Rashmika Mandanna | ప్రొడ్యూసర్ కొడుకు పెళ్లి వేడుకలో విజయ్ , రష్మిక – గాయం నుంచి కోలుకున్న నేషనల్ క్రష్
మైసా షూటింగ్‌లో గాయపడ్డ రష్మిక మందన్న చాలా రోజుల తర్వాత మళ్లీ మీడియా కంట పడింది. ప్రమాదం తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న రష్మిక ఫస్ట్ టైమ్ బయట కనిపించింది. టాలీవుడ్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి తనయుడి ఎంగేజ్‌మెంట్ వేడుకల్లో భర్త విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక మందన్న పాల్గొన్నది.
Entertainment | Published On Aug 24, 2026, 12.48 pm IST
Rashmika Mandanna | మైసా షూటింగ్‌లో గాయపడ్డ రష్మిక మందన్న ప్రమాదం తర్వాత ఫస్ట్ టైమ్ ఓ పెళ్లి వేడుకలో భర్త విజయ్ దేవరకొండతో కలిసి సందడి చేసింది. టాలీవుడ్ నిర్మాత నిరంజర్ రెడ్డి తనయుడి ఎంగేజ్‌మెంట్ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకలో టాలీవుడ్ ప్రముఖులందరూ పాల్గొన్నారు. ఈ వేడుకకు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. మైసా షూటింగ్‌లో గాయపడ్డ రష్మిక మందన్న గత కొద్ది రోజులుగా విశ్రాంతి తీసుకుంటోంది. ఇంటికే పరిమితమైంది. ఈ గాయం నుంచి కోలుకున్న రష్మిక ఫస్ట్ టైమ్ ఈ నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నది. విజయ్ బ్లాక్ కలర్ సూట్‌లో, రష్మిక బ్లాక్ హాఫ్ శారీలో ఎంగేజ్‌మెంట్ ఈవెంట్‌లో కనిపించారు. వీరి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. రష్మిక ఈజ్ బ్యాక్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతోన్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అంటున్నారు.
మైసా సాంగ్ షూట్‌లో...
మైసా సాంగ్ షూట్‌లో రష్మిక తుంటి భాగంలో గాయమైంది. ప్రమాదం కారణంగా సర్జరీ జరగడంతో దాదాపు నెల రోజుల పాటు షూటింగ్‌లకు దూరమైంది. ఈ ప్రమాదం ఎఫెక్ట్ రణబాలి, మైసాతో పాటు అల్లు అర్జున్ రాకా షూటింగ్‌లపై పడింది. సెప్టెంబర్ మూడో వారం నుంచి రష్మిక తిరిగి షూటింగ్‌లలో పాల్గొననున్నట్లు సమాచారం.
భార్యాభర్తలుగా...
రణబాలిలో భర్త విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తోంది రష్మిక మందన్న. హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్, రష్మిక భార్యాభర్తలుగానే కనిపించబోతున్నారు. సెప్టెంబర్‌లో ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ రష్మిక గాయపడటంతో రణబాలిని పోస్ట్‌పోన్ చేశారు.
గిరిజన యువతి...
మైసా పేరుతో యాక్షన్ కథాంశంతో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది రష్మిక. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో గిరిజన యువతిగా రష్మిక కనిపించబోతుంది. వీటితో పాటు అల్లు అర్జున్ రాకాలో రష్మిక ఓ హీరోయిన్‌గా కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Hero #VijayDeverakonda and #Rashmika snapped at producer #NiranjanReddy’s son’s engagement in Hyderabad. pic.twitter.com/YdUxCe3ZDW
— Suresh PRO (@SureshPRO_) August 24, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

NBK 111 | సంక్రాంతి రేసు నుంచి బాలయ్య ఔట్ – ఎన్బీకే 111 రిలీజ్ డేట్ ఇదేనా?
ఆగస్టు 23, 2026

Meenakshi Chaudhary | ‘కాకా’లో మీనాక్షి చౌదరి.. మెగాస్టార్ సినిమాలో అదిరిపోయే రోల్!
ఆగస్టు 23, 2026

Kiara Advani | హైదరాబాద్ నాకు మరో పుట్టిల్లు – టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కియారా అద్వానీ కామెంట్స్
ఆగస్టు 23, 2026
తాజావార్తలు
- ●Harish Rao | జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్..: హరీశ్ రావు
- ●Miss Universe India 2026 | కేరళ భామకు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. ఎవరీ కాజియా లిజ్ మెజో..?
- ●Balmoor Venkat | విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు.. మీ లడాయి ఎక్కడికి పోయింది?.. బీజేపీ నేతలపై బల్మూర్ వెంకట్ ఆగ్రహం
- ●Adi Sriniva | ఫీజు బకాయిలపై లడాయి అంటూ బడాయికి పోతున్న బీజేపీ: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
- ●Gold And Silver Prices Today | పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. ఇన్వెస్టర్లకు ఇదే మంచి చాన్స్..?
- ●Doctor was assaulted | వైద్యుడిని చితకబాదిన రోగి కుమారుడు

Harish Rao | జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్..: హరీశ్ రావు

Miss Universe India 2026 | కేరళ భామకు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. ఎవరీ కాజియా లిజ్ మెజో..?

Balmoor Venkat | విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు.. మీ లడాయి ఎక్కడికి పోయింది?.. బీజేపీ నేతలపై బల్మూర్ వెంకట్ ఆగ్రహం

Adi Sriniva | ఫీజు బకాయిలపై లడాయి అంటూ బడాయికి పోతున్న బీజేపీ: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్



