Paise Ki Goonj | ఛత్రోన్ కీ గూంజ్ కాదు పైసే కీ గూంజ్.. రాహుల్ కార్యక్రమం కోసం ఒక్కో ఇన్‌ఫ్లుయెన్సర్‌కు రూ. 35 వేలు
Paise Ki Goonj | పూణెలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిర్వహించ తలెపట్టిన 'ఛత్రోన్ కీ గూంజ్' (Chhatron Ki Goonj) కార్యక్రమంపై బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఈ కార్యక్రమాన్ని పైసే కీ గూంజ్ (Paise Ki Goonj)గా అభివర్ణించింది. కార్యక్రమానికి జనాన్ని సమీకరించేందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు కాంగ్రెస్ పార్టీ పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించిందని ఆరోపించింది. ఒక్కో ఇన్‌ఫ్లుయెన్సర్‌కు రూ.30 వేల రూ. 35 వేల వరకు చెల్లిస్తున్నారని పేర్కొంది.
Paise Ki Goonj | త్రినేత్ర.న్యూస్ : దేశ విద్యా వ్యవస్థలోని సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ‘ఛత్రోన్ కీ గూంజ్’ (Chhatron Ki Goonj) పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ పూణెలో (Pune) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిర్వహించ తలెపట్టిన 'ఛత్రోన్ కీ గూంజ్' కార్యక్రమంపై బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఈ కార్యక్రమాన్ని పైసే కీ గూంజ్ (Paise Ki Goonj)గా అభివర్ణించింది.
రాహుల్ కార్యక్రమానికి జనాన్ని సమీకరించేందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు కాంగ్రెస్ పార్టీ పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించిందని ఆరోపించింది. కార్యక్రమం కోసం ఒక్కో ఇన్‌ఫ్లుయెన్సర్‌కు రూ.30 వేల రూ. 35 వేల వరకు చెల్లిస్తున్నారని పేర్కొంది. మొత్తంగా ఇందుకోసం హస్తం పార్టీ రూ.10 కోట్లు ఖర్చు చేసిందని బీజేపీ ప్రతినిధి నావ్‌నాథ్ బాన్ ఆరోపించారు. "రాహుల్ గాంధీ ఛత్రోన్ కీ గూంజ్ సమావేశానికి స్వచ్ఛందంగా జనం ఎవరూ రావడం లేదు. అందుకే రూ. 9 కోట్ల నుండి 10 కోట్ల వరకు ఖర్చు చేసి జనాలను సమీకరిస్తున్నారు" అని ఆరోపించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల గొంతుక కాదని పెయిడ్ పొలిటికల్ ప్రోగ్రామ్ (PPP) మోడల్ అని విమర్శించారు.
బీజేపీ ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్
బీజేపీ ఆరోపణలను ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తిప్పికొట్టింది. యువతలో, ముఖ్యంగా జెన్-జెడ్ (Gen-Z) వర్గంలో రాహుల్ గాంధీకి వస్తున్న ప్రజాదరణ చూసి అధికార పార్టీలో భయం పుట్టుకుందని వ్యాఖ్యానించింది. అందుకే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ నాయకులు సచిన్ సావంత్ పేర్కొన్నారు.
కాగా, దేశంలోని వివిధ ప్రాంతాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యా రంగంలోని లోపాలు, ఉపాధి అవకాశాలపై చర్చించడానికి కాంగ్రెస్ ఛత్రోన్ కీ గూంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా దాదాపు 800 నగరాలు, పట్టణాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇప్పటికే హైదరాబాద్, డెహ్రాడూన్, ప్రయాగ్‌రాజ్‌లో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఇవాళ పుణెలో ప్రత్యేకంగా మహిళా విద్యార్థులను ఉద్దేశించి ఈ ప్రత్యేక సదస్సును ఏర్పాటు చేశారు. ఇందులో విద్యార్థినుల భద్రత, సమానత్వం, కెరీర్ అవకాశాలపై రాహుల్ గాంధీ నేరుగా విద్యార్థినులతో మాట్లాడనున్నారు.
Also Read..
కొత్త సిమ్ కార్డుకు బయోమెట్రిక్ తప్పనిసరి.. కొత్త నిబంధనలు ఇవే..
మళ్లీ తెరపైకి స్పిరిట్ వివాదం.. ఒక్క లైక్‌తో సందీప్‌రెడ్డి వంగాకు కౌంటర్ ఇచ్చిన దీపికా!
సంబంధిత వార్తలు

Murali Akunuri | రాహుల్ గాంధీ.. ఏడాదికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైంది?: ఆకునూరి మురళి
ఆగస్టు 22, 2026

Rajiv Gandhi | రాజీవ్ గాంధీకి నేతల నివాళులు
ఆగస్టు 20, 2026

CWC Meeting New Delhi | ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక భేటీ: ఆ రెండు అస్త్రాలతో కేంద్రంపై పోరుకు మాస్టర్ ప్లాన్.. రేవంత్ హాజరు
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Naveen Nicolas | ‘పది’ విద్యార్థులకు ప్రత్యేక ఆన్‌లైన్ డిజిటల్ క్లాసులు.. స్కూల్ ఎడ్యుకేషన్, టీ-శాట్ మధ్య కుదిరిన ఎంవోయూ
- ●Dasoju Sravan | రేవంత్ షెడ్యూల్లో ఏం తప్పులున్నాయో చెప్పాలి
- ●Vande Mataram | వందేమాతరం గొప్పదనం యువతకు తెలియాల్సిందే
- ●Bhagyashree Borse | బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ భాగ్యశ్రీ కాదని.. క్లారిటీ ఇచ్చిన టీ సిరీస్..!
- ●Seva Pakhwada | మోదీ సిల్వర్ జూబ్లీ వేళ.. దేశవ్యాప్తంగా బీజేపీ సేవా పఖ్వాడా
- ●Bhatti Vikramarka | పాలకులను నిలదీసే పత్రికా స్వేచ్ఛ ఉండాలి.. విమర్శలను స్వీకరించే ధైర్యం ప్రభుత్వాలకూ ఉండాలి

Naveen Nicolas | ‘పది’ విద్యార్థులకు ప్రత్యేక ఆన్‌లైన్ డిజిటల్ క్లాసులు.. స్కూల్ ఎడ్యుకేషన్, టీ-శాట్ మధ్య కుదిరిన ఎంవోయూ

Dasoju Sravan | రేవంత్ షెడ్యూల్లో ఏం తప్పులున్నాయో చెప్పాలి

Vande Mataram | వందేమాతరం గొప్పదనం యువతకు తెలియాల్సిందే

Bhagyashree Borse | బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ భాగ్యశ్రీ కాదని.. క్లారిటీ ఇచ్చిన టీ సిరీస్..!



