త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Talasani Srinivas Yadav | కాంగ్రెస్ ప్రభుత్వ హామీలన్నీ మోసపూరిత మైనవే: తలసాని శ్రీనివాస్ యాదవ్

Talasani Srinivas Yadav | కాంగ్రెస్ ప్ర‌భుత్వ (Congress Govt) హామీల‌న్నీ మోస‌పూరిత‌మైన‌వే అని మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ (Talasani Srinivas Yadav) విమ‌ర్శించారు.

G

Hyderabad | Published On Sep 28, 2026, 1.25 pm IST

Talasani Srinivas Yadav | కాంగ్రెస్ ప్రభుత్వ హామీలన్నీ మోసపూరిత మైనవే: తలసాని శ్రీనివాస్ యాదవ్
Advertisement

Talasani Srinivas Yadav | త్రినేత్ర న్యూస్‌: కాంగ్రెస్ ప్ర‌భుత్వ (Congress Govt) హామీల‌న్నీ మోస‌పూరిత‌మైన‌వే అని మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ (Talasani Srinivas Yadav) విమ‌ర్శించారు. ఇందిర‌మ్మ ఇండ్ల (Indiramma Indlu) కోసం ప్ర‌భుత్వం ల‌బ్ధిదారుడిని రూ.6 ల‌క్ష‌లు చెల్లించాలంటూ ప్ర‌భుత్వం అడగ‌మేంట‌ని విమ‌ర్శించారు. వారికి అంత‌మొత్తం చెల్లించే స్థోమ‌తే ఉంటే ప్ర‌భుత్వాన్ని ఎందుకు అడుగుతార‌ని ప్ర‌శ్నించారు. సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ ల‌బ్దిదారుల‌కు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా త‌మ‌కు పెన్ష‌న్లు ఇప్పించాలంటూ వృద్ధులు, వికలాంగులు ఎమ్మెల్యేకు విన్న‌వించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ఇందిర‌మ్మ ట‌వ‌ర్ల కోసం ల‌బ్దిదారులు రూ.6 ల‌క్ష‌లు చెల్లించ‌డంతోపాటు ద‌ర‌ఖాస్తుల‌కు రూ.10 వేలు క‌ట్టడ‌మేంట‌ని ప్ర‌శ్నించారు. గతంలో కూడా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇలాగే డ‌బ్బులు క‌ట్టించుకున్నార‌ని, ఇండ్లు నిర్మించి ఇవ్వ‌క‌పోగా తిరిగి ఆ న‌గ‌దు చెల్లించ‌లేద‌ని విమ‌ర్శించారు. మ‌ళ్లీ ఇప్పుడు రూ.10 క‌ట్ట‌మంటున్న‌ర‌ని మండిప‌డ్డారు.

ప్ర‌జ‌లు రూ.6 ల‌క్ష‌లు క‌ట్టే స్థోమ‌త ఉన్న‌ప్పుడు ఇండ్లు కావాల‌ని ప్ర‌భుత్వాన్ని ఎందుకు అడుగుతార‌ని ధ్వ‌జ‌మెత్తారు. డ‌బ్బులు క‌డితేనే ఇండ్లు ఇస్తామ‌ని ఎన్నిక‌ల‌ప్పుడే చెప్పేదుండే అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలని కేసీఆర్ (KCR) ప్రభుత్వం ఒక్క పైసా భారం లేకుండా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇందిరమ్మ ఇంటి కోసం లబ్ధిదారుడిని 6 లక్షలు చెల్లించమంటుంద‌ని, పేదలు అంత డ‌బ్బు ఎక్కడి నుండి తెస్తారని ప్ర‌శ్నించారు. కట్టని ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక కోసం డ్రా ఏంటన్నారు. ఇండ్లు కట్టేది ఎప్పుడు?.. ఇచ్చేది ఎప్పుడని మండిప‌డ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేసి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు.

తులం బంగారం ఇస్తామని ప్రకటించి మూడేండ్లు అవుతున్నా ఒక్కరికి కూడా ఇవ్వలేదని చెప్పారు. వికలాంగుల పెన్షన్ పెంచుతామని నేటి వరకు పెంచలేదన్నారు. నూతన పెన్షన్‌లు (New Pensions) ఇస్తామని చెప్పి నేటి వరకు ఇవ్వలేదని విమ‌ర్శించారు. హామీల అమలు విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులు ఎంతో ఆశతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు.

Advertisement

తాజావార్తలు

Advertisement