త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Murali Akunuri | రాహుల్ గాంధీ.. ఏడాదికి 2 ల‌క్ష‌ల ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇస్తామ‌న్న హామీ ఏమైంది?: ఆకునూరి ముర‌ళి

Murali Akunuri | ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఏడాదికి 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు (Government Jobs) ఇస్తామ‌న్న హామీ ఏమైంద‌ని కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీని (Rahul Gandhi) మాజీ ఐఏఎస్, విద్యా క‌మిష‌న్ మాజీ చైర్మ‌న్ ఆకునూరి ముర‌ళి (Murali Akunuri) ప్ర‌శ్నించారు.

G

Telangana | Published On Aug 22, 2026, 9.44 am IST

Murali Akunuri | రాహుల్ గాంధీ.. ఏడాదికి 2 ల‌క్ష‌ల ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇస్తామ‌న్న హామీ ఏమైంది?: ఆకునూరి ముర‌ళి
Advertisement

Murali Akunuri | త్రినేత్ర‌.న్యూస్‌: ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఏడాదికి 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు (Government Jobs) ఇస్తామ‌న్న హామీ ఏమైంద‌ని కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీని (Rahul Gandhi) మాజీ ఐఏఎస్, విద్యా క‌మిష‌న్ మాజీ చైర్మ‌న్ ఆకునూరి ముర‌ళి (Murali Akunuri) ప్ర‌శ్నించారు. తెలంగాణ యువ‌త (Telangana Youth) ఆందోళ‌న చెందుతున్న‌ద‌ని, మీరు ఆ హామీని త‌ప్ప‌నిస‌రిగా అమ‌లు చేయాల‌ని ఎక్స్ వేదిక‌గా డిమాండ్ చేశారు.

`ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా 2023 న‌వంబ‌ర్ 27న మా ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఓ ఏడాదిలో 2 లక్షల‌ ప్రభుత్వ ఉద్యోగాలు నియమిస్తామని తెలంగాణ యువతకు వాగ్దానం చేశారు. దీని మీద యువత తీవ్ర ఆందోళన చెందుతుంది. మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు, వాగ్దానాల (Promises) అమ‌లుపై మీ ముఖ్యమంత్రి తో రివ్యూ చేసుకోవాలి కదా?.. మీరు ఈ గ్యారెంటీని అమలు చెయ్యాల్సిందే.` అంటూ రాహుల్ గాంధీకి ట్వీట్ చేశారు.

Advertisement
Advertisement