త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Siddarth | చేతికి బ్యాండేజ్‌తో సిద్ధార్థ్ – వెబ్ సిరీస్ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరో

హీరో సిద్ధార్థ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న హిందీ వెబ్‌సిరీస్ ఆప‌రేష‌న్ స‌ఫేద్ సాగ‌ర్ ఆగ‌స్ట్ 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ వెబ్‌సిరీస్ ట్రైల‌ర్‌ను సోమ‌వారం ముంబైలో రిలీజ్ చేశారు. ఈ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో సిద్ధార్థ్ చేతికి బ్యాండేజ్‌తో క‌నిపించారు. ఈ వేడుక‌లో స్టేజ్‌పైనే ఏడ్చేశారు.

N

Entertainment | Published On Jul 21, 2026, 4.21 pm IST

Siddarth | చేతికి బ్యాండేజ్‌తో సిద్ధార్థ్ – వెబ్ సిరీస్ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరో
Advertisement

Siddarth | హీరో సిద్ధార్థ్ ఎమోష‌న‌ల్ అయ్యారు. ఆప‌రేష‌న్ స‌ఫేద్ సాగ‌ర్ వెబ్‌సిరీస్ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో స్టేజ్‌పైనే క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో సిద్ధార్థ్ చేతికి బ్యాండేజ్‌తో క‌నిపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అత‌డికి ఏమైందంటూ నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

నెట్‌ఫ్లిక్స్‌లో....

కార్గిల్ వార్‌లో భార‌త‌ వైమానిక ద‌ళం సాగించిన స్ఫూర్తిదాయ‌క పోరాటం ఆధారంగా ఆప‌రేష‌న్ స‌ఫేద్ సాగ‌ర్ వెబ్‌సిరీస్ తెర‌కెక్కుతోంది. ఈ సిరీస్‌లో సిద్ధార్థ్‌, జిమ్మీ షేర్గిల్‌, దియా మీర్జా కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ఓనీ సేన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆగ‌స్ట్ 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. హిందీతో పాటు తెలుగులో రిలీజ్ అవుతోంది.

చేతికి బ్యాండేజ్‌....

ఆప‌రేష‌న్ స‌ఫేద్ సాగ‌ర్ వెబ్‌సిరీస్ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్ సోమ‌వారం ముంబైలో జ‌రిగింది. ఈ వేడుక‌లో కుడి చేతికి ఫ్రాక్చ‌ర్ అయిన‌ప్పుడు ధ‌రించే పెద్ద‌ బ్యాండేజ్‌తో సిద్ధార్థ్ క‌నిపించారు. నొప్పి కార‌ణంగా వేడుక‌లో ఇబ్బందులు ప‌డ్డారు. గాయం గురించి అడిగిన ప్ర‌శ్న‌కు ఫ‌న్నీగా స‌మాధానం ఇచ్చాడు సిద్ధార్థ్‌. తాను పెద్ద‌వాడిని అవుతున్నాన‌ని, వ‌య‌సైపోవ‌డంతో త‌లెత్తిన స‌మ‌స్య కార‌ణంగా చేతికి స‌ర్జ‌రీ జ‌రిగింది అంటూ పేర్కొన్నారు. గాయం ఎలా అయ్యింద‌న్న‌ది మాత్రం రివీల్ చేయ‌లేదు

క‌న్నీళ్లు...

స‌ఫేద్ సాగ‌ర్ వెబ్‌సిరీస్‌లో సిద్ధార్థ్...కార్గిల్ వార్‌లో క‌న్నుమూసిన‌ స్క్వాడ్ర‌న్ లీడ‌ర్ అజ‌య్ ఆహుజా పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఈ వేడుక‌లో అజ‌య్ ఆహుజా స‌తీమ‌ణి అల్కా కూడా పాల్గొన్న‌ది. భ‌ర్త చేసిన త్యాగం గురించి అల్కా స్టేజ్‌పై చెబుతోన్న స‌మ‌యంలో సిద్ధార్థ్ ఎమోష‌న‌ల్ అయ్యాడు. స్టేజ్‌పైనే ఏడ్చేశాడు.
ఈ వేడుక‌లో సిద్ధార్థ్ మాట్లాడుతూ "తొలుత అజ‌య్ ఆహుజా పాత్ర‌లో న‌టించ‌డానికి భ‌య‌ప‌డ్డాన‌ని అన్నాడు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వీరుడి పాత్ర‌కు న్యాయం చేయ‌లేన‌నే భ‌యం క‌లిగింద‌ని చెప్పారు. మ‌రోవైపు పాత్ర‌ను చేయ‌డంలో ఏవైనా తేడాలు వ‌స్తే విమ‌ర్శ‌లు, వివాదాలు వ‌స్తాయి. వాట‌న్నింటికి భ‌య‌ప‌డి ఆఫ‌రేష‌న్ స‌ఫేద్ సాగ‌ర్‌లో న‌టించ‌డానికి నిరాక‌రించాను. వివాదాలు త‌లెత్త‌కుండా మేక‌ర్స్ అన్ని అనుమ‌తులు తీసుకున్నార‌ని తెలిసిన త‌ర్వాతే అంగీక‌రించాన‌ని" అన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Advertisement
Advertisement