CM Revanth Reddy | ఒక వేళ తప్పు జరిగితే.. తెలంగాణ రాష్ట్రానికి కాళరాత్రే : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | మిడ్జిల్ మండల జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాను అంటే ఇదంతా మీ ఆశీర్వాదమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో ఒక వేళ తప్పు జరిగితే అది శాశ్వతంగా తెలంగాణ రాష్ట్రానికి కాళరాత్రిని తెచ్చి పెడుతుందని సీఎం అన్నారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : మిడ్జిల్ మండల జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాను అంటే ఇదంతా మీ ఆశీర్వాదమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో ఒక వేళ తప్పు జరిగితే అది శాశ్వతంగా తెలంగాణ రాష్ట్రానికి కాళరాత్రిని తెచ్చి పెడుతుందని సీఎం అన్నారు. మిడ్జిల్ మండలంలో నిర్వహించిన కృతజ్ఞత సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు.
ప్రతిపక్ష నాయకులందరూ దోచుకోవడానికి సిద్ధమై కూర్చున్నారు. తెలంగాణ యువకులు నడుం బిగించాలి. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు ఆలోచన చేయండి.. కాంగ్రెస్ రావాలి.. రాహుల్ ప్రధాని కావాలి. రాహుల్ నానమ్మ, ఆయన తండ్రి దేశానికి ప్రాణాలు ఇచ్చారు. ఇప్పుడు చారిత్రాత్మక అవసరం ఉంది.. ఆ అసవరమే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం. నేను సమిధనై రాహుల్‌ను ప్రధానిని చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నాకు సహాయం అందించిన చిన్నవాడైనా పెద్దవాడైనా వెనక్కి తిరిగి సహాయం అందించే అవకాశం ప్రకృతి ఇచ్చింది. రాహుల్, సోనియాకు తెలంగాణ ప్రజలు అండగా ఉండాలి. 60 ఏండ్ల తెలంగాణ ఉద్యమంలో బలిదానాలతో అసువులు బాసిన వారిని గుర్తు చేసుకోవాలి. తెలంగాణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన సోనియాకు కృతజ్ఞత తెలపాలి. ఆ కృతజ్ఞతగా 2029 ఎన్నికల్లో నాతో నడవండి.. రాహుల్ ప్రధాని చేద్దాం.. మీరందరూ అండగా నిలబడాలి.. నిలబడుతామని మాట ఇస్తున్నారా..? రాహుల్ ప్రధాని చేసే బాధ్యతకు ఈ మిడ్జిల్ నుంచే మొదటి అడుగు పడాలి అని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.
సంబంధిత వార్తలు

Shyam Prasad Reddy | “జైలుకు పంపుతారా? ఆరోజు కేసీఆర్ కూడా మమ్మల్ని పల్లెత్తు మాట అనలేదు!”.. రేవంత్ వ్యాఖ్యలపై కన్నీరుపెట్టుకున్న రిటైర్డ్ ఇంజనీర్
జులై 12, 2026

MLC Dasoju Sravan | ముఖ్యమంత్రివా.. మృగానివా..? రేవంత్‌పై దాసోజు ఫైర్
జులై 12, 2026

MLA Jagadish Reddy | భద్రాచలం మునిగిపోతుందా..? చర్చకు సిద్ధమా ఉత్తమ్ కుమార్ రెడ్డి..? : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
జులై 12, 2026
తాజావార్తలు
- ●Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!

Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం



