త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chicken Waste | 100 ట‌న్నుల చికెన్ వ్య‌ర్థాల‌ను ఏపీ త‌ర‌లిస్తుండ‌గా ప‌ట్టుకున్న పోలీసులు..

Chicken Waste | చికెన్ వ్యర్థాల మాఫియాపై (Chicken Waste Mafia) సైబరాబాద్ పోలీసులు, వెటర్నరీ అధికారులు దాడులు నిర్వ‌హ‌ఙంచారు. ఈ సంద‌ర్భంగా 100 టన్నుల చికెన్‌ వ్యర్థాలను (Chicken Waste) స్వాధీనం చేసుకున్నారు.

G

Hyderabad | Published On Aug 24, 2026, 12.49 pm IST

Chicken Waste | 100 ట‌న్నుల చికెన్ వ్య‌ర్థాల‌ను ఏపీ త‌ర‌లిస్తుండ‌గా ప‌ట్టుకున్న పోలీసులు..
Advertisement

Chicken Waste | త్రినేత్ర‌.న్యూస్‌: చికెన్ వ్యర్థాల మాఫియాపై (Chicken Waste Mafia) సైబరాబాద్ పోలీసులు, వెటర్నరీ అధికారులు దాడులు నిర్వ‌హ‌ఙంచారు. ఈ సంద‌ర్భంగా 100 టన్నుల చికెన్‌ వ్యర్థాలను (Chicken Waste) స్వాధీనం చేసుకున్నారు. చేపల చెరువు యజమానులకు చికెన్ వ్యర్థాలను విక్రయించి ఈ మాఫియా సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అత్తాపూర్, మియాపూర్, అమీన్‌పూర్, కూకట్‌పల్లి, జీడిమెట్ల, చింతల్‌లో దాడులు చేసిన అధికారులు.. లారీల్లో డంప్ చేస్తోండగా ప‌ట్టుకున్నారు.

గతంలో కేసులు నమోదైనప్ప‌టికీ చికెన్ మాఫియా పట్టించుకోలేదని అధికారులు వెల్ల‌డించారు. రాత్రి సమయంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని చేపల చెరువు (Fish Farmers) యజమానులకు ఈ వ్యర్థాలను విక్రయించడానికి సిద్ధం చేస్తున్నార‌ని నిర్ధారించారు. గత నెలలోనే వందటన్నుల చికెన్ వ్యర్థాలను హెచ్ ఫాస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ అదే రీతిలో చికెన్ వ్యర్థాలను తరలిస్తోండటంతో అధికారులు సోదాలు చేసి చర్యలు చేపట్టారు. చికెన్ వ్యర్థాలతో పెరిగే చేపలు తింటే క్యాన్సర్ బారిన పడే అవకాశం హెచ్చరించారు.

Advertisement
Advertisement