Rahul Gandhi | రాబోయే రోజుల్లో రైతులకు కనీసం ఎరువులు కూడా దొరకవు : రాహుల్ గాంధీ
Rahul Gandhi | దేశంలో ఆర్థిక తుఫాను ముంచుకొస్తోందని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి హెచ్చరించారు. దాన్ని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బనం ఎక్కడికి వెళ్తుందో ఊహించలేమన్నారు.
Rahul Gandhi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ ద్రోహి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో దేశంలో అతిపెద్ద ఆర్థిక తుఫాను (Economic Storm) రాబోతోందని మరోసారి వ్యాఖ్యానించారు. అది సామాన్య ప్రజల జీవితాలను పూర్తిగా విధ్వంసం చేస్తుందని హెచ్చరించారు.
రాయ్‌బరేలీ (Raebareli)లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. దేశంలో ఆర్థిక తుఫాను ముంచుకొస్తోందని హెచ్చరించారు. దాన్ని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బనం ఎక్కడికి వెళ్తుందో ఊహించలేమన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం ఎవరూ దేశాన్ని రక్షించలేదరని వ్యాఖ్యానించారు. "ప్రధానమంత్రి మోదీ బంగారం కొనొద్దు, విదేశాలకు వెళ్లొద్దని ప్రజలకు చెబుతారు. ఆయన మాత్రం వేల కోట్ల రూపాయల విలువైన విమానాల్లో విదేశాలకు వెళతారు. మీరు మాత్రం (ప్రజలను ఉద్దేశించి) మౌనంగా ఉండిపోతారు. మరోవైపు దేశంలో ఒక ఆర్థిక తుఫాను ముంచుకొస్తోంది. కేవలం కొన్ని నెలల్లోనే తీవ్రమైన ద్రవ్యోల్బణం ఎర్పడుతుంది. నిత్యావసర ధరలు ఎంత పెరుగుతాయో ఊహించలేం. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. రాబోయే రోజుల్లో రైతులకు కనీసం ఎరువులు కూడా దొరకవు" అంటూ రాహుల్ హెచ్చరించారు.
ఆర్థిక వ్యవస్థను అమ్మేశారు..
"ప్రధాని మోదీ భారత ఆర్థిక వ్యవస్థను (Indias economic system) అమ్మేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను అంబానీ, అదానీ, అమెరికా చేతుల్లో పెట్టారు. ఇప్పుడు ఆర్థిక తుఫాను వస్తోంది. ప్రధాని, ప్రభుత్వం మిమ్మల్ని రక్షించలేరు. అప్పుడు వారు ఏడుస్తూ... ఇందులో మా తప్పేమీ లేదు అని చెబుతారు. కానీ నేను మీకు చెబుతున్నాను.. ఈ పరిస్థితికి కారణం ప్రధాని మోదీ, అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమయ్యేందుకు వారు ముగ్గురే కారణం" అని రాహుల్ సంచలన ఆరోపణలు చేశారు.
రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి..
రాజ్యాంగాన్ని బలహీనపరిచే కుట్రలు జరుగుతున్నాయని రాహుల్ ఆరోపించారు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. "భారత రాజ్యాంగం అనేది కేవలం ఒక సాధారణ పత్రం కాదు. అదో పవిత్ర గ్రంథం. అది డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మా గాంధీ, వీర పాసిల సిద్ధాంతాలకు సజీవ రూపం. మహనీయులను స్మరించుకుంటున్నామే తప్ప వారు నమ్మిన సిద్ధాంతాలను సరిగ్గా కాపాడుకోలేకపోతున్నాం. మహనీయుల విగ్రహాల ముందు తలలు వంచడం పెద్ద ఫ్యాషన్‌గా మారింది. అదే మహనీయులు రాసిన రాజ్యాంగంపై, వారు నమ్మిన సిద్ధాంతాలపై దాడులు జరుగుతుంటే మాత్రం అందరూ మౌనంగా ఉంటున్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది" అని రాహుల్ వ్యాఖ్యానించారు.
ప్రధాని రీల్స్‌తో బిజీగా ఉన్నారు..
ఇదే సమయంలో ఓ వైపు మన తలపై ఆర్థిక తుఫాను ముంచుకొస్తుంటే.. ప్రధాని మాత్రం విదేశాల్లో రీల్స్ చేసుకుంటూ బిజీగా ఉన్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. "మన తలపై ఆర్థిక తుఫాను విరుచుకుపడుతుంటే.. మన ప్రధానమంత్రి మాత్రం ఇటలీలో చాక్లెట్లు పంచుతూ బిజీగా ఉన్నారు. రైతులు, యువత, మహిళలు, కార్మికులు, చిరు వ్యాపారులు కన్నీరు పెడుతుంటే.. ప్రధాని నవ్వుకుంటూ రీల్స్ చేసుకుంటున్నారు. ఆయనకు బీజేపీ నేతలు చప్పట్లు కొడుతున్నారు" అని రాహుల్ తన ట్వీట్‌లో వ్యంగ్యంగా రాసుకొచ్చారు. కాగా, ప్రధాని ప్రస్తుతం ఇటలీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆదేశ ప్రధాని జార్జియా మెలోనీ (Giorgia Meloni)కి మెలోడీ చాక్లెట్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోని మెలోనీ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన రాహుల్.. పైవిధంగా వ్యాఖ్యానించారు.
आर्थिक तूफ़ान सर पर है, और हमारे प्रधानमंत्री इटली में टॉफ़ी बाँट रहे हैं!
किसान, युवा, महिलाएँ, मज़दूर और छोटे व्यापारी सब रो रहे हैं - PM हंसकर रील बना रहे हैं, और BJP वाले ताली बजा रहे हैं।
यह नेतृत्व नहीं, नौटंकी है।
— Rahul Gandhi (@RahulGandhi) May 20, 2026
Also Read..
రైళ్లలో వరుస అగ్నిప్రమాదాల వెనుక అసాంఘిక శక్తుల ప్రమేయం : రైల్వే శాఖ
స్నేక్ చార్మర్‌గా ప్రధాని మోదీ.. వివాదాస్పద కార్టూన్ వేసిన నార్వే పత్రిక
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే






