Minister Ponguleti | తెలంగాణపై ఎల్‌నినో ప్రభావం
Minister Ponguleti | ఎల్‌నీనో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడంచారు. తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలపై ఎల్‌నీనో ప్రభావం ఉండనున్నప్పటికీ, దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు మరింత తీవ్రంగా ఉండే అవకాశముందని ఆయన తెలిపారు.
- సాధారణం కంటే తగ్గనున్న వర్షాలు
- ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
- సహాయక చర్యల కోసం జిల్లాకో ప్రత్యేకాధికారి
- కేంద్రానికి నివేదిక పంపుతం
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
- వరంగల్‌లో కలెక్టర్లతో సమీక్ష
Minister Ponguleti | ఎల్‌నీనో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడంచారు. తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలపై ఎల్‌నీనో ప్రభావం ఉండనున్నప్పటికీ, దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు మరింత తీవ్రంగా ఉండే అవకాశముందని ఆయన తెలిపారు. ఎల్‌నీనో ప్రభావం నేపథ్యంలో చేపట్టాల్సిన ముందస్తు కార్యాచరణ, కంటింజెన్సీ ప్రణాళికలు, వివిధ శాఖల సంసిద్ధతపై మంగళవారం హనుమకొండ కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో వర్షాభావ పరిస్థితులపై సమగ్రంగా చర్చించినట్లు చెప్పారు.
మంత్రివర్గానికి నివేదిక..
వర్షాభావ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రతి ఉమ్మడి జిల్లాకో సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేకంగా అధికారిగా ప్రభుత్వం నియమించిందని తెలిపారు. ఆయా జిల్లాల్లో వ్యవసాయం, తాగునీటి లభ్యత, భూగర్భ జలాలు, వర్షాభావ పరిస్థితులు తదితర అంశాలపై ఈ ప్రత్యేక అధికారులు నివేదికలు సిద్ధం చేసి ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గానికి అందజేస్తారని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారి దేవసేనను ప్రత్యేక అధికారిగా నియమించామన్నారు. వర్షాభావ పరిస్థితుల నుంచి జిల్లాలను ఎలా గట్టెక్కించాలి, రైతులకు ఎలాంటి భరోసా కల్పించాలి, తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని మంత్రి తెలిపారు. ఈ వర్షాభావ పరిస్థితులపై సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించి, రాష్ట్రానికి అందాల్సిన సహాయం, కేంద్రం నుంచి పొందాల్సిన మద్దతుపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆందోళన అవసరం లేదు..
ప్రజలు, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందని మంత్రి స్పష్టం చేశారు. సమావేశంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచంద్రనాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి,రేవూరి ప్రకాశ్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి, మురళీ నాయక్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికారి, రాష్ట్ర కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన ఉమ్మడి వరంగల్ జిల్లాల కలెక్టర్లు, చాహత్ బాజ్‌పాయి, సత్య శారద, హేమంత్ బొర్ఖడే సదాశివరావు, సందీప్ కుమార్ ఝా, రాహుల్ శర్మ, స్నేహ శబరీష్, అదనవు కలెక్టర్లు, కేవీకే–ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Ramchander Rao | కార్గిల్ విజయ్ దివస్.. సైనికుల అసమాన పరాక్రమానికి ప్రతీక: ఎన్. రామచందర్ రావు
- ●Health Tax | జంక్‌ఫుడ్‌పై హెల్త్ ట్యాక్స్!
- ●Pralhad Joshi | కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి బాధ్యతల స్వీకరణ
- ●Asaduddin Owaisi | యూపీ ఎలక్షన్స్: అఖిలేష్ యాదవ్‌కు అసదుద్దీన్ ఒవైసీ బంపర్ ఆఫర్.. 'ఫ్రెండ్ రిక్వెస్ట్' అంటూ బీజేపీ సెటైర్లు
- ●Rahul Gandhi | విద్యార్థులపై కాల్పులకు ఆదేశించింది ఎవరు? అమిత్ షాను నిలదీసిన రాహుల్
- ●Srinivas Goud | కృష్ణా, భీమా నదులపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులు.. తెలంగాణకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు : శ్రీనివాస్ గౌడ్

Ramchander Rao | కార్గిల్ విజయ్ దివస్.. సైనికుల అసమాన పరాక్రమానికి ప్రతీక: ఎన్. రామచందర్ రావు

Health Tax | జంక్‌ఫుడ్‌పై హెల్త్ ట్యాక్స్!

Pralhad Joshi | కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి బాధ్యతల స్వీకరణ

Asaduddin Owaisi | యూపీ ఎలక్షన్స్: అఖిలేష్ యాదవ్‌కు అసదుద్దీన్ ఒవైసీ బంపర్ ఆఫర్.. 'ఫ్రెండ్ రిక్వెస్ట్' అంటూ బీజేపీ సెటైర్లు




