త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajiv Gandhi | రాజీవ్ గాంధీకి నేత‌ల నివాళులు

Rajiv Gandhi | భారతదేశ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ స‌హా పలువురు నేత‌లు నివాళులర్పిస్తున్నారు.

D

National | Published On Aug 20, 2026, 11.36 am IST

Rajiv Gandhi | రాజీవ్ గాంధీకి నేత‌ల నివాళులు
Advertisement

Rajiv Gandhi | త్రినేత్ర‌.న్యూస్ : భారతదేశ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు నివాళులర్పిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌ పర్సన్ సోనియా గాంధీ, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు ఢిల్లీలోని రాజీవ్ గాంధీ స్మారక చిహ్నమైన వీరభూమిని (Veer Bhumi) సందర్శించారు. అక్క‌డ రాజీవ్‌కు పుష్పాంజ‌లి ఘ‌టించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదిక‌గా షేర్ చేసింది.

Image

మరోవైపు రాజీవ్ గాంధీకి ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ సైతం నివాళులు అర్పించారు. ‘భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు’ అంటూ ఎక్స్ వేదికగా మోదీ పోస్టు పెట్టారు. ప‌లు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, నేత‌లు రాజీవ్ గాంధీని స్మ‌రించుకుంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Also Read..

ఐఐటీ మ‌ద్రాస్‌లో మెడిసిన్‌.. ఇంజినీర్ల‌తోపాటు వైద్యులు కూడా..

సూర్య‌, మ‌మితా బైజు కాంబోలో అచ‌లుడు మూవీ - స‌గం షూటింగ్ త‌ర్వాత ఎందుకు ఆగిపోయిందంటే?

దెబ్బ‌కు దెబ్బ‌.. ఢిల్లీలోని పాక్‌ హైకమిషన్ కార్యాలయం వెలుపల కూల్చివేతలు

Advertisement
Advertisement