BRS Leaders | సోదాలు చేసి రెండేళ్లవుతోంది.. చర్యలేవి?: ఈడీకి బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల ప్రశ్న
BRS Leaders | రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసం, కార్యాలయాలతో పాటు సంబంధిత ప్రాంతాల్లో 2024 సెప్టెంబర్ 27, 28 తేదీల్లో ఈడీ సోదాలు నిర్వహించిందని.. కానీ దర్యాప్తు వివరాలను ఇంతవరకు వెల్లడించలేదని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు.
త్రినేత్ర న్యూస్: రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసం, కార్యాలయాలతో పాటు సంబంధిత ప్రాంతాల్లో 2024 సెప్టెంబర్ 27, 28 తేదీల్లో ఈడీ సోదాలు నిర్వహించిందని.. కానీ దర్యాప్తు వివరాలను ఇంతవరకు వెల్లడించలేదని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. ఈమేరకు ఆ వివరాలను వెల్లడించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌వీ, బీఆర్‌ఎస్‌వై ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద్ గౌడ్, సంజయ్ పార్టీ సీనియర్ నాయకులు తలసాని సాయి, బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురు ముఖ్య నాయకులు సోమవారం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఈడీ డిప్యూటీ డైరెక్టర్ స్వాతిని కలిసి లేఖను అందించారు.
ఈడీ కార్యాలయంలోకి వెళ్లి అధికారులకు వినతిపత్రం అందించేందుకు ప్రయత్నించిన బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు తొలుత అడ్డుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్ శ్రేణులు ఈడీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేయగా, అనంతరం అధికారులను కలిసి లేఖ అందించేందుకు పోలీసులు అనుమతించారు.
ఈడీ సోదాలకు రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు దర్యాప్తు ఏ దశలో ఉందో స్పష్టత ఇవ్వాలని బీఆర్‌ఎస్ నేతలు లేఖలో కోరారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న నగదు, పత్రాలు, డిజిటల్ పరికరాలు, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలను వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు.
ఈడీ సోదాలు సుమారు 16 ప్రాంతాల్లో ఏకకాలంలో జరిగాయని, పెద్ద సంఖ్యలో అధికారులు, CRPF సిబ్బంది పాల్గొన్నారని లేఖలో పేర్కొన్నారు. సోదాల సందర్భంగా నగదు లెక్కింపు యంత్రాలను కూడా తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అయితే సోదాల అనంతరం స్వాధీనం చేసుకున్న వస్తువులు, తదుపరి దర్యాప్తు చర్యలపై స్పష్టమైన సమాచారం వెల్లడించలేదన్నారు. నరసాపూర్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, వాటింగపల్లి FIR, కొత్వాల్‌గూడ-మానసహిల్స్‌కు సంబంధించిన అంశాలను కూడా లేఖలో ప్రస్తావిస్తూ, ఆయా వ్యవహారాల్లో దర్యాప్తు పురోగతి ఏమిటో వెల్లడించాలని బీఆర్‌ఎస్ కోరింది.
లేఖలో బీఆర్‌ఎస్ అడిగిన ప్రధాన ప్రశ్నలివే..
- 2024 సెప్టెంబర్ 27, 28 తేదీల సోదాలకు సంబంధించిన ECIR/కేసు వివరాలు ఏమిటి?
- సోదాల్లో ఎంత నగదు, ఎలాంటి పత్రాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు?
- స్వాధీనం చేసుకున్న వస్తువులపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏమిటి?
- సంబంధిత వ్యక్తులకు నోటీసులు లేదా సమన్లు జారీ చేశారా?
- దర్యాప్తు అనంతరం ప్రాసిక్యూషన్ కంప్లైంట్ దాఖలు చేశారా?
- సీజ్ చేసిన ఆస్తులు, వాచ్‌లు తదితరాల ప్రస్తుత స్థితి ఏమిటి?
- దర్యాప్తు ప్రస్తుత స్థితి ఏమిటి? తదుపరి చర్యలు ఏమిటి?
పై వివరాలను 15 రోజుల్లోగా వెల్లడించాలని బీఆర్‌ఎస్ నేతలు ఈడీనీ కోరారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నట్లయితే, తదుపరి చర్యలకు సంబంధించిన కాలపరిమితిపై కూడా స్పష్టత ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలన్నదే తమ అభిప్రాయమని, ప్రజలకు సంబంధించిన కేసుల దర్యాప్తు పురోగతిపై సంబంధిత సంస్థలు పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని బీఆర్‌ఎస్ నేతలు విన్నవించారు.
ఈడీ వెంటనే బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈడీ నుంచి స్పందన రాకపోతే యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్‌ను కలిసి ఈ అంశంపై వివరణ కోరతామని, న్యాయపరంగా ఈడీపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

Allu Sirish | పండుగ ముగిసినా.. మైకుల మోత ఆగలేదు.. పోలీసులకు అల్లు శిరీశ్ ఫిర్యాదు
సెప్టెంబర్ 28, 2026

Fake Notes | మార్కెట్లోకి 500 రూపాయల నకిలీ నోట్లొచ్చేశాయ్.. బీ కేర్ ఫుల్
సెప్టెంబర్ 27, 2026

TGOs | టీజీవో ఫోరం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ప్రేమ్ కరణ్ రెడ్డి, మోర శ్రీనివాస్
సెప్టెంబర్ 27, 2026
తాజావార్తలు
- ●Mahesh Kumar Goud | జ్ఞానేశ్ కుమార్ బీజేపీకి తొత్తుగా మారారు: మహేశ్‌కుమార్ గౌడ్
- ●Romantic OTT | ఓటీటీలోకి అర్జున్ రెడ్డి డైరెక్టర్ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ
- ●Supreme Court on UPI MDR Fee | యూపీఐ లావాదేవీలపై చార్జీలా? ఎవరి లాభం కోసం? కేంద్రం, ఆర్బీఐలను ప్రశ్నించిన సుప్రీంకోర్టు
- ●Rahul Gandhi | ప్రశ్నిస్తే చెంపదెబ్బలు.. నిలదీస్తే లాఠీచార్జీలు.. మంత్రి చెంపదెబ్బ వివాదంపై రాహుల్ విమర్శలు
- ●Talasani Srinivas Yadav | కాంగ్రెస్ ప్రభుత్వ హామీలన్నీ మోసపూరిత మైనవే: తలసాని శ్రీనివాస్ యాదవ్
- ●Nidhi Tiwari Suicide | ఇన్‌స్టాలో లక్షల మంది ఫాలోవర్స్.. ఇన్ఫ్లుయెన్సర్ నిధి తివారీ సూసైడ్: ఆ ఫోన్ సంభాషణ తర్వాతే తీవ్ర నిర్ణయం

Mahesh Kumar Goud | జ్ఞానేశ్ కుమార్ బీజేపీకి తొత్తుగా మారారు: మహేశ్‌కుమార్ గౌడ్

Romantic OTT | ఓటీటీలోకి అర్జున్ రెడ్డి డైరెక్టర్ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ

Supreme Court on UPI MDR Fee | యూపీఐ లావాదేవీలపై చార్జీలా? ఎవరి లాభం కోసం? కేంద్రం, ఆర్బీఐలను ప్రశ్నించిన సుప్రీంకోర్టు

Rahul Gandhi | ప్రశ్నిస్తే చెంపదెబ్బలు.. నిలదీస్తే లాఠీచార్జీలు.. మంత్రి చెంపదెబ్బ వివాదంపై రాహుల్ విమర్శలు









