Rahul Gandhi | విద్యార్థుల భద్రతకై విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలి : రాహుల్ గాంధీ
Rahul Gandhi | దేశంలోని విద్యార్థుల (students) భద్రతను నిర్ధారించడానికి విద్యా వ్యవస్థను (Education System) మొదటి నుంచి పూర్తిగా పునర్నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అభిప్రాయపడ్డారు.
Rahul Gandhi | దేశంలోని విద్యార్థుల (students) భద్రతను నిర్ధారించడానికి విద్యా వ్యవస్థను (Education System) మొదటి నుంచి పూర్తిగా పునర్నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అభిప్రాయపడ్డారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా భద్రతతో పరీక్షలు రాసేలా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలన్నారు. పేపర్ లీకేజీల కారణంగా అనేక కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురయ్యాయని చెప్పారు. ఈ మేరకు శనివారం ఎక్స్ వేదికగా రాహుల్ పోస్టు చేశారు.
డెహ్రాడూన్‌లో శుక్రవారం జరిగిన 'ఛాత్రోం కీ గూంజ్' కార్యక్రమంలో భాగంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలతో రాహుల్ మాట్లాడారు. ఆ సంభాషణకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు. నీట్ పేపర్ లీక్ వివాదం అనంతరం బలవన్మరణానికి పాల్పడిన విద్యార్థిని రియా తండ్రి రాజేశ్‌తో జరిగిన సంభాషణను రాహుల్ గుర్తు చేసుకున్నారు. తన కుమార్తెను కోల్పోయిన బాధతో రాజేశ్ తీవ్రంగా కుంగిపోయారని, ఆ వేదన ప్రతి ఒక్కరినీ కలచివేసిందని పేర్కొన్నారు. పేపర్ లీక్ ఘటన ఇలాంటి ఎన్నో కుటుంబాలకు పిల్లల్ని దూరం చేసిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.
"ఇది కేవలం ఒక కుటుంబం విషాదం మాత్రమే కాదు. ప్రశ్నాపత్రాల లీక్ ఘటన ఇలాంటి ఎన్నో కుటుంబాలకు తమ పిల్లల్ని దూరం చేశాయి. ప్రతి పేరు వెనుక ఒక తల్లి, ఒక తండ్రి ఉంటారు. వారికి ఇప్పుడు రేపటి రోజు లేకుండా పోయింది. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా భద్రత లభించేలా ఈ వ్యవస్థను మొదటి నుండి పునర్నిర్మించాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల త్యాగానికి తగిన ఫలితం దక్కాలే కానీ.. కన్నీళ్లు కాదు" అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
रिया के पिता, राजेश जी बेटी को खोकर इस तरह टूटे कि उन्हें देखने वाले हर शख़्स की आँखें भर आईं।
यह सिर्फ़ एक परिवार का दर्द नहीं। पेपर लीक ने ऐसे कई परिवारों से उनका बच्चा छीन लिया।
हर नाम के पीछे एक माँ है, एक पिता है - जिनके लिए अब कोई कल नहीं।
इस System को नए सिरे से बनाना… pic.twitter.com/wCGC5lleh1
— Rahul Gandhi (@RahulGandhi) July 18, 2026
Also Read..
నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ -1 రాకెట్.. ఆ ఘనత సాధించిన మూడో దేశంగా భారత్
దేశం గర్వపడేలా ఎదగండి.. ఆరుట్ల విద్యార్థులకు అజారుద్దీన్ సూచన
అధిక కొలెస్ట్రాల్ బాధితులకు శుభవార్త.. ఇంజెక్షన్‌కు బదులుగా టాబ్లెట్..
తాజావార్తలు
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు






