Minister Azharuddin | దేశం గర్వపడేలా ఎదగండి.. ఆరుట్ల విద్యార్థులకు అజారుద్దీన్ సూచన
Minister Azharuddin | రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను రాష్ట్ర మంత్రి మహ్మద్ అజారుద్దీన్( Minister Azharuddin )శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అజారుద్దీన్‌కు ఘనస్వాగతం పలికారు.
Minister Azharuddin | త్రినేత్ర.న్యూస్ : రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను రాష్ట్ర మంత్రి మహ్మద్ అజారుద్దీన్( Minister Azharuddin )శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అజారుద్దీన్‌కు ఘనస్వాగతం పలికారు. స్కూల్‌లోని తరగతి గదులు, డైనింగ్ హాల్స్, ల్యాబ్స్‌తో పాటు ఇతర మౌలిక సదుపాయాలను మంత్రి పరిశీలించారు. విద్యార్థులతో కాసేపు ఆయన ముచ్చటించారు. స్పోర్ట్స్, ఫిట్‌నెస్‌తో పాటు ఇతర అంశాలపై విద్యార్థులకు మంత్రి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ.. ఆరుట్ల టీపీఎస్ అద్భుతమని కొనియాడారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఏర్పాట్లు ఉన్నాయన్నారు. నాణ్యమైన విద్యతో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన వసతుల కల్పన బాగుందని ప్రశంసించారు. దేశంలోనే మోడల్‌గా తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిలుస్తుందన్నారు.

విద్యార్థులు హార్డ్ వర్క్ చేయండి.. ఇక్కడున్న వసతులతో ఏదైనా సాధించొచ్చు అని మంత్రి పేర్కొన్నారు. నేను ఇండియా తరపున క్రికెట్ ఆడినప్పుడు.. నా గురువులు ఎంతో సంతోషపడ్డారు. గురువులను, తల్లిదండ్రులను గౌరవించినవాడు ఉన్నతస్థానంలో ఉంటాడని చెప్పారు. ప్రతి ఒక్కరూ పాజిటివ్‌గా ఉండి, లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, వాటిని సాధించేందుకు కృషి చేయాలన్నారు. దేశం గర్వపడేలా ఎదగాలని, అందుకు సర్కార్ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా విద్యారంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. రేవంత్ డ్రీమ్ ప్రాజెక్టులు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని మంత్రి అజారుద్దీన్ స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Health Insurance | పోలియో గురించి చెప్పలేదని.. ముఖ్యమంత్రి మామను ముప్పుతిప్పలు పెట్టిన బీమా సంస్థ
జులై 25, 2026

Special Traffic Bureau | ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్.. తెరపైకి ప్రత్యేక బ్యూరో
జులై 24, 2026

CM Revanth Reddy | సెంట్రలైజ్డ్ కిచెన్లతో రైతులకు ప్రయోజనం కల్పిస్తాం : సీఎం రేవంత్‌రెడ్డి
జులై 24, 2026
తాజావార్తలు
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!
- ●Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!



