపోతున్నారో రివ్యూ చేయండి. మా హయాంలో రూ. 5 లక్షల వరకు లిమిట్ ఉన్నప్పటికీ 607 మందికి రూ. 10 లక్షల వరకు లబ్ధి చేకూర్చామని హరీశ్‌రావు గుర్తు చేశారు.
గ్రీన్ చానెల్‌లో ఆరోగ్య శ్రీకి నిధులు విడుదల చేస్తున్నామని సీఎం, మంత్రులు చెప్పారు. 2023-24లో రూ. 1067 కోట్లు ఖర్చు పెడితే, 2024-25లో 971 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెరిగినప్పుడు రోగులు పెరగాలి.. ఖర్చు జరగాలి. కానీ బడ్జెట్ కేటాయింపులు జరగడం లేదు. బిల్లులు ఇవ్వడం లేదని ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలు నోటీసులు ఇచ్చారు. మీరు రివ్యూలు పెట్టిన కూడా డబ్బులు విడుదల కాలేదు. ఆస్పత్రులు మూతపడే అవకాశం ఉంది. పెండింగ్ బిల్లులు ఎంత ఉన్నాయి. ఎప్పటిలోగా చెల్లిస్తారో చెప్పాలి. బిల్లులు చెల్లిస్తే పేదలకు మేలు జరిగే అవకాశం ఉంది. గ్రీన్ చానెల్‌లో పెట్టి ఆరోగ్యశ్రీ బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించాలని కోరుతున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



